
కోల్‌కతా: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు కోల్‌కతాలోని ఓ కోర్టు సమన్లు జారీచేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే భారత్ ‘హిందూ పాకిస్తాన్’గా మారుతుందంటూ థరూర్ చేసిన వ్యాఖ్యలపై ఇక్కడి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీచేసినట్లు పిటిషనర్ సుమిత్ చౌదురీ తెలిపారు. థరూర్ వ్యాఖ్యలు దేశంలో మత సామరస్యాన్ని, ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న జడ్జి ఆగస్టు 14లోగా కోర్టుముందు హాజరు కావాలని థరూర్‌ను ఆదేశించారు.