అమృత్‌సర్: పొట్టకూటికోసం ఇరాక్ వెళ్లి, అంతర్యుద్ధం సమయంలో ఐసిస్ చేతిలో కిరాతకంగా హతమైన 38 మంది భారతీయు మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరుకున్నాయి. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఆర్మీ విమానంలో బాగ్ధాద్ నుంచి అమృత్‌సర్(పంజాబ్)కు తరలించారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సూచనమేరకు సహాయ మంత్రి వీకే సింగ్ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకుగానూ సింగ్ ఆదివారం ఆర్మీకి చెందిన విమానంలో బాగ్ధాద్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.
అత్యధికులు పంజాబీలే: ఇరాక్‌లో చనిపోయిన 39 మందిలో ఒక మృతదేహానికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సిన ఉండగా, మిగిలిన 38 మంది మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. వీరిలో అత్యధికులు పంజాబీలే కావడం గమనార్హం. సోమవారం తీసుకొచ్చిన 38 మృతదేహాల్లో 27 దేహాలను పంజాబ్‌లోనే దించేశారు. అక్కడి నుంచి ఆయా మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. మిగిలిన మృతదేహాలను పట్నాకు తరలించారు. బాగ్ధాద్‌లోని భారత రాయయార కార్యాలయం మృతదేహాల తరలింపులో కీలక పాత్ర పోషించింది. కాగా, ఆ 39 మందిని చంపేశారు
మంత్రి ఆగ్రహం: 38 మృతదేహాలతోపాటు అదే విమానంలో తిరిగొచ్చిన మంత్రి వీకే సింగ్‌ను అమృత్‌సర్ ఎయిర్‌పోర్టు నుంచి పంజాబ్ రాష్ట్ర మంత్రులు నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఇంకొందరు తోడ్కొని వెళ్లారు. అనంతరం వీకే సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తారా?’ అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది ఫుట్‌బాల్ ఆడినట్లో లేదా బిస్కెట్లు తయారుచేసినంత సులువైన పనికాదు. ఇప్పటికిప్పుడు పరిహారంపై నన్నడిగితే ఏం చెప్పాలి? కేంద్రం, రాష్ట్రాలు ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అప్పటిదాకా నేనేమీ చెప్పలేను’’ అని విసుక్కున్నారు.
బాగ్ధాద్ విమానాశ్రంలో దృశ్యాలు..
Comments
Please login to add a commentAdd a comment