IAS officers transferred
-
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 27 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి ఇటీవల నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి లభించిన అధికారుల వరకు 27 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ తాత్కాలికంగా పోస్టింగులు ఇచ్చినవారిలో ముగ్గురిని అదే పోస్టుల్లో రెగ్యులర్ చేయగా... మరొకరిని వైఎస్సార్ జిల్లా ఎస్పీగా నియమించారు.రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీఎత్తున ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వును కాన్ఫిడెన్షియల్ కేటగిరీలో ఉంచారు. సాధారణంగా అధికారుల బదిలీల్లో రహస్యం ఉండటానికి అవకాశం లేదు. అయినా కూటమి ప్రభుత్వం రహస్య ఉత్తర్వులు కొనసాగిస్తోంది. కాగా, సీఎం ఎక్స్–అఫిషియో స్పెషల్ సీఎస్‌గా సాయిప్రసాద్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. -
తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నారాయణ రెడ్డి, నల్గొండ కలెక్టర్‌గా త్రిపాఠి, యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా హన్మంతరావు బదిలీ అయ్యారు. వీరితోపాటు ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మేడ్చల్ జడ్పీ సీఈవో, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ లీప్ కుమార్ బదిలీ అయ్యారు. సీసీఎల్ఏ డైరెక్టర్‌గా మందా మకరందు, ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా ఎస్ హరీష్ రావు, మున్సిపల్‌శాఖ డైరెక్టర్‌గా టీకే శ్రీదేవి బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. దాదాపు 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే రొనాల్డ్ రోస్‌ను విద్యుత్ శాఖకు బదిలీ చేస్తూ.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కాటా ఆమ్రపాలిను నియమించారు.జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌లు నియమితులయ్యారు. కార్మిక ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్‌లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. స్పోర్ట్స్ ఎండీగా బాలాదేవి ఐఎఫ్ఎస్ నియామకంవిద్యుత్ శాఖ సెక్రటరీగా రోనాల్డ్ రోస్ నియామకంవిజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ ఐపీఎస్. హెచ్ఎండిఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీగా హరిచందన టూరిజం ఎండిగా ప్రకాష్ రెడ్డి హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా గౌతమ్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రెటరీగా అలుగు వర్షినివాటర్ బోర్డు ఎండీగా అశోక్ రెడ్డి ఐటీ డిప్యూటీ సెక్రటరీగా భవిష్ మిశ్రా పొల్యూషన్ కంట్రోల్ సెక్రెటరీగా జీ.రవి ఫిషరీస్ డిపార్టుమెంట్ డైరెక్టర్‌గా ప్రియాంకా అలా టూరిజం డైరెక్టర్‌గా త్రిపాఠి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్‌గా నరసింహారెడ్డి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా శైలజ రామయ్య ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా అహ్మద్ నదీమ్ ఫైనాన్స్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా సందీప్ కుమార్ సుల్తానియాకమర్షియల్ టాక్స్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ సెక్రటరీగా రజ్వీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్‌గా బుద్ధ ప్రకాష్ -
తెలంగాణ: 20 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 20 మంది ఐఏఎస్ అధికారలు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.బదిలీ అయిన ఐఏఎస్‌లు వీరే..పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఖమ్మంకు బదిలీమంచిర్యాల కలెక్టర్ బదావత్ సొంతోష్ నాగర్ కర్నూల్‌కు బదిలీరాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా సందీప్ కుమార్ జాన్సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్‌ను కరీంనగర్‌కు బదిలీనిర్మల్ జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్ కామారెడ్డికి బదిలీకామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్‌ను భద్రాద్రి కొత్తగూడెంకు బదిలీవికారాబాద్ అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మకు జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్‌గా బదిలీహన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణ పేట జిల్లాకు బదిలీనారాయణ పేట కలెక్టర్ హర్ష పెద్దపల్లి జిల్లాకు బదిలీ -
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావుకు పునరావాస కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నవీన్ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులిచ్చారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన సీఎస్ సమీర్ శర్మ ఆయనే విద్యార్థి.. ఆయనే గురువు -
సీఎంవో కార్యదర్శిగా ఎస్కే సుల్తానియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ హోదాల్లో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియాను సీఎంవో కార్యదర్శిగా నియమించారు. పశుసంవర్ధక శాఖ బాధ్యతలను కూడా ఆయనకే అదనంగా అప్పగించారు. పలువురు సీనియర్ ఐఏఎస్‌లు కలెక్టర్ బాధ్యతలను అదనంగా నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో పూర్తిస్థాయి కలెక్టర్లను నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ఉత్వర్వుల్లో స్పష్టంచేశారు. బదిలీల వివరాలివీ.. -
ఐఏఎస్‌ల బదిలీకి రంగం సిద్ధం !
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. పలు శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ... నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ఐఏఎస్ అధికారులు పి.వి.రమేష్, ఆదిత్యనాథ్ దాస్తోపాటు పలువురు సీనియర్లకు స్థానచలనం కలగనుంది. వారితో పాటు అజయ్ కల్లాంకు ఆర్థిక శాఖ... పి.వి.రమేష్‌కు ఆటవీశాఖ... లవ్ అగర్వాల్‌కు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా కేటాయించే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్‌తోపాటు ప్రకాశం జాయింట్ కలెక్టర్‌ను కూడా మార్చనున్నారు.