
27మంది ఐపీఎస్ అధికారుల , ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 27 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి ఇటీవల నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి లభించిన అధికారుల వరకు 27 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ తాత్కాలికంగా పోస్టింగులు ఇచ్చినవారిలో ముగ్గురిని అదే పోస్టుల్లో రెగ్యులర్ చేయగా... మరొకరిని వైఎస్సార్ జిల్లా ఎస్పీగా నియమించారు.

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీఎత్తున ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వును కాన్ఫిడెన్షియల్ కేటగిరీలో ఉంచారు. సాధారణంగా అధికారుల బదిలీల్లో రహస్యం ఉండటానికి అవకాశం లేదు. అయినా కూటమి ప్రభుత్వం రహస్య ఉత్తర్వులు కొనసాగిస్తోంది. కాగా, సీఎం ఎక్స్–అఫిషియో స్పెషల్ సీఎస్‌గా సాయిప్రసాద్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment