
యూపీలోనూ పాగా వేస్తాం: వీకే సింగ్
ఘజియాబాద్: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ తమ పార్టీ పాగా వేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
2016లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టామని చెప్పారు. షహియాబాద్ లో ఆదివారం జరిగిన భారతరత్న మదన్ మోహన్ మాలవ్య, స్వామి వివేకానంద జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు.