
మీ అయ్య సొత్తా? మీ పేర్లు ఎందుకు పెట్టాలి?
ఢిల్లీలోని అక్బర్ రోడ్డు పేరును మహారాణా ప్రతాప్ రోడ్డుగా మార్చాలంటూ కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ చేసిన ప్రతిపాదన పెద్ద దుమారమే రేపుతోంది.
ముంబై: ఢిల్లీలోని అక్బర్ రోడ్డు పేరును మహారాణా ప్రతాప్ రోడ్డుగా మార్చాలంటూ కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ చేసిన ప్రతిపాదన పెద్ద దుమారమే రేపుతోంది. ఈ అంశంపై పెద్ద ఎత్తున సాగుతున్న చర్చలోకి తాజాగా బాలీవుడ్ నటుడు రిషి కపూర్ తలదూర్చాడు. దేశంలోని పలు సంస్థలు, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులకు గాంధీ-నెహ్రూ కుటుంబం పేర్లు ఎందుకు పెట్టారని ఆయన నిలదీశాడు.
'సమాజానికి సేవ చేసిన వారి పేర్లను దేశంలోని కీలక ఆస్తులకు పెట్టాలి. ప్రతిదానికీ గాంధీ పేరు ఎందుకు? నేను దీనిని అంగీకరించను. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అని ఎందుకు పెట్టారు? మహాత్మా గాంధీ పేరో, భగత్ సింగ్ పేరో, అంబేద్కర్ పేరో ఎందుకు పెట్టలేదు? కనీసం నా పేరు రిషి కపూర్ అయినా పెట్టొచ్చు. ఏమంటారు?' అని రిషి కపూర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. 'దేశఆస్తులకు కాంగ్రెస్ పార్టీ పెట్టిన గాంధీ కుటుంబం పేర్లను మార్చాలి. బాంద్రా/వర్లీ సీలింక్‌కు లతా మంగేష్కర్ లేదా జేఆర్డీ టాటా లింక్ రోడ్డు అని పేరు పెట్టాలి. మీ అయ్య సొత్తు అనుకుంటున్నారా? ఏమిటి?' అని రిషి నిలదీశాడు. ఢిల్లీలో రోడ్ల పేర్లు మార్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశ ఆస్తులకు పెట్టిన పేర్లను కూడా మార్చాలని, చండీగఢ్‌లో రాజీవ్‌గాంధీ పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తన తండ్రి రాజ్‌కపూర్ దేశం గర్వపడేలా కృషి చేశారని, రాజకీయాల కన్నా ఆయనే ఎక్కువ దేశానికి గర్వకారణమయ్యారని రిషి కపూర్ చెప్పుకొచ్చాడు.
Change Gandhi family assets named by Congress.Bandra/Worli Sea Link to Lata Mangeshkar or JRD Tata link road. Baap ka maal samjh rakha tha ?
— Rishi Kapoor (@chintskap) 17 May 2016