సీఎస్ శాంతికుమారికి సైతం స్థానచలనం?
కొత్త సీఎస్ రేసులో ఆరుగురు సీనియర్ ఐఏఎస్‌లు
కీలక ప్రభుత్వ శాఖలకు కొత్త అధిపతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల వరకు పెద్ద సంఖ్యలో అధికారులను బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా అధికారింలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా అధికారులతో కొత్త జట్టు కూర్పుపై దృష్టిసారించింది.
మరో వారం పది రోజుల్లో బదిలీల కసరత్తు పూర్తి చేసి ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలి పాయి. గత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో ఎలాంటి వివాదాలు, ఆరోపణల్లో చిక్కుకోని అధికారులకు బదిలీల్లో ప్రాధాన్యత లభించే అవకాశాలున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతోపాటు ప్రభుత్వం ముందు ఉన్న ఇతర సవాళ్లను దృష్టిలో పెట్టుకొని చురుకుగా పనిచేసే అధికారులను కీలక పోస్టుల్లో నియమించే అవకాశాలున్నాయి.
సీఎస్ రేసులో జయేశ్ రంజన్, వికాస్‌రాజ్ మరికొందరు
సీఎస్ శాంతికుమారి స్థానంలో కొత్త సీఎస్ పోస్టు రేసులో ఐఏఎస్ అధికారులు శశాంక్ గోయల్, కె. రామకృష్ణారావు, అరవింద్‌కుమార్, జయేశ్ రంజన్, సంజయ్‌జాజు, వికాస్‌రాజ్ ఉన్నారు. శశాంక్ గోయల్‌కు రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉండగా రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌కు ఏడాది,జ యేశ్ రంజన్, వికాస్‌రాజ్‌కు మూడేళ్లు, సంజయ్ జాజుకు ఇంకా 4 ఏళ్ల సరీ్వసు మిగిలి ఉంది.
వారిలో గోయల్, కె.రామకృష్ణారావు, జయేశ్ రంజన్, సంజయ్ జాజు, వికాస్‌రాజ్ పేర్లను ప్రభుత్వం సీఎస్ పదవికి పరిశీలించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసు శాఖ ఇన్‌చార్జి డీజీపీగా రవిగుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియ మించిన విషయం తెలిసిందే. ఆయన్ను బదిలీ చేయకుండా కొనసాగించే అవకాశం ఉంది. డీజీపీని మార్చాలని ప్రభుత్వం భావిస్తే రేసులో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, శివధర్‌రెడ్డి రేసులో ఉన్నారు.
ఇన్‌చార్జీల స్థానంలో పూర్తిస్థాయి అధికారులు
విద్య, వైద్యం, పురపాలన, రెవెన్యూ, ఆర్థిక, పంచాయతీరాజ్, సంక్షేమం, పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయం వంటి కీలక శాఖలకు కొత్త కార్యదర్శులను నియమించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇన్‌చార్జీల పాలనలో ఉన్న చాలా శాఖలకు పూర్తిస్థాయి అధికారులను ప్రభుత్వం నియమించనుంది. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో ఇన్‌చార్జి సీఎండీ ఎస్వీఎం రిజ్వీ బదిలీ కానున్నట్టు గత వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముక్కుసూటిగా, నిక్కచి్చగా వ్యవహరించే అధికారిగా పేరుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు రాష్ట్ర విద్యుత్ సంస్థలను గాడినపెట్టే బాధ్యత అప్పగించింది.
కానీ రాజకీయ సిఫారసులను పక్కనపెట్టి పూర్తిగా నిబంధనల మేరకే నిర్ణయాలు తీసుకుంటుండటంతో రిజ్వీని బదిలీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. విద్యుత్ సంస్థల్లో కీలకపాత్ర పోషించే ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఆయనకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన్ను పెద్దగా ప్రాధాన్యంలేని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ డీజీ పోస్టు కు బదిలీ చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా కొత్త అధికారిని నియమించే అవకాశాలున్నాయి. సింగరేణి బొగ్గు గనుల సంస్థకు కొత్త సీఎండీని సైతం నియమించనుంది.
జిల్లాలకు కొత్త సారథులు
జిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీలపై ఇప్పటి వర కు ఎన్నికల సంఘం ఆంక్షలు కొనసాగాయి. ఎన్నికలు ముగియడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ స్థా యి అధికారులను వారం రోజుల్లో బదిలీ చేసే అవకాశముంది. కొందరు అధికారులు ముఖ్యమైన జిల్లాల్లో పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment