వీకే సింగ్ కు చేదు అనుభవం | RSS cancels VK Singh speech after his late arrival | Sakshi

వీకే సింగ్ కు చేదు అనుభవం

Nov 3 2014 2:01 PM | Updated on Sep 2 2017 3:49 PM

విదేశాంగ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది.

అగ్రా: విదేశాంగ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు ఆర్ఎస్ఎస్ ఆయన ఉపన్యాసాన్ని రద్దు చేసింది. ఆగ్రాలో జరుగుతున్న 'యువ సంకల్ప శిబర్'కు ఆదివారం ఆయన హాజరయ్యారు.

ఉదయం 11 గంటలకు సమావేశానికి రావాల్సివుండగా, మధ్యాహ్నం 12.40 గంటలకు వచ్చారు. ఆలస్యంగా వచ్చినందుకు ఆయన ప్రసంగాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఒకరి కోసం తమ షెడ్యూల్ ను పొడిగించలేమని ఆర్ఎస్ఎస్ మీడియా ఇన్చార్జి వీరేంద్ర వర్షనేయ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement