health emergancy
-
వామ్మో మంకీపాక్స్!.. భారత్‌లో అనుమానిత కేసు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) వైరస్ సెగ భారత్‌కూ తాకింది. మన దేశంలో తాజాగా ‘అనుమానిత’ ఎంపాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలను గుర్తించినట్లు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి ఐసోలేషన్‌లో ఉంచాం. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతడితో కలిసి ప్రయాణించిన వ్యక్తులను గుర్తిస్తున్నాం. అతనికి నిజంగా ఎంపాక్స్ సోకిందీ లేనిదీ నిర్ధారించడానికి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నాం’’ అని పేర్కొంది. ‘‘ఇది అనుమానిత కేసే. ఇంకా నిర్ధారణ కాలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని తెలిపింది. వైరస్ విషయంలో ఏ పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వివరించింది. 99,176 కేసులు.. 208 మరణాలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచి్చంది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచి్చనట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్‌లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది.ఏమిటీ ఎంపాక్స్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకుతుండటంతో ఎంపాక్స్ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే.ఇలా సోకుతుంది→ అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. → తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.వ్యాధి లక్షణాలు ఏమిటీ?→ ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. → చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. → 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. → నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. → నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.వ్యాక్సిన్ ఉందా? స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్‌కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్ (టీపీఓఎక్స్ ఎక్స్) యాంటీ వైరల్‌నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్) డ్రగ్స్‌నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది.అప్రమత్తంగా ఉండండి: కేంద్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో ఎంపాక్స్ కేసులు పెరిగిపోతుండటంతో సరిహద్దులతోపాటు ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. ఎంపాక్స్ లక్షణాలు గుర్తించడానికి విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఎంపాక్స్ సన్నద్ధతపై ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ కేసుల్లో సమర్థ చికిత్స కోసం ఆసుపత్రులను ఇప్పట్నుంచే సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
నా తమ్ముడికి బెడ్ కేటాయించండి: కేంద్రమంత్రి అభ్యర్థన
లక్నో: కరోనా దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్‌లో కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక రాష్టాల్లో ప్రజలు ఆక్సిజన్ సిలెండర్లు, బెడ్ల కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే అనేక ఆసుపత్రుల్లో కరోనా సోకిన వారు బెడ్లు లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కాగా, సాక్షాత్తు కేంద్రమంత్రి ఒకరు.. కరోనా సోకిన తన సోదరుడికి ఆసుపత్రిలో బెడ్ కేటాయించాల్సిందిగా కోరారు. దీన్ని బట్టి చూస్తే... వీఐపీలకే ఇలాంటి పరిస్థితుంటే.. ఇక మాముల ప్రజలు పరిస్థితులను ఊహించుకొవచ్చు. అయితే, కేంద్రమంతి వీకే సింగ్ ఘజియాబాద్ నియోజకవర్గంలో తన సోదరుడికి బెడ్‌ను కేటాయించాల్సిందిగా కోరారు. ఈ మేరకు ట్వీటర్లో ఆయన చేసిన ట్వీట్ మన దేశంలో వైద్యపరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఒక కేంద్ర మంత్రి మెడికల్ సాయం కావాలని కోరడం బాధకరమని, దీన్ని బట్టి మనం చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నామని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైన ప్రజలందరు విధిగా మాస్క్‌ను ధరించి, కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. అదేవిధంగా కోవిడ్ టీకాను వేసుకోవాలని పేర్కొన్నారు. చదవండి: కనీసం 15 రోజులు లాక్డౌన్ విధించాలి! -
హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి
హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాలని, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. సోమవారం అఖిలపక్ష నేతలు కోదండరాం, ఎల్.రమణ, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు కింగ్‌కోఠి కోవిడ్ ఆసుపత్రిని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సలపై సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కింగ్‌కోఠి ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఆసుపత్రిలో 200 బెడ్లు ఖాళీగా ఉన్నాయని, అయినా అధికారులు బెడ్లు ఖాళీ లేవని రోగులను వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలతో ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పోతోందన్నారు. ప్రజా ప్రతినిధులు సైతం చికిత్సకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలని ఆయన సూచించారు. టీటీడీపీ నేత ఎల్.రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లనే ప్రజలు సర్కారు ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయారన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలను దోచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలన్నారు. -
అమెరికాలో ఎమర్జెన్సీ
వాషింగ్టన్: వైరస్ విస్తృతి నేపథ్యంలో తమ దేశంలో అత్యవసర పరిస్థితిని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కరోనా కారణంగా జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో వ్యాధి నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు 3.6 లక్షల కోట్ల రూపాయలు అందుబాటులోకి రానున్నాయి. వైరస్ కారణంగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 5,700మందికిపైగా మరణించగా, 137 దేశాల్లో 1.51లక్షల మందికిపైగా వ్యాధి బారిన పడ్డారు. అమెరికాలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు రెండు వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. ‘పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది’ అని వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో చెప్పారు. ప్రభుత్వం ఈ వ్యాధిపై పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టేందుకు వీలుగా నేషనల్ ఎమర్జెన్సీని విధించినట్లు ప్రకటించారు. అమెరికా చట్టాల ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా భారీ ఎత్తున నిధులు అందుతాయి. దేశంలోని అన్ని ఆసుపత్రులు అత్యవసర పరిస్థితులకు సంబంధించిన ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అమెరికా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రికి విశేష అధికారులు లభిస్తాయి. వైద్యులు, ఆసుపత్రులు, ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్ చికిత్సకు సంబంధించి తగిన చర్యలు తీసుకునేందుకు వెసలుబాటు లభిస్తుంది. ప్రజలందరికీ వైద్యసేవలు అందించేందుకు వీలుగా అన్ని అడ్డంకులను తొలగిస్తున్నట్లు ట్రంప్ విలేకరులతో చెప్పారు. ముడిచమురు ధరలు తగ్గివస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక నిల్వలను భారీగా పెంచాలని ట్రంప్ అధికారులను ఆదేశించారు. పరీక్షలు చేయించుకున్నా: ట్రంప్ వ్యాధి లక్షణాలేవీ లేకున్నా... తాను కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, ఫలితాల కోసం వేచిచూస్తున్నానని ట్రంప్ తెలిపారు. తనను కలసిన బ్రెజిల్ కమ్యూనికేషన్స్ చీఫ్ ఫాబియో వాజ్న్గార్టేన్కు వైరస్ సోకిన నేపథ్యంలో ట్రంప్ ఈ విషయం చెప్పారు. ► వైరస్ నేపథ్యంలో ఇటలీ వీధులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వారాంతపు రోజైన శనివారం రోమ్‌లో ఖాళీ వీధులు, మూసివేసిన దుకాణాలే దర్శనమిచ్చాయి. ఇటలీలో 17,660 మంది కోవిడ్ బారిన పడటం, 1226 మంది మరణించారు. ప్రధాని గుసెపీ కాంటే శుక్రవారం వ్యాపారవేత్తలతో, సంఘాలతో భేటీ అయ్యారు. దేశం స్తంభించిపోలేదని, ఉద్యోగాలు చేసుకునే వారికి రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ► కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మరిన్ని మాస్కులు, మందులు పంపాల్సిందిగా ప్రధాని మోదీని కోరినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తెలిపారు. ► ఆఫ్రికా దేశం రువాండాలో ఒక భారతీయుడు కోవిడ్ బారిన పడ్డాడు. ముంబై నుంచి మార్చి 8న కిగాలికి వచ్చిన వ్యక్తికి కోవిడ్ సోకిందని రువాండా ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ► స్పెయిన్‌లో శుక్ర, శనివారాల మధ్య సుమారు 1500 మంది కరోనా బారినపడ్డారు. ఈ కొత్త కేసులతో ఇటలీ తరువాత అత్యధిక (5753) కేసులున్న దేశంగా స్పెయిన్ మారింది. స్పెయిన్‌లో ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా 136 మంది మరణించారు. వారం రోజుల్లో పదిరెట్లు పెరిగిన రోగబాధితులను దృష్టిలో ఉంచుకుని దేశం మొత్తమ్మీద నియంత్రణ చర్యలు తీసుకునేందుకు ప్రధాని పెడ్రో శాంచెజ్ సిద్ధమవుతున్నారు. ► కోవిడ్‌పై పోరాడేందుకు దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) ఏర్పాటు చేస్తున్న సమావేశం మన పౌరులకు ఉపయోగపడే ఫలితాన్ని ఇస్తుందని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. ప్రధాని ఈ భేటీని నడిపించనున్నారు. మోదీ నాయకత్వంలో ఈ భేటీ సాగేందుకు శ్రీలంక అధ్యక్షుడు గోతబయ రాజపక్స, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహిమ్ మొహమ్మద్ సోలిహ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రీమియర్ లోతయ్ షెరింగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అఫ్గానిస్తాన్ ప్రభుత్వాలు అంగీకరించాయి. చివరగా పాకిస్తాన్ కూడా దీనికి అంగీకరించింది. ఇరాన్లో ఒక్కరోజే 97మంది బలి ► కరోనా మహమ్మారికి ఇరాన్లో శనివారం ఒక్కరోజే సుమారు 97 మంది బలి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 611కు చేరుకుందని, 12,729 మంది వ్యాధి బారిన పడ్డారని ఇరాన్ అధికార టెలివిజన్ ఛానెల్ ప్రకటించింది. చైనా, ఇటలీల తరువాత ఇరాన్‌లోనే అత్యధిక సంఖ్యలో కోవిడ్ బాధితులున్నారు. ► చైనాలో మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. తాజాగా శుక్రవారం చైనా మొత్తమ్మీద 13 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోగా కొత్తగా వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 11గా ఉంది. నిర్ధారిత కేసుల సంఖ్య 80,8254కు చేరుకున్నట్లు ఆరోగ్య కమిషన్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ చైనాలో 3,189 మంది కోవిడ్ కారణంగా మరణించారు. -
‘అనంత’లో హెల్త్ ఎమర్జెన్సీ
– కలెక్టరేట్, కార్పొరేషన్లో కంట్రోల్ రూంలు – ఆర్ఎంపీ క్లినిక్‌లు 24 గంటల్లోపు సీజ్ చేయండి – సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి – అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి – అధికారులకు కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్/సిటీ/టౌన్ : ‘అనంతపురం నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాం. జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీ క్లినిక్‌లను 24 గంటల్లోపు సీజ్ చేయండి. హె ల్త్ ఎమర్జెన్సీ ముగిసే వరకు వాటిని తెరవరాదు. దీన్ని బేఖాతరు చేసే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి. ప్రజారోగ్య పరిరక్షణ, సీజనల్ వ్యాధుల నివారణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. మీకు ఇప్పటికే ఒకట్రెండుసార్లు చెప్పా. ఇకపై చెప్పేది ఉండద’ని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికారులను హెచ్చరించారు. డెంగీతో అనంతపురంలో ఇద్దరు చిన్నారులు మతి చెందిన నేపథ్యంలో కలెక్టర్ శనివారం పలు సమావేశాలు నిర్వహించి.. సీజనల్ వ్యాధుల నివారణ కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా తన క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజా మొíß ద్దీన్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్లోని ఎన్ఐసీ నుంచి ఆర్డీఓలు, తహశీల్దారులు, మునిసిపల్ కమిషనర్లు, వైద్యాధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఏపీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్వామా హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలోని వినాయక్‌నగర్‌లో చోటు చేసుకున్నటువంటి ఘటనలు జిల్లాలో ఎక్కడా పునరావతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, గ్రామ స్థాయిలో ఈఓఆర్డీలు బాధ్యత వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆరోగ్య, పారిశుద్ధ్య కమిటీల సమావేశాలని నిర్వహించుకుని.. కార్యాచరణతో ముందుకు పోవాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు నగర పాలక సంస్థ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం (08554–230234) ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని ప్రతి డివిజన్‌కు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. 44 మురికివాడల్లో 126 మంది నర్సింగ్ విద్యార్థులతో ఇంటింటా సర్వే చేయించి జ్వర పీడితులను గుర్తించాలన్నారు. 600 మంది పారిశుద్ధ్య సిబ్బందికి తోడు అదనపు సిబ్బందిని, ట్రాక్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. మురికి కాలువలన్నీ శుభ్రం చేయించాలని, అన్ని ప్రాంతాల్లో అపరిశుభ్రత తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సూచించారు. దోమల నివారణకు కాలువల్లో స్ప్రేయింగ్, ఫాగింగ్ తప్పనిసరిగా చేయించాలన్నారు. పందులను తక్షణమే ఊరిబయటకు తరలించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసును ఆదేశించారు. అన్ని మునిసిపాలిటీల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మిని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ వెంకటరమణను ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సీజనల్ వ్యాధులపై సమాచారం తెలుసుకోవడానికి కలెక్టరేట్లో సెంట్రల్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో విషజ్వరాలు ఏ మూలన ప్రబలినా తక్షణమే స్పందించాలని డీఎంహెచ్ఓతో పాటు జిల్లా మలేరియా నివారణ అధికారి దోసారెడ్డిని ఆదేశించారు. హిందూపురం, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెంగీ చికిత్స కోసం తగినన్ని ప్లేట్లెట్స్, మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. విషజ్వరాలతో ఏ ఒక్కరు మతి చెందినా ఆ వివరాలను వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా తనకు తెలియజేయాలన్నారు. సీజనల్ వ్యాధుల నివార ణపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం 10 లక్షల కరపత్రాలను డ్వాక్రా మహిళల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయించాలని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లుకు సూచించారు. ప్రజల భయాన్ని సొమ్ము చేసుకోవద్దు : జేసీ అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో భయాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకోవాలని చూడటం సరైంది కాదని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం హితవు పలికారు. శనివారం ఆయన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రైవేట్ నర్సింగ్ హోంలు, ఆస్పత్రుల నిర్వాహకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జ్వరాలన్నీ డెంగీ కాదని, రక్తపరీక్ష అనంతరమే వ్యాధిని నిర్ధారించాలని సూచించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డెంగీ బాధితుల కోసం అనంతపురం, హిందూపురం ప్రభుత్వాస్పత్రులు, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో డెంగీ లక్షణాలు ఉంటే ఇక్కడికి మాత్రమే పంపాలన్నారు. అలా కాదని బెంగళూరు, హైదరాబాదులాంటి నగరాలకు వెళ్లమని సూచిస్తే చర్యలు తప్పవన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 45 ఆర్ఎంపీ క్లినిక్‌లను సీజ్ చేశామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలకు సంబంధించి ధరల పట్టికను తప్పక ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ వెంకటరమణ, సర్వజనాస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ రామస్వామినాయక్, ఇన్చార్జ్ ఆర్ఎంఓ శివకుమార్, డెమో హరిలీలాకుమారి తదితరులు పాల్గొన్నారు.