IPS officers transfers
-
భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకంగా 37 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ నుంచి డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఎల్. సుబ్బారాయుడును తిరుపతి ఎస్పీగా నియమించారు.ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా కూడా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద సుబ్బారాయుడు ఓఎస్డీగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం ఆయన్ని డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపింది. బదిలీ చేసిన వారిలో 28 మందికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. మిగిలిన 9 మందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. -
ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొంత మంది అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ పరిపాలన చీఫ్ కమిషనర్‌గా జి. జయలక్ష్మిని నియమించింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ప్రత్యేక సీఎస్‌గా ఆర్పీ సిసోడియా, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక సీఎస్‌గా జి.అనంతరాము నియమితులయ్యారు. సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లాను నియమించింది. ఆర్థిక శాఖ (సీటీ) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గిరిజా శంకర్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆ బాధ్యతలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ హరికిరణ్‌ను బదిలీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బాధ్యతల నుంచి అజయ్ జైన్‌ను రిలీవ్ చేసింది. ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు ఇలా.. -
వారంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల వరకు పెద్ద సంఖ్యలో అధికారులను బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా అధికారింలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా అధికారులతో కొత్త జట్టు కూర్పుపై దృష్టిసారించింది.మరో వారం పది రోజుల్లో బదిలీల కసరత్తు పూర్తి చేసి ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలి పాయి. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఎలాంటి వివాదాలు, ఆరోపణల్లో చిక్కుకోని అధికారులకు బదిలీల్లో ప్రాధాన్యత లభించే అవకాశాలున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతోపాటు ప్రభుత్వం ముందు ఉన్న ఇతర సవాళ్లను దృష్టిలో పెట్టుకొని చురుకుగా పనిచేసే అధికారులను కీలక పోస్టుల్లో నియమించే అవకాశాలున్నాయి. సీఎస్ రేసులో జయేశ్ రంజన్, వికాస్‌రాజ్ మరికొందరు సీఎస్ శాంతికుమారి స్థానంలో కొత్త సీఎస్ పోస్టు రేసులో ఐఏఎస్ అధికారులు శశాంక్ గోయల్, కె. రామకృష్ణారావు, అరవింద్‌కుమార్, జయేశ్ రంజన్, సంజయ్‌జాజు, వికాస్‌రాజ్ ఉన్నారు. శశాంక్ గోయల్‌కు రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉండగా రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌కు ఏడాది,జ యేశ్ రంజన్, వికాస్‌రాజ్‌కు మూడేళ్లు, సంజయ్ జాజుకు ఇంకా 4 ఏళ్ల సరీ్వసు మిగిలి ఉంది.వారిలో గోయల్, కె.రామకృష్ణారావు, జయేశ్ రంజన్, సంజయ్ జాజు, వికాస్‌రాజ్ పేర్లను ప్రభుత్వం సీఎస్ పదవికి పరిశీలించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసు శాఖ ఇన్చార్జి డీజీపీగా రవిగుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియ మించిన విషయం తెలిసిందే. ఆయన్ను బదిలీ చేయకుండా కొనసాగించే అవకాశం ఉంది. డీజీపీని మార్చాలని ప్రభుత్వం భావిస్తే రేసులో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, శివధర్‌రెడ్డి రేసులో ఉన్నారు. ఇన్చార్జీల స్థానంలో పూర్తిస్థాయి అధికారులువిద్య, వైద్యం, పురపాలన, రెవెన్యూ, ఆర్థిక, పంచాయతీరాజ్, సంక్షేమం, పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయం వంటి కీలక శాఖలకు కొత్త కార్యదర్శులను నియమించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇన్చార్జీల పాలనలో ఉన్న చాలా శాఖలకు పూర్తిస్థాయి అధికారులను ప్రభుత్వం నియమించనుంది. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో ఇన్చార్జి సీఎండీ ఎస్వీఎం రిజ్వీ బదిలీ కానున్నట్టు గత వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముక్కుసూటిగా, నిక్కచి్చగా వ్యవహరించే అధికారిగా పేరుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు రాష్ట్ర విద్యుత్ సంస్థలను గాడినపెట్టే బాధ్యత అప్పగించింది.కానీ రాజకీయ సిఫారసులను పక్కనపెట్టి పూర్తిగా నిబంధనల మేరకే నిర్ణయాలు తీసుకుంటుండటంతో రిజ్వీని బదిలీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. విద్యుత్ సంస్థల్లో కీలకపాత్ర పోషించే ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఆయనకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన్ను పెద్దగా ప్రాధాన్యంలేని ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ పోస్టు కు బదిలీ చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా కొత్త అధికారిని నియమించే అవకాశాలున్నాయి. సింగరేణి బొగ్గు గనుల సంస్థకు కొత్త సీఎండీని సైతం నియమించనుంది.జిల్లాలకు కొత్త సారథులుజిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీలపై ఇప్పటి వర కు ఎన్నికల సంఘం ఆంక్షలు కొనసాగాయి. ఎన్నికలు ముగియడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ స్థా యి అధికారులను వారం రోజుల్లో బదిలీ చేసే అవకాశముంది. కొందరు అధికారులు ముఖ్యమైన జిల్లాల్లో పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. -
రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు డీజీ (విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్)గా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను అదనపు డీజీ (రైల్వేస్)గా నియమించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సెల్ (సీఐ) విభాగంలో ఐజీగా ఉన్న డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డిని విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా బదిలీ చేసింది. డ్రగ్ కంట్రోలర్ డీజీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు మరో 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇంతకముందే 26 మంది ఐఏఎస్‌ల బదీలీ చేసిన విషయం తెలిసిందే. కేవలం గంటల వ్యవధిలోనే ఐపీఎస్‌లకు కూడా స్థాన చలనం కల్పించడం గమనార్హం. బదిలీ అయిన ఐపీఎస్‌లు వీరే.. ►టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీగా వీవీ శ్రీనివాసరావు నియామకం ►ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమా రాజేశ్వరి ►మల్టీజోన్-7 డీసీపీగా జోయల్ డెవిస్ ►సీఐడీ ఎస్పీగా రాజేంద్రప్రసాద్ ►హైదరాబాద్ ట్రాఫిక్-3 డీసీపీగా వెంకటేశ్వర్లు ►సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా జానకీ దరావత్ ►ఎల్బీనగర్ డీసీపీగా ప్రవీణ్‌కుమార్ ►మేడ్చల్ డీసీపీగా నితికాపంత్ ►మాదాపూర్ సీడీపీగా వినిత్ ►కో-ఆర్డినేషన్ డీఐజీగా డా. గజారావ్ భూపాల్ ►రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాస్ ►రామగుండం సీపీగా ఎల్ఎస్ చౌహాన్ ►మల్కాజ్గిరి డీసీపీగా పద్మజ ►నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మీల ►ఖమ్మం సీపీగా సునీల్ దత్ ►సీఐడీ ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్ ►ట్రాన్స్‌కో ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి ►ఆదిలాబాద్ ఎస్పీగా గౌష ఆలం ►ములుగు ఎస్పీగా శబరీష్ ►సిద్దిపేట ఎస్పీగా బీ అనురాధ ► కొత్తగూడెం ఎస్పీగా రోహిత్‌రాజు ►మెదక్ ఎస్పీగా బాలస్వామి ►జయశంకర్ భూపాలపల్లి ఓఎస్డీగా అశోక్ కుమార్ -
20 మంది ఐఏఎస్, ఐపీఎస్, నాన్ కేడర్ ఎస్పీలపై ఈసీ వేటు..
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాష్ట్ర పరిపాలనపై దఖలుపడిన అధికారం మేరకు ఈ చర్య తీసుకుంది. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది. వీరిలో 18 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలకు శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆంక్షలు విధించింది. బదిలీ అయిన అధికారులు సత్వరమే బాధ్యతల నుంచి తప్పుకొని తమ తర్వాతి స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కూడా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, దేవాదాయ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని ఆదేశించింది. ఈ మూడు శాఖలకు కొత్త ముఖ్య కార్యదర్శులతోపాటు బదిలీ వేటుపడిన 20 మంది అధికారుల స్థానంలో గురువారం సాయంత్రం 5 గంటల్లోగా కొత్త అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక్కో పోస్టుకు ముగ్గురు ఐఏఎస్/ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రతిపాదించాలని.. వారికి సంబంధించిన గత ఐదేళ్ల వార్షిక పనితీరు మదింపు నివేదిక (ఏపీఏఆర్)లు, విజిలెన్స్ క్లియరెన్స్‌లను సైతం జత చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్.బీ జోషి గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. దీనితో బదిలీ అయిన వారు తక్షణమే ఆయా పోస్టులకు వెళ్లాలని సీఎస్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు, నిబంధనల అతిక్రమణ, తమ దృష్టికి వచ్చిన ఇతర అంశాల ఆధారంగానే పెద్ద సంఖ్యలో అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. పెద్ద ఎత్తున ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌లతో కూడిన బృందం ఈనెల 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో పర్యటించింది. ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమైంది. ఈ సమయంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలిపై ప్రతిపక్షాల ప్రతినిధులు ఈసీ బృందానికి పలు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లా కలెక్టర్లుగా, ఎస్పీలుగా బదిలీ చేశారని, నిష్పక్షపాతంగా వ్యవహరించే యువ అధికారులను పక్కనపెట్టారని పేర్కొన్నట్టు సమాచారం. దీనికితోడు ఈ అధికారులు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేసిన విషయం కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. గతంలో ఎన్నికల నిర్వహణను ఎత్తిచూపుతూ.. కేంద్ర, రాష్ట్రాల ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ఉన్నతాధికారులు, డీజీపీ, సీఎస్, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించిన సమావేశాల సందర్భంగా గతంలో నిర్వహించిన ఎన్నికల తీరుపై సీఈసీ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలతోపాటు తర్వాత జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు, మద్యం, బంగారం, ఇతర కానుకలు పంపిణీ చేసినట్టు ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయని గుర్తు చేసినట్టు తెలిసింది. తెలంగాణతోపాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఓటర్లను అత్యధికంగా ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా ఎన్నికల సమయంలో జప్తు చేస్తున్న డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం, వెండి, ఇతర కానుకలు నామమాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిసింది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలు నిర్వహించిన తీరుపై పదేపదే ఆక్షేపణలు తెలిపినట్టు సమాచారం. మరోవైపు డ్రగ్స్, లిక్కర్ మాఫియాపై చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో పెద్ద మొత్తంలో దొరికి డ్రగ్స్ రాష్ట్రం నుంచే తరలివెళ్లినట్టు నివేదికలు ఉన్నాయని.. డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపారా? అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. రవాణా శాఖ కార్యదర్శి అధికార పార్టీ సభలకు వాహనాల కేటాయింపులో సహకరించినట్టు వచ్చిన ఆరోపణలతో ఆయనను తొలగించినట్టు తెలిసింది. వివిధ జిల్లాల్లో ఎస్పీలు ప్రతిపక్షాల సభలు, సమావేశాలకు అనుమతులు నిరాకరించడం, నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని వేటు వేసినట్టు సమాచారం. మరో నాలుగు రాష్ట్రాల్లోనూ బదిలీలు.. తెలంగాణతోపాటు శాసనసభ సాధారణ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో వేటుపడిన వారిలో 9 మంది కలెక్టర్లతోపాటు పలువురు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ఉన్నారు. అధికార వర్గాల్లో ప్రకంపనలు రాష్ట్రంలో విస్తృతంగా సమీక్షలు జరిపి వెళ్లిన వారంలోనే కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది అధికారులపై బదిలీ వేటు వేయడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీ చేసిన అధికారులను ఇంకా ఎలాంటి ఇతర పోస్టుల్లో ఇంకా నియమించలేదు. అయితే బదిలీ అయిన 10 మంది జిల్లా ఎస్పీల్లో 9 నాన్ కేడర్ ఎస్పీలే (ఐఏఎస్ కాకుండా ఎస్సై, సీఐ వంటి పోస్టుల నుంచి సీనియారిటీతో ఎస్పీగా నియామకమైనవారే) కావడం గమనార్హం. సాధారణంగా జిల్లా ఎన్నికల అధికారులుగా కలెక్టర్లే వ్యవహరిస్తారు. ఇలాంటిది నాలుగు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయడం, వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ ఆదేశించడం గమనార్హం. -
పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలు.. -
ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీపై బదిలీ వేటు
చండీగఢ్: పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కాన్వాయ్‌ను అడ్డుకుని రైతులు ఆకస్మికంగా ఆందోళనకు దిగడం, ఫ్లై ఓవర్ మీదనే ప్రధాని ఆగాల్సిరావడం వంటి భద్రతా వైఫల్య ఘటనలపై పంజాబ్ రాష్ట్ర సర్కార్.. పోలీస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ప్రధానికి సరైన భద్రత కల్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై ఐపీఎస్ అధికారులను బదిలీచేశారు. బుధవారం రోజు ఘటన జరిగిన ఫిరోజ్‌పూర్ పోలీస్ పరిధి బాధ్యతలు చూసిన ఫిరోజ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ), ఐపీఎస్ అధికారి హర్మన్దీప్ సింగ్ హాన్స్‌ను ట్రాన్స్ఫర్ చేశారు. హర్మన్దీప్ను లూథియానాలోని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్(ఐఆర్బీ) మూడో కమాండెంట్‌గా బదిలీచేశారు. ఈయన స్థానంలో ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీగా నరీందర్ భార్గవ్‌ను నియమించారు. నౌనిహాల్ సింగ్, ఏకే మిట్టల్, సుఖ్చయిన్ సింగ్, నానక్ సింగ్, అల్కా మీనాలను బదిలీచేశారు. పీపీఎస్ అధికారులు హర్కమల్ప్రీత్ సింగ్, కుల్జీత్ సింగ్‌లనూ మరో చోటుకు బదిలీచేశారు. తప్పంతా ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీదే.. జాతీయ స్మారక స్తూపం వద్ద నివాళులర్పించేందుకు హుస్సైనీవాలాకు బయల్దేరిన ప్రధాని మోదీని మార్గమధ్యంలో రైతులు అడ్డుకున్న ఉదంతంపై కేంద్ర హోం శాఖకు పంజాబ్ సర్కార్ ఒక నివేదికను సమర్పించింది. జనవరి ఐదు నాటి ఘటనలో వివరణ ఇవ్వాలని బటిందా ఎస్ఎస్పీ అజయ్ మలూజాను కేంద్ర హోం శాఖ వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు శుక్రవారం పంపిన విషయం తెల్సిందే. దానిపై మలూజా ఇచ్చిన వివరణ.. హోం శాఖకు పంపిన నివేదికలో ఉంది. ఆ నివేదికలోని వివరాలు కొన్ని బహిర్గతమయ్యాయి. ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీ హర్మణ్ చేసిన తప్పు వల్లే మోదీకి భద్రత కల్పన విఫలమైందని మలూజా ఆరోపించారు. హుస్సైనీవాలాకు వెళ్లే మార్గంలో బటిందా పరిధిలోని తమ పరిధి వరకూ మోదీకి రక్షణ కల్పించామని, ఫిరోజ్‌పూర్ పరిధిలోకి కాన్వాయ్ వచ్చాకే ఈ ఘటన జరిగిందని మలూజా వివరణ ఇచ్చారు. ప్రధాని రాకకు ముందు జరిగిన ఘటనలు మొదలుకుని, రైతుల ఆందోళన, ప్రధాని బహిరంగ సభకు వెళ్లకుండా వెనుతిరగడం వరకు జరిగిన ఘటనలు, వాటి పర్యవసానాలను పంజాబ్ ప్రభుత్వం క్రమపద్ధతిలో నివేదించింది. రైతుల ఆందోళన అనేది ముందస్తు వ్యూహం కాదని, హఠాత్పరిణామం అని నివేదిక పేర్కొంది. -
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్?
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలకు త్వరలో మోక్షం కలగనుంది. అదనపు డీజీపీల నుంచి ఎస్పీ ర్యాంకు అధికారుల వరకు భారీ స్థాయిలో బదిలీలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కీలక విభాగాలు మొదలుకొని 80 శాతం జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్లలో ఉన్న డీసీపీలను బదిలీ చేసేందుకు ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలుస్తోంది. తెలంగాణ పోలీస్ శాఖకు ఆయువుపట్టు లాంటి హైదరాబాద్ కమిషనరేట్‌కూ కొత్త బాస్‌ను నియమించేందుకు కసరత్తు జరిగినట్టు తెలిసింది. అంజనీకుమార్ స్థానంలో ఇటీవల కేంద్ర డిప్యుటేషన్ పూర్తిచేసుకున్న అదనపు డీజీపీ సీవీ ఆనంద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అదేవిధంగా మరో అదనపు డీజీపీ జితేందర్ పేరూ ప్రతిపాదనలో ఉన్నట్లు తెలిసింది. ఇకపోతే రాచ కొండ కమిషనరేట్‌కూ కొత్త చీఫ్‌ని నియమించనున్నారు. మహేష్ భగవత్ స్థానంలో ఐజీ నాగిరెడ్డి లేదా ఐజీ డీఎస్ చౌహాన్ ఉండనున్నట్టు సమాచారం. దర్యాప్తు విభాగాలకు కొత్త బాస్‌లు రాష్ట్రంలో ఉన్న రెండు దర్యాప్తు విభాగాలకు నూతన బాస్‌లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు డైరెక్టర్ జనరల్‌గా అదనపు డీజీపీ జితేందర్ లేదా అంజనీకుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) చీఫ్‌గా మహేష్ భగవత్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విజిలెన్స్‌తోపాటు అవినీతి నియంత్రణనూ ఒకే విభాగం కిందకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నందున రెండింటికీ కలిపి ఒకే డీజీని నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న గోవింద్‌సింగ్‌ను జైళ్ల శాఖకు డైరెక్టర్ జనరల్‌గా నియమించే అవకాశం ఉంది. లాంగ్ స్టాండింగ్‌కు స్థాన చలనం చాలాకాలంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డితోపాటు సిబ్బంది విభాగం అదనపు డీజీపీగా ఉన్న బి.శివధర్‌రెడ్డిని సైతం బదిలీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. వీరిలో ఒకరిని శాంతి భద్రతల అదనపు డీజీపీగా నియమిస్తారని, మరొకొరిని ప్రొవిజినల్ అండ్ లాజిస్టిక్ అదనపు డీజీపీగా బదిలీచేసే అవకాశాలున్నట్టు తెలిసింది. రాచకొండలో అదనపు సీపీగా ఉన్న సుధీర్‌కుమార్‌ను ఒక జోన్‌కు ఐజీగా నియమించే అవకాశముంది. అదేవిధంగా నగర కమిషనరేట్లలో డీఐజీలుగా ఉన్న ఎం.రమేష్‌రెడ్డి, ఏఆర్.శ్రీనివాస్, విశ్వప్రసాద్‌లను కొత్తగా ఏర్పడబోతున్న రేంజులకు డీఐజీలుగా లేదా జాయింట్ సీపీలుగా బదిలీ చేయనున్నట్టు తెలిసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిగుప్తాకు సైతం స్థానచలనం కలిగే అవకాశముంది. కాగా, ప్రస్తుతం డీఐజీ పదోన్నతి కోసం వేచిచూస్తున్న సీనియర్ ఎస్పీలను దర్యాప్తు విభాగాల్లోకి తీసుకొని కీలక కేసుల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాల నుంచి బదిలీ అయ్యే అవకాశం ఉన్న అధికారులను సీఐడీతోపాటు ఏసీబీలో నియమించే అవకాశం ఉంది. జిల్లాలకు కన్ఫర్డ్ ఐపీఎస్‌లు కన్ఫర్డ్ ఐపీఎస్ జాబితాలోకి వచ్చిన 23 మంది అధికారులను వివిధ జిల్లాలతోపాటు ఎస్పీ హోదా ఉన్న కమిషనరేట్లకు బదిలీ చేయా లని పోలీస్ శాఖ ప్రతిపాదించినట్టు సమాచారం. అదేవిధంగా జిల్లాల్లో లాంగ్ స్టాండింగ్‌లో ఉన్న ఐపీఎస్, నాన్‌కేడర్ అధికారులను రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్‌లోని జోన్లకు డీసీపీలుగా నియమించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. -
పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా ఉన్న కేఆర్ఎం కిషోర్‌ను లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌గా నియమిస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. మైనార్టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్‌ను సెర్ప్ సీఈవోగా నియమించి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌లో డైరెక్టర్ ఆఫ్ అప్పీల్స్ అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మధ్యనే బదిలీ అయిన కొంతమంది ఐఏఎస్‌లను పరిపాలనా సౌలభ్యం కోసం తిరిగి పాతస్థానాలకే పంపించారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు. -
దిశ డీఐజీగా రాజకుమారి
సాక్షి, అమరావతి: దిశ డీఐజీగా విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె స్థానంలో దిశా విభాగం ఎస్పీగా పని చేస్తున్న ఎం.దీపికాను నియమించారు. విజయనగరం, నెల్లూరు, కృష్ణా, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల ఎస్పీలకు స్థానచలనం కలిగించారు. మొత్తంగా రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఐపీఎస్‌ల వివరాలు.. -
సీఎం వద్ద ఫైల్: ఎప్పుడైనా ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధ మైంది. ఇటీవల పోలీసుశాఖలో ఎస్సై నుంచి ఐపీఎస్‌ల వరకు అన్ని రకాల పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ ఆంక్షలు కూడా క్రమంగా సడలిస్తుండటంతో ఐపీఎస్ అధికారుల బదిలీలకు చకచకా అడు గులు పడుతున్నాయని సమాచారం. బదిలీల ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంది. దీనిపై ఏ క్షణంలోనైనా సీఎం ఆమోదముద్ర వేసే అవకాశముంది. మూడేళ్లగా రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు చోటుచేసుకోలేదు. గతేడాది వేసవిలో వారి బదిలీలు చేపడుదామనుకున్నా కరోనా తొలివేవ్ లాక్డౌన్, అనంతరం దుబ్బాక ఉప ఎన్నిక, హైదరాబాద్‌లో వరదలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. తరువాత నాగార్జునసాగర్ ఉపఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట తదితర పురపాలిలకు ఎన్నికలు రావడంతో ఐపీఎస్‌ల బదిలీలకు బ్రేకులు పడుతూ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేనందున బదిలీలకు ఇదే సరైన సమయమని ప్రభుత్వం భావిస్తోంది. పైగా గతేడాది కేంద్రం 11 మంది కొత్త ఐపీఎస్‌లను కేటాయించింది. అదే సమయంలో ఇటీవల 33 మంది అడిషనల్ ఎస్పీలకు నాన్–కేడర్ ఐపీఎస్‌లుగా పదోన్నతులు కల్పించింది. ఆ జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీలు... ఈ బదిలీల్లో పూర్తిస్థాయి ఎస్పీలు లేని నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఈ కొరత తీరనుందని సమాచారం. ఒకే స్థానంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న వారిలో కొందరు బదిలీ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కొత్త కమిషనరేట్లయిన కరీంనగర్ (సీపీ కమలాసన్‌రెడ్డి), నిజామాబాద్ (సీపీ కార్తికేయ), రామగుండం (సీపీ సత్యనారాయణ)లకు ఆవిర్భావం నుంచి కమిషనర్లు మారలేదు. సిద్దిపేట కమిషనరేట్‌లోనూ సీపీ జోయల్ డేవిస్ బాధ్యతలు తీసుకుని దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇక ఇటీవల ఖమ్మంకు ఇక్బాల్ స్థానంలో విష్ణు వారియర్, వరంగల్‌లో సీపీగా రిటైరైన రవీందర్ స్థానంలో తరుణ్ జోషి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నల్లగొండ ఎస్పీ, డీఐజీ రంగనాథ్, సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హేగ్డే సహా ఒకరిద్దరు సెంట్రల్ సర్వీసులో ఉన్న సీనియర్ ఐపీఎస్‌లకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న సీనియర్లకు జీహెచ్ఎంసీ పరిధిలో, డీజీపీ కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలిసింది. పదోన్నతులు సాధించినా పాత స్థానంలోనే.. 2019 పార్లమెంటు ఎన్నికల తరువాత చాలా మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు వచ్చినా పాత స్థానాల్లోనే ఉండిపోయారు. వారిలో 1995, 1996, 2006 బ్యాచ్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌లు తమకు స్థానచలనం, పదోన్నతికి తగిన స్థానం రాలేదని అసంతృప్తిగానే ఉన్నారు. వారిలో 2006 బ్యాచ్‌కు చెందిన అధికారులు సీనియర్ ఎస్పీలుగా, డీఐజీలుగా రెండుసార్లు పదోన్నతులు సాధించడం గమనార్హం. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విమెన్‌సేఫ్టీ వింగ్ స్వాతి లక్రా, గురుకుల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌లు ఐజీ నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి సాధించారు. అయినా వారి పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. అలాగే 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన చారుసిన్హా, అనిల్‌కుమార్, వీసీ సజ్జనార్‌లు ఐజీ నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) అధికారులుగా పదోన్నతి సాధించారు. వారిలో అనిల్ కుమార్ హైదరాబాద్ కమిషనరేట్‌లో అడిషనల్ సీపీ (ట్రాఫిక్)గా, వీసీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఇక 2006 బ్యాచ్‌లో విమెన్ సేఫ్టీ వింగ్ (సీఐడీ) డీఐజీ సుమతి, కార్తికేయ, శ్రీనివాసులు, పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ రమేశ్‌నాయుడు, శ్రీనివాసులు (సీఐడీ)తోపాటు వెంకటేశ్వర రావు కూడా పదోన్నతి సాధించారు. వారిలో వెంకటేశ్వరరావు రిటైరవగా మిగిలిన వారంతా అవే స్థానాల్లో పనిచేస్తున్నారు. -
ముగ్గురు ఐపీఎస్‌లపై కేంద్రం బదిలీ వేటు
న్యూఢిలీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి ఇరు పక్షాల మధ్య మరింత అగ్గి రాజేసింది. తమ విధుల్ని నిర్వర్తించడంలో విఫలమయ్యారంటూ బెంగాల్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌పై రావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఏకపక్షంగా సమన్లు జారీ చేసింది. ఐపీఎస్ అధికారులైన భోలనాథ్ పాండే (డైమండ్ హార్బర్ ఎస్పీ), ప్రవీణ్ త్రిపాఠి (డీఐజీ, ప్రెసిడెన్సీ రేంజ్), రాజీవ్ మిశ్రా (ఏడీజీ, సౌత్ బెంగాల్) నడ్డా బెంగాల్ పర్యటనకి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తమ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించనందుకు వారిని కేంద్రానికి డిప్యుటేషన్ రావాల్సిందిగా హోంశాఖ ఆదేశించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా పోలీసు అధికారుల్ని కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌కి రమ్మంటే ముందస్తుగా ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ కేంద్రం ఏకపక్షంగా ఈ సమన్లు జారీ చేసింది. శాంతి భద్రతలు రాష్ట్ర అంశం: మమతా సర్కార్ ఎదురు దాడి నడ్డా పర్యటనలో భద్రతా వైఫల్యాలపై చర్చించడానికి పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ రావాల్సిందిగా సమన్లు జారీ చేయడంపై మమతా సర్కార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశమని, కేంద్రం అందులో తలదూర్చాల్సిన అవసరం లేదంటూ ఎదురు దాడికి దిగింది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ కళ్యాణ్ బెనర్జీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకి లేఖ రాశారు. నిబంధనలేమంటున్నాయి? కేంద్ర డిప్యుటేషన్‌కు రమ్మని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను ఐపీఎస్ అధికారులు తప్పక పాటించాలని, వేరే ఆప్షన్ ఉండదని నిబంధనలు చెబుతున్నాయి. అలాంటి ఉత్తర్వులు పొందిన ఐపీఎస్ ఆఫీసర్లను సదరు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రిలీవ్ చేయాల్సిఉంటుంది. ఐపీఎస్ రూల్స్– 1954 ప్రకారం ఐపీఎస్‌ల విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య విభేదాలు వస్తే, రాష్ట్రాలు కేంద్ర ఆదేశాన్ని అనుసరించక తప్పదు. సమాధానం ఇవ్వకపోతే: మరోవైపు పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 267 ఫిర్యాదుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తప్పు పట్టింది. మరో 15 రోజుల్లో మమతా సర్కార్ ఏమీ మాట్లాడకపోతే ఆ ఫిర్యాదుల్ని కేంద్ర హోంశాఖకు పంపిస్తామని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖ శర్మ హెచ్చరించారు. -
నేడో రేపో బదిలీలు!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకటిరెండు రోజుల్లో ఇది కొలిక్కి వచ్చి పెద్ద సంఖ్యలో అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఈ ప్రభావం రాజధానిలోని మూడు కమిషనరేట్ల పైనా ఉండే అవకాశం ఉంది. సైబరాబాద్, రాచకొండలతో పోలిస్తే హైదరాబాద్‌లో భారీ మార్పులు ఉండనున్నాయి. దాదాపు 11 నెలలుగా పదోన్నతి పొందిన అధికారులు బదిలీ ఉత్తర్వుల కోసం ఎదరు చూస్తున్నారు. సాధారణంగా కమిషనర్ స్థాయి అధికారులకు రెండేళ్లు టెన్యూర్‌గా పరిగణిస్తూ ఉంటారు. ఇది పూర్తయినప్పటి నుంచి బదిలీ ఇప్పుడా.. అప్పుడా..అనే పరిస్థితే ఉంటుంది. నగరంలో ఉన్న మూడు కమిషనరేట్లలోనూ రాచకొండ సీపీ మహేష్ మురళీధర్ భగవత్ ఈ పోస్టులో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బదిలీ అనివార్యమని వినిపిస్తోంది. మరోపక్క ఆయన త్వరలో అదనపు డీజీగా పదోన్నతి పొందనున్న నేపథ్యంలో అప్పటి వరకు ఇదే పోస్టులో కొనసాగుతారనే వాదనా ఉంది. మరోపక్క నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ పోస్టులోకి వచ్చి 22 నెలలే అవుతోంది. దీంతో ఆయన బదిలీ ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఈ స్థాయి టెన్యూర్ కూడా పూర్తి కాలేదు. దీంతో ఈయన బదిలీ అనే ప్రశ్నే ఉత్పన్నం కావట్లేదు. నగర పోలీసు కమిషనరేట్‌లో పని చేస్తున్న ఐపీఎస్ అధికారుల్లో అనేక మందికి గత ఏడాది ఏప్రిల్‌లో పదోన్నతులు వచ్చాయి. నగర అదనపు సీపీగా (నేరాలు) పని చేస్తున్న షికా గోయల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీ) నుంచి అదనపు డీజీగా పదోన్నతి పొందారు. అలాగే తూర్పు మండల డీసీపీ ఎం.రమేష్, పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, మధ్య మండల డీసీపీ ఎం.విశ్వప్రసాద్, సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సైతం ఎస్పీ నుంచి డీఐజీలుగా పదోన్నతి పొందారు. అయినప్పటికీ అప్పటి నుంచి ఎస్పీ స్థాయి పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. దక్షిణ మండల డీసీపీగా పని చేసిన అంబర్ కిషోర్ ఝా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వద్ద ఓఎస్డీగా వెళ్ళిన తర్వాత ఈ పోస్టులో ఎవరినీ నియమించలేదు. కొన్నాళ్ళు అవినాష్ మహంతి, ఆపై రాయకొండ కమిషనర్ సత్యనారాయణ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు నగర సంయుక్త పోలీసు కమిషర్ స్థాయిలో పరిపాలన, సమన్వయం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పొరుగున ఉన్న రాచకొండలో సంయుక్త సీపీగా విధులు నిర్వర్తిస్తున్న జి.సుధీర్‌బాబు సైతం ఐజీగా పదోన్నతి పొందారు. వీరికి తోడుగా ఇటీవలే సైబరాబాద్‌లోని మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వర్రావుకు డీఐజీగా ప్రమోషన్ వచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎనిమిది పోస్టుల్లో మార్పు అనివార్యంగా మారింది. మరోపక్క సిటీలోని ఉత్తర మండల డీసీపీగా పని చేస్తున్న కల్వేశ్వర్ సింగెనవర్ టెన్యూర్ పూర్తికానప్పటికీ.. ప్రస్తుతం ఉన్న అవసరాల దృష్ట్యా ఆయన్ను సీసీఎస్ డీసీపీగా బదిలీ చేస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రానుండటంతో ఈ బదిలీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
జిల్లాకు కొత్త పోలీస్ బాస్‌లు
సాక్షి, చిత్తూరు అర్బన్ : జిల్లాలో ఐపీఎస్ అధికారులను బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీచేయగా.. జిల్లాకు చెందిన తిరుపతి, చిత్తూరు ఎస్పీలకు స్థానచలనం కలిగింది. మంగళగిరిలోని 6వ బెటాలియన్ ఏపీఎస్పీ కమాండెంట్‌గా ఉన్న డాక్టర్ గజరావు భూపాల్ తిరుపతి ఎస్పీగా నియమితులయ్యారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఎస్.సెంథిల్‌కుమార్‌కు చిత్తూరు ఎస్పీగా పోస్టింగ్ లభించింది. కాగా చిత్తూరులో ఎస్పీగా పనిచేస్తున్న చింతం వెంకట అప్పలనాయుడును రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి, తిరుపతి ఎస్పీగా ఉన్న కె.ఎన్.అన్బురాజన్‌ను వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. సెంథిల్‌కుమార్ నేపథ్యం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన సెంథిల్‌కుమార్ 2008 ఆంధ్రా క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన వరంగల్ జిల్లా ములుగు ఏఎస్పీగా పోలీసుశాఖలోకి ప్రవేశించారు. అనంతరం శ్రీకాకుళం ఏఎస్పీ, శంషాబాద్ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. విద్యాభాస్యం సెంథిల్ కుమార్ పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలో విద్యనభ్యసించారు. ఇంటర్ ప్రైవేటు కళాశాలలో చదివారు. టీచింగ్ డిప్లమో చేశారు. ఆ తర్వాత బీఎస్సీ గణితం, తమిళం లిటరేచర్‌లో పట్టభద్రులు. ఆయన 2005 నుంచి 2008 వరకు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. అప్పలనాయుడు ముద్ర చిత్తూరు ఎస్పీగా కొన్నాళ్లే పనిచేసినా పాలనలో వెంకట అప్పలనాయుడు తనదైన శైలిలో ముద్రవేశారు. ఈ ఏడాది జూన్ 12న చిత్తూరులో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన సొంత శాఖను ప్రక్షాళన చేయడంలో సఫలీకృతులయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్‌కే మచ్చ తెచ్చిపెట్టిన కొందరు అధికారులు, సిబ్బంది మూలాలను కదిలించారు. ఎస్బీని పూర్తిగా మార్చేశారు. కుప్పంలో పెద్ద ఎత్తున నకిలీ నోట్ల గుట్టును రట్టుచేశారు. పోలీసు సిబ్బందితో నేరుగా మాట్లాడడంతో అందరికీ చేరువయ్యారు. రౌడీషీటర్లు, సామాన్యులను ఇబ్బంది కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించారు. తన వద్ద పనిచేసే డ్రైవర్ నుంచి సీసీ, గన్మెన్లు అందర్నీ ఇతర ప్రాంతాలకు బదిలీచేసి.. కొత్తవారిని నియమించుకున్నారు. పోలీసు బదిలీల్లో పారదర్శకంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. బదిలీపై ‘సాక్షి’తో వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ ‘‘ఇక్కడ పనిచేసింది కొన్నాళ్లనే ఫీలింగ్ లేదు. చిత్తూరులో రెండేళ్లపాటు ఉన్నట్లు అనుభూతి కలిగింది. జిల్లాలోని ఒకటి రెండు స్టేషన్లు తప్ప.. అన్ని చోట్లకు వెళ్లి సిబ్బందితో మాట్లాడగలిగాను. ప్రధానంగా పోలీసు శాఖలో కిందిస్థాయి సిబ్బంది నుంచి జిల్లాలోని ప్రజాప్రతినిధుల వరకు పాలనాపరంగా మంచి సహకారం అందించారు. ఇప్పుడు సీఎం గారి పేషీలోని ఇంటెలిజెన్స్ విభాగానికి వెళ్లడం ఆనందంగానే ఉంది.’’ అని పేర్కొన్నారు. సీఎం జిల్లాకు అన్బురాజన్ గత ఏడాది నవంబరు 2వ తేదీన తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అన్బురాజన్ వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. నిత్యం ప్రముఖులతో సందడిగా ఉండే తిరుపతిలో శాంతి భద్రతల పర్యవేక్షణ కత్తిమీద సాములాంటిది. అలాంటిది అన్బురాజన్ ఇక్కడ పరిస్థితులను పూర్తిగా పర్యవేక్షిస్తూ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. శ్రీవారి ఆలయ భద్రత పర్యవేక్షణ, శాంతిభద్రతల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పాలన కొనసాగించారు. ఈయన పనితీరును చూసే సీఎం సొంత జిల్లా అయిన వైఎస్సార్ కడపకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. గజరావు కుటుంబమంతా వైద్యులే తూర్పుగోదావరి జిల్లా గొళ్లప్రోలు మండలం చేబ్రోలుకు డాక్టర్ గజరావు భూపాల్ 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఈయన తల్లిదండ్రులు అనురాధ, సీతారామయ్యస్వామి ఇద్దరూ వైద్యులే. గజరావు భూపాల్ సైతం ఎంబీబీఎస్ పూర్తిచేసి.. సివిల్స్‌వైపు వచ్చారు. కాకినాడలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఈయన తమ్ముడు హేమంత్ కూడా ఎంబీబీఎస్ మానసిక వైద్య శాస్త్రంలో ఎండీ చేశారు. డాక్టర్ గజరావు భూపాల్ భద్రచాలం, మెదక్ జిల్లాలో ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం పదోన్నతిపై ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. తెలంగాణ, ఆంధ్రరాష్ట్రం విభజన నేపథ్యంలో ఏపీ క్యాడర్‌కు ఆయన వచ్చారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. విధి నిర్వహణలో రాజీలేని వ్యక్తిగా పేరుగాంచారు. ప్రస్తుతం మంగళరిగి 6వ బెటాలియన్ కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ తిరుపతి ఎస్పీగా వస్తున్నారు. వచ్చే నెల బాధ్యతలు.. జిల్లాకు వస్తున్న ఇద్దరు ఎస్పీలు సైతం వచ్చేనెల బాధ్యతలు స్వీకరించనున్నారు. అక్టోబర్ మొదటి వారంలో చిత్తూరు, తిరుపతి ఎస్పీలు ఇక్కడ బాధ్యతలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు.. అధికారి బదిలీ అయిన స్థానం 1 సీహెచ్ విజయరావు గుంటూరు రూరల్ ఎస్పీ 2 విక్రాంత్ పాటిల్ విజయవాడ సిటీ డీసీపీ 2 3 సెంథిల్ కుమార్ చిత్తూరు ఎస్పీ 4 వెంకట అప్పల నాయుడు ఇంటెలిజెన్స్ ఎస్పీ 5 కేకేఎన్ అన్బురాజన్ కడప ఎస్పీ 6 గజారావు భూపాల్ తిరుపతి అర్బన్ ఎస్పీ 7 ఎస్వీ రాజశేఖరబాబు ఏఐజీ శాంతి భద్రతలు(డీజీపీ కార్యాలయం) 8 భాస్కర్ భూషణ్ ఏఐజీ పరిపాలన విభాగం(డీజీపీ కార్యాలయం) 9 ఎస్ హరికృష్ణ విజయవాడ సిటీ డీసీపీ(అడ్మిన్) 10 అమిత్‌గార్గ్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ 11 పీవీ సునీల్‌కుమార్ సీఐడీ అడిషనల్ డీజీపీ 12 కే వెంకటేశ్వరరావు ఏపీట్రాన్స్కో జేఎండీ(విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ), పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు -
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
-
వారంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వారం రోజుల్లో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవ కాశం కనిపిస్తోంది. రెండు, మూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న పలువురు అధికారులను లోక్‌సభ ఎన్నికలకు ముందే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ఐజీలు, ఎస్పీలను బదిలీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటుకాబోతున్న మరో రెండు నూతన జిల్లాలకు కూడా ఎస్పీలను నియమించేందుకు పోలీస్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. సీనియర్ ఎస్పీలుగా పనిచేస్తున్న వారికి ఇటీవలే ప్రభుత్వం డీఐజీలుగా పదో న్నతి కల్పించింది. వీరికి పోస్టింగ్స్ కల్పించాల్సి ఉంది. 2005 బ్యాచ్‌కు చెందిన ఎం.రమేశ్, విశ్వప్రసాద్, అవినాష్ మహంతి డీఐజీలుగా పదోన్నతి పొందనున్నారు. ఇక డీఐజీలుగా ఉన్న అధికారులు ప్రభాకర్‌రావు, సుధీర్ బాబు, అకున్‌సబర్వాల్, ప్రమోద్‌కుమార్ ఐజీలు గా పదోన్నతి పొందనున్నారు. ఇక 1994 బ్యాచ్‌కు చెందిన ఐజీలు శివధర్‌రెడ్డి, సౌమ్యామిశ్రా, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, షికాగోయల్ అదనపు డీజీపీలుగా పదో న్నతి పొందనున్నారు. పదోన్నతి కాకుండా బదిలీ అయ్యే వారిలో నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, నగర శాంతి భద్రతల అదనపు కమిషనర్ చౌహాన్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఉన్నట్లు తెలిసింది. పోలీస్ శాఖను వేధిస్తోన్న డీఐజీల కొరతఈ పదోన్నతులతో తీరేలా కనిపిస్తోంది. డీఐజీలుగా ఇప్పటికే కమలాసన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, శివకుమార్ పదోన్న తి పొందగా, వీరితో పాటు రమేశ్, విశ్వప్రసాద్, అవినాష్‌మహంతి డీఐజీ ర్యాంకులోకి చేరబోతున్నారు. -
విజయవాడకు కొత్త పోలీస్ కమిషనర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఏపీ ప్రభుత్వం 9 మంది ఐపీఎస్‌లను ట్రాన్స్ఫర్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. దీంతో గౌతమ్ సవాంగ్ బదిలీతో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా ఎవరు నియమితులవుతారనే ఉత్కంఠకు ప్రభుత్వం మంగళవారం తెరదించింది. కొంత కాలంగా ఐపీఎస్ అధికారుల బదిలీలపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియామకంతో బదిలీల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. విజయవాడ కమిషనర్ - ద్వారకా తిరుమలరావు విశాఖపట్నం కమిషనర్- మహేశ్ చంద్రా లడ్డా విజయవాడ అడిషనల్ సీపీ- యోగానంద్ ఏలూరు రేంజ్ డీఐజీ - రవికుమార్ మూర్తి తుళ్లూరు ఏఎస్పీగ- బి.కృష్ణారావు రంపచోడవరం ఏఎస్పీ- రాహుల్ దేవ్ సింగ్ రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షేమూషి విజయవాడ క్రైమ్ డీసీపీ- రాజకుమారి రాజమహేంద్రవరం అర్బన్ ఏఎస్పీగా అజితలు బదిలీ అయ్యారు. -
భారీగా ఐపీఎస్‌ల బదిలీలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కీలకమైన అధికారులతో పాటు పలు జిల్లా ఎస్పీలను సైతం బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు పోలీస్ శాఖలో చర్చ సాగుతోంది. డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు 4 గంటలకు పైగా కసరత్తు చేసినట్టు తెలిసింది. రెండ్రోజులుగా ఇదే అంశంపై ఉన్నతాధికారులు, సీఎంవో అధికారులతో ప్రతిపాదనలపై కసరత్తు చేసి నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ ముగ్గురితో పాటు.. రాష్ట్ర కేడర్‌కు చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి రిపోర్టు చేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన అదనపు డీజీపీ సంతోశ్మెహ్రా, ఐజీలు అనిల్ కుమార్, దేవేంద్ర సింగ్ చౌహాన్‌లకు పోస్టింగ్స్ కల్పించాల్సి ఉంది. వీరిని నియమించాలంటే పలువురు అధికారులకు స్థానచలనం తప్ప దని పోలీస్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో శాంతిభద్రతల ఐజీ పోస్టు ఖాళీగా ఉంది. నగర కమిషనరేట్‌లోని ట్రాఫిక్ అదనపు కమిషనర్ పోస్టు ఐజీ క్యాడర్ పోస్టు. ఈ రెండింటినీ అనిల్‌కుమార్, దేవేంద్ర సింగ్ చౌహాన్‌తో భర్తీ చేస్తారని, సైబరాబాద్ కమిష నర్ సందీప్ శాండిల్య సైతం బదిలీ కాబో తున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానంలో మహిళా ఐపీఎస్ అధికారి ఒకరికి అవకాశం కల్పించే యోచన ఉన్నట్టు సమాచారం. నగర కమిషన రేట్ పరిధిలోని శాంతి భద్రతల అదనపు కమిషనర్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్లను మార్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశా రని తెలిసింది. వరంగల్ కమిషనర్ సుధీర్ బాబు రెండేళ్లు పూర్తి చేయడంతో అక్కడ మరో డీఐజీ స్థాయి అధికారిని నియమించే అవ కాశం ఉంది. వరంగల్ జోన్‌లోని ముగ్గురు ఎస్పీలు, హైదరాబాద్ జోన్‌లోని ఒక ఎస్పీకి స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వంపై మంత్రుల ఒత్తిడి పదోన్నతులు పొందబోతున్న నాన్ క్యాడర్ ఎస్పీలను జిల్లా బాధ్యులుగా నియమించుకోవాలన్న ఆలోచనలో పలు వురు మంత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అనుభవం లేకుండా పదే పదే పొరపాట్లు చేస్తున్న జూనియర్ ఎస్పీలను మార్చి వారి స్థానంలో నాన్‌క్యాడర్ ఎస్పీ లను నియమించుకునేందుకు ఇప్పటికే ఇద్దరు మంత్రులు సిఫారసు లేఖలను ప్రభుత్వ పెద్దలకు అందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాచకొండ జాయింట్ కమిషనర్ తరుష్జోషీ కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ స్థానంలో డీఐజీ స్థాయి అధికారిని నియ మించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తోం ది. ఫైర్ విభాగం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్, జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌లకు స్థాన చలనం ఉండనున్నట్టు తెలుస్తోంది. సంతోశ్ మెహ్రాను జైళ్ల శాఖ డీజీగా, వీకేసింగ్ను ఫైర్ విభాగం, రాజీవ్ రతన్‌ను ఆపరేషన్స్ లేదా ఆర్గనైజేషన్‌కు మార్చే అవకాశాలున్నట్టు సమాచారం. వీకేసింగ్, గోపీకృష్ణ, సంతోశ్ మెహ్రా వచ్చే ఏడాది డైరెక్టర్ జనరల్ హోదా పదోన్నతి పొందనున్నారు. -
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. మొత్తం 18 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో విశాఖపట్టణం జిల్లా మినహా మిగతా 12 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. 12 జిల్లాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్పీలను బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. ఈ బదిలీల్లో భాగంగా 9 మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్ ఇవ్వలేదు. వీళ్లను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. జి. విజయ్‌కుమార్, ఎం. రవి ప్రకాశ్, ఎల్‌కె.వి. రంగారావు, బాస్కర్ భూషణ్, జి. శ్రీనివాస్, ఎ. రవికృష్ణ, ఆర్. జయలక్ష్మి, జె. బ్రహ్మారెడ్డి, కె.నారాయన్ నాయక్‌లను డీజీపీ కార్యాలయంలో తదుపరి పోస్టింగ్ నిమిత్తం రిపోర్టు చేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ఎస్పీలగా నియమించే వారిని స్వయంగా ఇంటికి పిలిపించుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ కౌన్సిలింగ్ కొనసాగిందనేది అధికార వర్గాల సమాచారం. గుంటూరు పట్టణ, గ్రామీణ, అలాగే చిత్తూరు ఎస్పీ, తిరుపతి పట్టణ ఎస్పీలు కూడా బదిలీ అయిన వారిలో ఉన్నారు. 1.శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా త్రివిక్రమ వర్మ 2. విజయనగరం జిల్లా ఎస్పీగా-పాలరాజు 3. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా- విశాల్ గున్నీ 4. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా- రవిప్రకాశ్ 5. కృష్ణాజిల్లా ఎస్పీగా- సర్వశ్రేష్ణ త్రిపాఠి 6. గుంటూరు అర్బన్ ఎస్పీగా- అభిషేక్ మహంతి 7. గుంటూరు రూరల్ ఎస్పీగా-అప్పలనాయుడు 8. ప్రకాశం జిల్లా ఎస్పీగా- సత్య ఏసుబాబు 9. నెల్లూరు జిల్లా ఎస్పీగా- పీహెచ్డీ రామకృష్ణ 10.చిత్తూరు జిల్లా ఎస్పీగా- రాజశేఖర్ 11. తిరుపతి ఎస్పీగా- విజయరావు 12. అనంతపురం జిల్లా ఎస్పీగా- జీవీజీ అశోక్ కుమార్ 13. వైఎస్ఆర్ జిల్లా ఎస్పీగా బాబుజీ 14. కర్నూలు జిల్లా ఎస్పీగా-గోపీనాథ్ జెట్టి 15. విజయవాడ డీసీపీగా- గజరావు భూపాల్ 16. విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ- క్రాంతిలాల్ టాటా 17.విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ- టి.రవికుమార్ మూర్తి 18. వైఎస్ఆర్ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ- ఫకీరప్పా మరోవైపు ఐపీఎస్ అధికారుల జీవోలోను తప్పులు దొర్లాయి. రవిప్రకాశ్‌ను పశ్చిమ గోదావరి జిల్లాకు ఎస్పీగా నియమిస్తూ ఒకసారి, డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేస్తూ మరోసారి ఆ జోవోలో పేర్కొన్నారు. -
ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తోన్న పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 12 (పోలీస్)జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఇఆ వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా - సర్వశ్రేష్ట త్రిపాఠి చిత్తూరు - రాజశేఖర్ కర్నూలు - గోపినాథ్‌రెడ్డి వైఎస్సార్ జిల్లా - బాపూజీ శ్రీకాకుళం - త్రివిక్రమ్ వర్మ విజయనగరం - పాల్‌రాజ్ గుంటూరు అర్బన్ - అభిషేక్ మహంతి గుంటూరు రూరల్ - అప్పలనాయుడు ప్రకాశం - ఏసుబాబు నెల్లూరు - పీహెచ్డీ రామకృష్ణ తిరుపతి - విజయరావు అనంతపురం- జీవీజీ అశోక్ కుమార్ పశ్చిమగోదావరి- రవిప్రకాశ్ తూర్పుగోదావరి - విశాల్ గున్నీ -
ఐపీఎస్ అధికారుల బదిలీల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీలలో కొన్ని మార్పులు చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్ నగర సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డిని ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఆయనను తిరిగి సెంట్రల్ జోన్ డీసీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న తరుణ్ జోషీని సెంట్రల్ జోన్ డీసీపీగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, ఆయనను ఆదిలాబాద్ ఎస్పీగా నియమించారు. ప్రస్తుతం తరుణ్ జోషీ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ డీసీపీగా తాత్కాలికంగా కొనసాగుతున్నారు.