తెలంగాణలో 6గురు ఐపీఎస్‌లకు ప్రమోషన్లు | Six IPS Officers Get Promotion In Telangana | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతి

Published Thu, Apr 16 2020 4:12 PM | Last Updated on Thu, Apr 16 2020 4:49 PM

Six IPS Officers Get Promotion In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతి లభించింది. 2006 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు ప్రమోషన్‌​ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వారంతా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ)గా పదోన్నతి పొందినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

పదోన్నతి పొందిన  ఐపీఎస్‌ అధికారులు..

  • కార్మికేయ
  • కే రమేష్‌ నాయుడు
  • వీ సత్యనారాయణ
  • బీ సుమతి
  • ఎమ్‌ శ్రీనివాసులు
  • వెంకటేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement