వీకే సింగ్ ను పీకేయాలి.. రాహుల్ నేతృత్వంలో ధర్నా | Rahul Gandhi leads Congress' charge, demands VK Singh’s resignation over 'dog' remark | Sakshi
Sakshi News home page

వీకే సింగ్ ను పీకేయాలి.. రాహుల్ నేతృత్వంలో ధర్నా

Published Mon, Dec 7 2015 12:30 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

వీకే సింగ్ ను పీకేయాలి.. రాహుల్ నేతృత్వంలో ధర్నా - Sakshi

వీకే సింగ్ ను పీకేయాలి.. రాహుల్ నేతృత్వంలో ధర్నా

న్యూఢిల్లీ: దళితులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి వీకే సింగ్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. ఉభయ సభల ప్రారంభానికి పార్లమెంటు ఆవరణలో సోమవారం ఉదయం ఈ ధర్నా జరిగింది. ఇందులో రాజ్యసభ, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుల గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, దీపేందర్ హుడా పాల్గొన్నారు. దళితులను ఉద్దేశించి 'కుక్క' అని వ్యాఖ్యలు చేసిన వీకే సింగ్ ను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఒక అట్టడుగు సామాజిక వర్గం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతోనే ఈ విషయంలో తాము పట్టుబడుతున్నామని వారు తెలిపారు.  

హరియాణాలో ఇద్దరు దళిత చిన్నారుల హత్య ఘటనపై స్పందిస్తూ ప్రతి స్థానిక సమస్యకు కేంద్రం బాధ్యత వహించదని, కుక్కలపై రాయి విసిరినా ప్రభుత్వమే బాధ్యత వహించాలా అని ఆర్మీ మాజీ చీఫ్ అయిన వీకే సింగ్ వ్యాఖ్యానించడం తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement