వీకే సింగ్ వ్యాఖ్యలపై పెనుదుమారం | aap agitation against vk singh in delhi | Sakshi
Sakshi News home page

వీకే సింగ్ వ్యాఖ్యలపై పెనుదుమారం

Published Fri, Oct 23 2015 12:16 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

వీకే సింగ్ వ్యాఖ్యలపై పెనుదుమారం - Sakshi

వీకే సింగ్ వ్యాఖ్యలపై పెనుదుమారం

న్యూఢిల్లీ: ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్‌కు మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. దళితుల చిన్నారుల హత్య, అనంతర పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయి.  హరియాణాలో ఇద్దరు దళిత చిన్నారుల హత్యపై వీకే సింగ్ చేసిన ధుమారం రేపుతున్నాయి. వీకే సింగ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో నిరసన ఆందోళన చేపట్టింది. ప్రసాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన ఆప్ శ్రేణులు వీకే సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. వీకే సింగ్‌పై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు.  

దేశంలో మత అసహన ఘటనలు పెరిగిపోవడానికి మోదీ సర్కారే బాధ్యత వహించాలంటూ వెల్లువెత్తిన విమర్శలపట్ల వీకే సింగ్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ప్రతి స్థానిక సమస్యకు కేంద్రం బాధ్యత వహించదని, కుక్కలపై రాయి విసిరినా ప్రభుత్వమే బాధ్యత వహించాలా అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. మరోపక్క, కేంద్ర మంత్రులు వీకే వీకే సింగ్, కిరణ్ రిజీజు వ్యవహారం బీజేపీలో కాక రేపుతోంది. వారి మాటలపై పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజీజు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం అధికారంలో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలంటూ రాజ్ నాధ్ హితవు పలికారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement