రాజీనామా చేస్తాననలేదు: వీకే సింగ్ | VK Singh offers to resign, TV report says | Sakshi
Sakshi News home page

రాజీనామా చేస్తాననలేదు: వీకే సింగ్

Published Wed, Mar 25 2015 2:44 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రాజీనామా చేస్తాననలేదు: వీకే సింగ్ - Sakshi

రాజీనామా చేస్తాననలేదు: వీకే సింగ్

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి, బీజేపీకి, ప్రధాని మోదీకి సంపూర్ణంగా నిబద్ధుడనని కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ స్పష్టం చేశారు. తాను రాజీనామాకు సిద్ధమయ్యానన్న వార్తలు అవాస్తవమన్నారు. పాకిస్తాన్ హై కమిషన్ వద్ద పాక్ నేషనల్ డే ఉత్సవాలకు హాజరైన అనంతరం తాను చేసిన ట్వీట్లపై ఒక వర్గం మీడియా కావాలనే రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు.

కొందరు తన జాతీయవాద వైఖరిని ప్రశ్నించారన్నారు. ఈ మేరకు ఒక ప్రకటనను మంగళవారం ఆయన మీడియా ముందు చదివి వినిపించారు. రాజీనామాకు సిద్ధమయ్యారా? అన్న ప్రశ్నకు.. ఆయన తాను అలాంటి ప్రతిపాదనేమీ చేయలేదని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement