DG Vinay kumar singh
-
జైళ్ల శాఖకు రూ.17 కోట్ల ఆదాయం: డీజీ వినయ్‌కుమార్ సింగ్
హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖ ఆదాయం 2014లో రూ.3 కోట్లు ఉండగా, 2018లో రూ.17 కోట్ల ఆదాయం గడించామని ఆ శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ చెప్పారు. గురువారం చంచల్ గూడలోని సీకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖైదీల ఆరోగ్యం పట్ల జైళ్ల శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండటంతో కొన్నేళ్లుగా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. మరణాల సంఖ్య 2014లో 56 ఉండగా, 2018లో కేవలం 8 ఉందన్నారు. ఈ ఏడాది 100 పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇటీవల రాష్ట్ర జైళ్లను సందర్శించిన బంగ్లాదేశ్, తీహార్ జైలు అధికారులు తెలంగాణ జైళ్ల శాఖ పనితీరును అభినందించారన్నారు. జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పరిశ్రమలు, పెట్రోల్ బంక్‌ల ద్వారా 2018లో రూ.496 కోట్ల టర్నోవర్ సాధించామని, ఇందులో రూ.17 కోట్ల 72 లక్షల లాభం పొందినట్లు తెలిపారు. 2018లో 34 మంది ఖైదీలకు రూ.8 లక్షల రుణాల ఇచ్చినట్లు, విద్యాదానం ద్వారా 22 వేల మంది ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. -
ఆదర్శంగా తెలంగాణ జైళ్ల శాఖ
హైదరాబాద్: తెలంగాణ జైళ్లశాఖ అనేక సంస్కరణలు అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ అన్నారు. బుధవారం చర్లపల్లి వ్యవసాయక్షేత్రం (ఓపెన్‌ఎయిర్‌జైల్) ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయుర్వేద చికిత్సాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఖైదీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చికిత్సాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ధీటుగా అదేస్థాయిలో మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా కేరళ నుంచి నిపుణులను రప్పించి ఖైదీలకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ ఆయుర్వేద సెంటర్‌కు వస్తున్న ఆదరణతో చర్లపల్లిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.శాఖ ఆదాయ వనరులను పెంచుకునే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగాయిలాంటి కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఏడాదిలో రూ: 3 కోట్ల ఆదాయ లక్ష్యంతో పాటుగా మూడు వేల మంది ఖైదీలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఖైదీల క్షమాభిక్ష ఫైల్‌ను మూడు నెలల క్రితమే ప్రభుత్వానికి అందజేశామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు ఖైదీల క్షమాభిక్ష అమలవుతుందన్నారు. కార్యక్రమంలో జైళ్లశాఖ డీఐజీజీ ఆకుల నర్సింహ్మ, చర్లపల్లి జైళ్ల పర్యవేక్షణాధికారులు రాజేశ్, యంఆర్ భాస్కర్, సిఐఎ అధ్యక్షుడు కట్టంగూర్ హరీష్‌రెడ్డి, ఐలా సెక్రటరీ రోషిరెడ్డి, విశ్వేశ్వరరావు, ఉప పర్యవేక్షణాధికారి చింతల దశరథం, సిబ్బంది పాల్గొన్నారు. -
'ఆ వ్యవస్థ కొనసాగటం దురదృష్టకరం'
► మెగసెసే అవార్డుగ్రహీత బెజవాడ విల్సన్ హైదరాబాద్: సమాజం సాంకేతికంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పటికీ ... మానవ మలమూత్రాలను చేతులతో ఎత్తే వ్యవస్థ ఇంకా కొనసాగడం దురదృష్టకరమని రామన్ మెగసెసే అవార్డుగ్రహీత, సఫాయి కర్మచారి ఆందోళన్ వ్యవస్థాపకుడు బెజవాడ విల్సన్ అన్నారు. సామాజిక సేవలో రామన్ మెగసెసే అవార్డు అందుకున్న విల్సన్‌ను మంగళవారం తెలంగాణ జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో డీజీ వినయ్‌కుమార్‌సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేసే కార్మికులు వేల సంఖ్యలో మరణిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాకీ వ్యవస్థను రూపుమాపడమే ధ్యేయంగా పోరాటాలు సాగిస్తానని బెజవాడ విల్సన్ చెప్పారు. -
జైళ్లల్లో అవినీతి లేదు: డీజీ వీకే సింగ్
మహబూబ్‌నగర్ క్రైమ్: రాష్ట్రంలోని జైళ్లలో అవినీతి ఏ మాత్రమూ లేదని, పూర్తిగా పారదర్శకంగా బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జైలుశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వన్‌టౌన్ సమీపంలో ఖైదీలతో నిర్వహించనున్న పెట్రోల్ బంకును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇది ఐదవ పెట్రోల్ బంక్ అని తెలిపారు. ఖైదీల్లో మార్పు., వారిలో ఆత్మస్థయిర్యం నింపడం కోసమే ఈ పెట్రోల్‌బంక్ తెరిచినట్లు తెలిపారు. ఇందులో వారే వర్కర్లుగా ఉంటారని, రోజువారి వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. -
ఈజ్ ఇట్ పోలీస్?
వ్యవస్థను ప్రశ్నిస్తూ పుస్తకం రాసిన ఐపీఎస్ బుధవారం ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి సాక్షి, హైదరాబాద్: ‘ఈ వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో పోలీసు ఉద్యోగంలో చేరా. చేయలేకపోయినందుకు నేను ఫెయిల్యూర్’.. ‘ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థతో సామాన్యులకు ఒరిగేదేముంది? కొద్దిమంది కబంధ హస్తాల్లో అంతా బందీలం’.. ఇవేవో సినిమా డైలాగులు అనుకుంటున్నారా? కానేకాదు.. సీనియర్ ఐపీఎస్ అధికారి, పోలీసు కో-ఆర్డినేషన్ విభాగం అదనపు డీజీ వినయ్‌కుమార్ సింగ్ (వీకే సింగ్) సంధించిన అక్షరాయుధం ‘ఈజ్ ఇట్ పోలీస్..? కన్ఫెషన్ ఆఫ్ ఎ టాప్ కాప్’ పేరుతో ఆంగ్లంలో రాసిన పుస్తకంలోని అంశాలు. గడిచిన రెండేళ్ల కాలంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్న ఈ పుస్తకం ప్రచురితమైంది. దీన్ని బుధవారం ఆవిష్కరించడానికి సన్నాహాలు పూర్తి చేశారు. పోలీసుశాఖలో నిజాయితీపరులైన అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది? రాజకీయ నేతల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ ఎలా నిర్వీర్యమవుతోంది? తదితర అంశాలతో పాటు రాజకీయ వ్యవస్థకు పోలీసుశాఖ ఏ విధంగా జేబు సంస్థగా మారింది అనే వివాదాస్పద అంశాలనూ వీకే సింగ్ తన పుస్తకంలో చర్చించారు. దీని ప్రచురణకు అనుమతి కోరుతూ ఏడాదిన్నర కిందట ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా నిరాకరించడంతో బ్రేక్ పడింది. సర్కారు చేసిన సూచనల మేరకు మార్పులు చేశాక పది రోజుల కిందట ఢిల్లీలో అన్నా హజారే చేతుల మీదుగా ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్‌లో, రానున్న రెండు నెలల్లో చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం రూపుదాల్చక ముందు నుంచే వివాదాస్పదం కావడంతో వీకే సింగ్ ఏడాది కాలంలో ఆంధ్రా రీజియన్ ఐజీ, తూనికలు కొలతలు విభాగం కంట్రోలర్, రాష్ట్ర ప్రత్యేక పోలీసు (ఏపీఎస్పీ)ల మీదుగా పోలీసు కో-ఆర్డినేషన్ విభాగానికి బదిలీపై వచ్చారు.