
లక్నో: కరోనా దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్‌లో కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక రాష్టాల్లో ప్రజలు ఆక్సిజన్ సిలెండర్‌లు, బెడ్‌ల కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే అనేక ఆసుపత్రుల్లో కరోనా సోకిన వారు బెడ్‌లు లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కాగా, సాక్షాత్తు కేంద్రమంత్రి ఒకరు.. కరోనా సోకిన తన సోదరుడికి ఆసుపత్రిలో బెడ్ కేటాయించాల్సిందిగా కోరారు. దీన్ని బట్టి చూస్తే... వీఐపీలకే ఇలాంటి పరిస్థితుంటే.. ఇక మాముల ప్రజలు పరిస్థితులను ఊహించుకొవచ్చు.
అయితే, కేంద్రమంతి వీకే సింగ్ ఘజియాబాద్ నియోజకవర్గంలో తన సోదరుడికి బెడ్‌ను కేటాయించాల్సిందిగా కోరారు. ఈ మేరకు ట్వీటర్‌లో ఆయన చేసిన ట్వీట్ మన దేశంలో వైద్యపరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఒక కేంద్ర మంత్రి మెడికల్ సాయం కావాలని కోరడం బాధకరమని, దీన్ని బట్టి మనం చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నామని కామెంట్‌లు పెడుతున్నారు. ఇప్పటికైన ప్రజలందరు విధిగా మాస్క్‌ను ధరించి, కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. అదేవిధంగా కోవిడ్ టీకాను వేసుకోవాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment