
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని నాలుగు గోడల మధ్య నుంచి ఎదురుచూస్తున్న ఖైదీల క్షమాభిక్ష అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. సత్ప్రవర్తన కింద ఐదేళ్ల జైలు, రెండేళ్ల రిమిషన్ పూర్తిచేసుకున్న ఖైదీలను క్షమాభిక్షపై విడుదలకు శుక్రవారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది నేతృత్వంలో సుదీర్ఘ భేటీ జరిగింది. భేటీలో జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్, ఐజీ నర్సింహా, న్యాయశాఖ కార్యదర్శి తదితరులు ఖైదీల విడుదల మార్గదర్శకాలపై తుది కసరత్తు చేసినట్లు తెలిసింది. అనంతరం మార్గదర్శకాలను సీఎస్ ఎస్పీ సింగ్‌కు పంపించినట్లు సమాచారం.
మార్గదర్శకాలకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే క్షమాభిక్ష జీవోను గణతంత్ర దినోత్సవం రోజు(జనవరి 26)న జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంశాఖ వర్గాలు లిపాయి. చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్ కేంద్ర కారాగారాలు, జిల్లా జైళ్లలో మొత్తం 356 మంది ఖైదీలు క్షమాభిక్ష జాబితాలో ఉన్నట్టు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో మార్గదర్శకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment