సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కీలకమైన అధికారులతో పాటు పలు జిల్లా ఎస్పీలను సైతం బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు పోలీస్ శాఖలో చర్చ సాగుతోంది. డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు 4 గంటలకు పైగా కసరత్తు చేసినట్టు తెలిసింది. రెండ్రోజులుగా ఇదే అంశంపై ఉన్నతాధికారులు, సీఎంవో అధికారులతో ప్రతిపాదనలపై కసరత్తు చేసి నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఆ ముగ్గురితో పాటు..
రాష్ట్ర కేడర్‌కు చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి రిపోర్టు చేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన అదనపు డీజీపీ సంతోశ్‌మెహ్రా, ఐజీలు అనిల్ కుమార్, దేవేంద్ర సింగ్ చౌహాన్‌లకు పోస్టింగ్స్ కల్పించాల్సి ఉంది. వీరిని నియమించాలంటే పలువురు అధికారులకు స్థానచలనం తప్ప దని పోలీస్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో శాంతిభద్రతల ఐజీ పోస్టు ఖాళీగా ఉంది. నగర కమిషనరేట్‌లోని ట్రాఫిక్ అదనపు కమిషనర్ పోస్టు ఐజీ క్యాడర్ పోస్టు.
ఈ రెండింటినీ అనిల్‌కుమార్, దేవేంద్ర సింగ్ చౌహాన్‌తో భర్తీ చేస్తారని, సైబరాబాద్ కమిష నర్ సందీప్ శాండిల్య సైతం బదిలీ కాబో తున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానంలో మహిళా ఐపీఎస్ అధికారి ఒకరికి అవకాశం కల్పించే యోచన ఉన్నట్టు సమాచారం. నగర కమిషన రేట్ పరిధిలోని శాంతి భద్రతల అదనపు కమిషనర్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌లను మార్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశా రని తెలిసింది. వరంగల్ కమిషనర్ సుధీర్ బాబు రెండేళ్లు పూర్తి చేయడంతో అక్కడ మరో డీఐజీ స్థాయి అధికారిని నియమించే అవ కాశం ఉంది. వరంగల్ జోన్‌లోని ముగ్గురు ఎస్పీలు, హైదరాబాద్ జోన్‌లోని ఒక ఎస్పీకి స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి.
ప్రభుత్వంపై మంత్రుల ఒత్తిడి
పదోన్నతులు పొందబోతున్న నాన్ క్యాడర్ ఎస్పీలను జిల్లా బాధ్యులుగా నియమించుకోవాలన్న ఆలోచనలో పలు వురు మంత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అనుభవం లేకుండా పదే పదే పొరపాట్లు చేస్తున్న జూనియర్ ఎస్పీలను మార్చి వారి స్థానంలో నాన్‌క్యాడర్ ఎస్పీ లను నియమించుకునేందుకు ఇప్పటికే ఇద్దరు మంత్రులు సిఫారసు లేఖలను ప్రభుత్వ పెద్దలకు అందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాచకొండ జాయింట్ కమిషనర్ తరుష్‌జోషీ కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ స్థానంలో డీఐజీ స్థాయి అధికారిని నియ మించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తోం ది. ఫైర్ విభాగం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్, జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌లకు స్థాన చలనం ఉండనున్నట్టు తెలుస్తోంది. సంతోశ్ మెహ్రాను జైళ్ల శాఖ డీజీగా, వీకేసింగ్‌ను ఫైర్ విభాగం, రాజీవ్ రతన్‌ను ఆపరేషన్స్ లేదా ఆర్గనైజేషన్‌కు మార్చే అవకాశాలున్నట్టు సమాచారం. వీకేసింగ్, గోపీకృష్ణ, సంతోశ్ మెహ్రా వచ్చే ఏడాది డైరెక్టర్ జనరల్ హోదా పదోన్నతి పొందనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment