విజయవాడకు కొత్త పోలీస్‌ కమిషనర్‌ | AP Government Transfers IPS Officers | Sakshi
Sakshi News home page

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు

Published Tue, Jul 17 2018 8:47 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

AP Government Transfers IPS Officers - Sakshi

ద్వారకా తిరుమలరావు

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. ఏపీ ప్రభుత్వం 9 మంది ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. దీంతో గౌతమ్‌ సవాంగ్‌ బదిలీతో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా ఎవరు నియమితులవుతారనే ఉత్కంఠకు ప్రభుత్వం మంగళవారం తెరదించింది. కొంత కాలంగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ నియామకంతో బదిలీల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది.

విజయవాడ కమిషనర్ - ద్వారకా తిరుమలరావు
విశాఖపట్నం కమిషనర్- మహేశ్‌ చంద్రా లడ్డా
విజయవాడ అడిషనల్‌ సీపీ- యోగానంద్
ఏలూరు రేంజ్ డీఐజీ - రవికుమార్ మూర్తి
తుళ్లూరు ఏఎస్పీగ-  బి.కృష్ణారావు
రంపచోడవరం ఏఎస్పీ- రాహుల్ దేవ్ సింగ్
రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షేమూషి
విజయవాడ క్రైమ్ డీసీపీ- రాజకుమారి
రాజమహేంద్రవరం అర్బన్ ఏఎస్పీగా అజితలు బదిలీ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement