ఎక్కడివారక్కడే.. | IAS, IPS officers, allotted for Telangana, Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఎక్కడివారక్కడే..

Published Sat, Aug 23 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

ఎక్కడివారక్కడే..

 యథాస్థానంలో ఇరురాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు
 సివిల్ సర్వీసెస్ అధికారుల విభజన పూర్తి.. కీలక అధికారుల స్థానం పదిలం
 డెరైక్ట్ రిక్రూటీల్లో 15 మంది ఆంధ్రా ఐఏఎస్‌లు తెలంగాణకు..
 రాష్ట్రానికి మరో ఐదుగురు డీజీపీ స్థాయి అధికారులు
 ఈ నెల 29లోగా అభ్యంతరాల స్వీకరణ... 2న ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది భేటీ
 ప్రధానికి నివేదిక, ఆమోదం తర్వాత అమలు

 
 సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్:
 అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన ఎట్టకేలకు పూర్తయింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారంలో అనూహ్య మలుపుల అనంతరం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల తుది కేటాయింపు జరిగింది. ఏ రాష్ట్రాల సీఎస్, డీజీపీలు ఆయా రాష్ట్రాలకే వెళ్లారు. సివిల్ సర్వీసెస్ అధికారుల విభజన కోసం ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ శుక్రవారం ఇక్కడి కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ఈ కసరత్తును పూర్తిచేసింది. తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, ఏపీ సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు తదితరులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. రాత్రి 9 గంటలకు అధికారుల కేటాయింపు జాబితాను వెల్లడించారు. దీనిపై ఈ నెల 29లోగా అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు సమాచారం. వీటి ఆధారంగా సెప్టెంబర్ 2న జరిగే సమావేశంలో తుది జాబితాను రూపొందించి ప్రధాని నరేంద్ర మోడీకి పంపనున్నారు. ఆయన ఆమోదం లభించిన వెంటనే ఈ కేటాయింపులు అమల్లోకి వస్తాయి. వాస్తవానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభమవుతుందని ఈ నెల 16న జరిగిన లాటరీ ప్రకారం ప్రత్యూష్ సిన్హా కమిటీ నిర్ణయించింది.

అయితే ఆఖరి క్షణంలో మారిన రోస్టర్ బ్యాండ్ విధానాన్ని తెరపైకి తేవడంతో అధికారుల కేటాయింపు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభమైంది. రోస్టర్ విధానం ద్వారానే ఆయా అధికారులు ఇచ్చిన ఆప్షన్లకు అనుగుణంగా తాజా కేటాయింపులు జరిపారు. దీంతో ఇరు రాష్ట్రాల్లో ప్రస్తుతం కీలక స్థానాల్లో ఉన్న అధికారులు అలాగే కొనసాగే అవకాశం ఏర్పడింది. సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ రాష్ట్రానికే దక్కారు. కాగా, కొందరు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు కూడా ఏపీ నుంచి తెలంగాణ కేడర్‌కు మారారు. డెరైక్ట్ రిక్రూటీల్లో ఆంధ్రాకు ఎంపికైన వారిలో 15 మంది అధికారులు ప్రస్తుతం తెలంగాణకు వచ్చారు. భార్యాభర్తలుగా ఉన్న పలువురు ఐఏఎస్‌లలో మెజారిటీ అధికారులు ఇరు రాష్ట్రాలకు వెళ్లడం విశేషం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ) విభాగం తన వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచింది. ఏ రాష్ట్రానికి ఏ అధికారిని కేటాయించారు, అందుకు అనుసరించిన రోస్టర్ పద్దతితోపాటు, పలువురు అధికారులు సీల్డ్‌కవర్లలో ఇచ్చిన ఆప్షన్ల వివరాలను అందులో ఉంచారు.

ఆఖరి నిమిషంలో రోస్టర్ విధానం పాటించడంతో పలువురు ఆశించిన రాష్ట్రానికి కాకుండా పొరుగు రాష్ట్రానికి కేటాయించారు. ఐఏఎస్‌లకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 374 పోస్టులు ఉండగా 294 మంది అధికారులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులో నేరుగా రిక్రూట్ అయిన వారు 191 మంది ఉంటే.. 103 మంది రాష్ట్ర కేడర్ నుంచి ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన వారున్నారు. డెరైక్ట్ రిక్రూటీల్లో ఆంధ్రాకు 108 మందిని, తెలంగాణకు 83 మందిని కేటాయించారు. పదోన్నతి పొందిన వారిలో 57 మందిని ఏపీకి, 46 మందిని తెలంగాణకు కేటాయించారు. ఏపీ కేడర్‌కే చెందినప్పటికీ తెలంగాణకు కేటాయించిన అధికారుల్లో డాక్టర్ పీవీ రమేష్, సుదర్శన్‌రెడ్డి, శాంతికుమారి, ఆర్.హనుమంతు. దానకిషోర్, ఎల్‌వీ సుబ్రమణ్యం. జేఎస్‌వీ ప్రసాద్  తదితరులు ఉన్నారు. కాగా నిథిమ్‌కు వెళ్లినప్పుడు తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్న చందనాఖన్ ఇప్పుడు తెలంగాణ కేడర్‌కే వచ్చారు. తెలంగాణ నుంచి పదోన్నతిలో ఐఏఎస్‌లుగా ఎంపికైన 51 మందిలో ఐదుగురిని ఆంధ్రాకు కేటాయించారు. వీరిలో విజయకుమార్, శశిధర్, ఇంతియాజ్, శ్రీధర్ ఉన్నారు. అదే సమయంలో డీజీపీ అనురాగ్‌ర్మతో పాటు డీజీపీ హోదాలో ఉన్న టిపిదాస్, అబ్దుల్ ఖయ్యూం ఖాన్, వాసన్, కోడెదుర్గాప్రసాద్, అరుణా బహుగుణలను కూడా తెలంగాణకు కేటాయించారు.

ఇక ప్రస్తుతం ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏఆర్ అనురాధను తెలంగాణకు, ఏపీలోనే గ్రేహైండ్స్ చీఫ్‌గా ఉన్న ఆమె భర్త ఎన్‌వి సురేంద్రబాబును ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. దీంతో వీరిద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇక ఐపీఎస్ సోదరులు అవినాష్ మహంతిని తెలంగాణకు, అతని సోదరుడు అభిషేక్ మహంతిని ఏపీకి కేటాయించారు. కాగా రాష్ట్రంలోనే ఉండాలని ఆప్షన్ ఇచ్చిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఐజీ మహేష్ భగవత్, రాష్ట్ర హోంశాఖ స్పెషల్  సెక్రటరీ సౌమ్య మిశ్రాలను ఏపీకి కేటాయించారు. అలాగే రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వికె సింగ్‌ను కూడా ఏపీకి మార్చారు. కాగా సీనియర్ ఐపీఎస్‌లు రాజీవ్ త్రివేదితో పాటు మరికొందరు ఐపీఎస్‌లు వారు కోరుకున్నట్లే తెలంగాణకు దక్కారు. మొత్తం మీద రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు తాత్కాలికంగా  కేటాయించిన 31 మంది ఐపీఎస్ అధికారుల్లో చాలా వరకు రాష్ట్రేతర ఐపీఎస్‌లు ఏపీ కేడర్‌లోకి వెళ్లారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో కాబోయే డీజీపీలుగా పోలీసు వర్గాలు భావిస్తున్న కోడె దుర్గాప్రసాద్, ఎకె ఖాన్‌లు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం చర్చనీయాంశమైంది. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న ప్రస్తుత ఏసీబీ డెరైక్టర్ కుమార్ విశ్వజిత్‌ను ఏపీకి కేటాయించారు. పలు జిల్లాల ఎస్పీలు కూడా ఏపీకి వెళ్లాల్సి వస్తోంది.

ఐపీఎస్‌ల కేటాయింపు ఇలా...
 తెలంగాణకు..
 రాష్ట్రేతరులు (అన్ రిజర్వుడ్)
 టి.పి.దాస్, ఎన్.ఆర్.వాసన్,  అనురాగ్‌శర్మ,  సుదీప్ లక్టాకియా, రాజీవ్ త్రివేది, ప్రభాకర్‌అలోకా, ఎ.ఆర్.అనురాధా, సంతోష్ మెహ్రా, ఉమేష్ షరాఫ్, రవి గుప్తా, రాజీవ్ రతన్, జితేందర్, సందీప్ శాండిల్యా, వినాయక్‌ఆప్టే, శిఖా గోయల్, కృపానంద ఉజాలా, రితూ మిశ్రా, దేవేంద్ర సింగ్ చౌహాన్, విక్రమ్ సింగ్‌మన్, అకున్ సబర్వాల్, తరుణ్ జోషీ, వి.జి.దుగ్గల్, తఫ్సీర్ ఇక్బాల్, అంబర్ కిశోర్‌జా, సంప్రీత్ సింగ్, ఎస్.ఎం.విజయ్‌కుమార్, ఎస్.విష్ణు,
 
రాష్ట్రేతరులు (ఓబీసీ): వి.సి.సజ్జనార్, ఎస్‌కే జైన్, షానవాజ్ ఖాసీం, బి.జ్యోయల్ డేవిస్, ఆర్.భాస్కరన్,
రాష్ట్రేతరులు (ఎస్సీ): సత్యానారాయణ్, గోవింద్, అనిల్‌కుమార్, రాజేశ్వరి, కాల్మేశ్వర్
రాష్ట్రేతరులు (ఎస్టీ): బి.ఎల్.మీనా,  స్వాతి లక్డా, కార్తికేయన్
రాష్ట్రానికి చెందిన డెరైక్ట్ ఐపీఎస్‌లు (జనరల్)
అరుణబహుగుణ, కె.దుర్గాప్రసాద్, ఎ.కె.ఖాన్, తేజ్‌దీప్ కౌర్ మీనన్, మహేందర్‌రెడ్డి, జె.పూర్ణచందర్‌రావు, సి.వి.ఆనంద్, ఎ.శ్రీనివాసరెడ్డి, వి.శ్రీధర్‌రెడ్డి, చారు సిన్హా, వై.నాగిరెడ్డి, అవినాశ్ మహంతి, ఎన్.ప్రకాశ్ రెడ్డి
 ఓబీసీ: స్టీఫెన్ రవీంద్ర, నవీన్‌కుమార్, విశ్వజిత్ కంపాటి
 
 ఎస్సీ: ఇ.కృష్ణప్రసాద్ , ఎం.గోపీకృష్ణ, ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, బి.చందన, ఎం.చేతన
 కన్ఫర్డ్ ఐపీఎస్‌లు: వి.నవీన్ చంద్, ఎం.కె.సింగ్, కె.వేణుగోపాల్‌రావు, బి.మల్లారెడ్డి, శశిధర్‌రెడ్డి, వై.గంగాధర్, డి.సుధీర్‌బాబు, ప్రభాకర్‌రావు, ప్రమోద్‌కుమార్, ఎన్.శివశంకర్‌రెడ్డి, బి.రవీందర్, వి.శివకుమార్, వీవీ కమలాసన్‌రెడ్డి, ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఎ.ఆర్.శ్రీనివాస్, పి.విశ్వప్రసాద్, ఎం.రమేశ్, ఎస్.జె.జనార్దన్, ఎ.వి.రంగనాథ్, బి.సుమతి, ఎ.వెంకటేశ్వరరావు
 
 (ఆంధ్రా ప్రాంతానికి చెందిన డెరైక్ట్ ఐపీఎస్ వి.వి.శ్రీనివాసరావును.. కన్ఫర్డ్ ఐపీఎస్‌లైన బి.సత్యనారాయణ,  కె.రమేశ్‌నాయుడు, ఎల్.కె.వి.రంగారావు, జె.ప్రభాకర్‌రావు, పి.మునిస్వామి, పి.వి.ఎస్.రామకృష్ణ, ఎం.శివప్రసాద్, ఆర్.బి.నాయక్, సూర్యనారాయణలను తెలంగాణకు కేటాయించారు.)
 
ఆంధ్రప్రదేశ్‌కు వీరు..
రాష్ట్రేతరులు (అన్ రిజర్వుడ్)
అశోక్‌ప్రసాద్, ఎస్‌ఎ హుడా, వివేక్ దుబే, భూపతిబాబు, ఈష్ కుమార్, వీఎస్‌కే కౌముది, ఆర్‌పీ ఠాకూర్, వినయ్‌రంజన్, వీకే సింగ్, టి.ఎ.త్రిపాఠి, కె.ఆర్.ఎం.కిశోర్‌కుమార్, అంజనీకుమార్, అంజనా సిన్హా, హసన్‌రేజా, హెచ్.కె.గుప్తా, మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్, అభిలాష, సౌమ్య మిశ్రా, కుమార్ విశ్వజిత్, ఎస్.పి.బాగ్చి, మహేష్ చంద్ర లడ్డా, మనీష్‌కుమార్‌సిన్హా, నవీన్ గులాటీ, శ్యామ్ సుందర్, ఎస్‌ఎస్ త్రిపాఠి, శేముషి, భాస్కర్‌భూషణ్, ఆర్.డి.శర్మ, అభిషేక్ మహంతి, వరుణ్. బి.ఆర్, ఎ.ఎన్.అస్మి, ఐశ్వర్య రస్తోగి.. కాగా.. అతుల్‌సింగ్, భావనా సక్సేనాలను ఎవరికీ కేటాయించలేదు.
 రాష్ట్రేతరులు (ఓబీసీ): భాగవత్, విజయ్‌కుమార్, రాజేశ్‌కుమార్, ఆర్.జయలక్ష్మి, ఎస్ సెంథిల్‌కుమార్, అంబురాజన్, కె.శశికుమార్
 రాష్ట్రేతరులు (ఎస్సీ): టి.కృష్ణరాజు, నళినీ ప్రభాత్, ఎ.రవిశంకర్, అనిల్‌కుమార్, నవ్‌దీప్‌సింగ్, విశాల్ గున్ని, సిద్ధార్థ్ కౌశల్
 రాష్ట్రేతరులు (ఎస్టీ): గౌతం సావంగ్, ఆర్.కె.మీనా, వినీత్ బ్రిజ్‌లాల్, ఫకీరప్ప
 రాష్ట్రానికి చెందిన వారు (జనరల్)..
 జె.వి.రాముడు, ఎన్.సాంబశివరావు, మాలకొం డయ్య, ఎన్.వి.సురేంద్రబాబు, ఎ.బి.వెంకటేశ్వర్రావు, తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, కె.బి.రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎం.బాలసుబ్రమణ్యం, మధుసూదన్‌రెడ్డి, కె.రఘురాంరెడ్డి, ఎ.రవికృష్ణ, జి.భూపాల్, కె.ప్రవీణ్, బి.ఎస్.యశుబాబు, వెంకటఅప్పలనాయుడు
 ఓబీసీ: ఎన్.సంజయ్, కాంతిరాణా టాటా, త్రివిక్రమ వర్మ, గోపీనాథ్, బాహుజీ అట్టాడా
 ఎస్టీలు: వి.ప్రసాదరావు, ఎస్.వెంకటరమణ మూర్తి, పి.వి.సునిల్‌కుమార్, సి.హెచ్.శ్రీకాంత్, విజయరావు
 కన్ఫర్డ్ ఐపీఎస్‌లు: వే ణుగోపాలకృష్ణ, జి.సూర్యప్రకాశరావు, బి.శ్రీనివాసులు, ఉమాపతి, ఇ.దామోదర్, బి.బాల కృష్ణ, అబ్రహం లింకన్, సుందర్‌కుమార్‌దాస్, యోగానంద్, కె.వెంకటేశ్వరరావు, పి.మురళీ కృష్ణ, ఎ.రవిచంద్ర, డి.రామకృష్ణ, షేక్ మహ్మద్ ఇక్బాల్, కాంతారావు, కె.బి.వి.గోపాలరావు, వి.వి.రమణకుమార్, పి.హరికుమార్, సి.ఎస్.ఆర్.కె.ఎల్.ఎన్.రాజు, ఎం.నాగన్న, సి.రవివర్మ, ఎ.ఎస్.ఖాన్, జె.సత్యనారాయణ, జి.శ్రీనివాస్, డి.నాగేంద్రకుమార్, ఎ.సత్యనారాయణ, టి.రవికుమార్ మూర్తి, కె.కోటేశ్వరరావు, పి.వెంకట్రామిరెడ్డి, జి.పి.రాజు, జి.వి.జి. అశోక్‌కుమార్, జి.విజయ్‌కుమార్, హరికృష్ణ, ఎం.రవిప్రకాశ్, ఎస్.వి.రాజశేఖర్‌బాబు, కె.వి.మోహన్‌రావు, పీహెచ్‌డీ రామకృష్ణ, ఎం.శ్రీనివాసులు, శ్యాంప్రసాద్‌రావు
 (తెలంగాణ ప్రాంతానికి చెందిన డెరైక్ట్ ఐపీఎస్‌లు పి.ఎస్.ఆర్.ఆంజనేయులు, బి.రాజకుమారిలను ఏపీకి కేటాయించారు)
 
 ఐఏఎస్‌ల పంపకాలు ఇలా..
 ఏపీకి కేటాయించిన ఆంధ్రా ప్రాంత డెరైక్ట్ ఐఏఎస్‌లు
 జనరల్ కేటగిరీ.. 20 మంది
 ఐ.వి.సుబ్బారావు, ఐ.వై.ఆర్.కృష్ణారావు, చిర్రావురి విశ్వనాథ్, రమేశ్‌కుమార్ నిమ్మగడ్డ, టి.విజయ్‌కుమార్, ఎల్.సుబ్రమణ్యం, అజయ్ కల్లాం, ఆర్.సుబ్రమణ్యం, డి.సాంబశివరావు, ఎ.గిరిధర్, కె.ఎస్.జవహర్‌రెడ్డి, జి.సాయిప్రసాద్, కె.విజయానంద్, ఎం.టి.కృష్ణబాబు, శ్రీకాంత్ నాగులపల్లి, భాస్కర్ కాటమనేని, వినయ్‌చంద్,  నారాయణ భరత్ గుప్తా, అమ్రపాలి కటా, విజయరామరాజు
 
 ఓబీసీ కేటగిరీ.. ఆరుగురు
 ఎం.రవిచంద్ర, జె.శ్యామలరావు, ముత్యాల రాజు, కె.వి.ఎన్.చక్రధరబాబు, మల్లికార్జున, యశ్‌షన్ మోహన్
 
 ఎస్సీ కేటగిరీలో.. 9 మంది
 వి.శాంబాబ్, ఎ.విద్యాసాగర్, డి.శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్.కె, బి.రాజశేఖర్, కాంతిలాల్ దండే, కోన శశిధర్, హరికిరణ్, జి.చంద్రుడు
 ఎస్టీ కేటగిరీలో.. ఇద్దరు
 ఎం.ఎం.నాయక్, జి.ఎస్.పాండదాస్
 ఏపీ డెరైక్ట్ ఐఏఎస్‌లలో 6గురు
 
 తెలంగాణకు..
 ఆంధ్రా ప్రాంతానికి చెందిన డెరైక్ట్ ఐఏఎస్‌లలో... జనరల్ కేటగిరీలో ఎ.శాంతకుమారి, ఓబీసీ కేటగిరీలో సుదర్శన్‌రెడ్డి, రాజీవ్‌గాంధీ హనుమంతు, ఎస్సీ కేటగిరీలో వెంకటరమేశ్‌బాబు, దానకిశోర్, ఎస్టీ కేటగిరీలో జె.రామానంద్‌లను తెలంగాణకు కేటాయించారు.
 
 ఏపీకి కేటాయించిన ఆంధ్రా ప్రాంత కన్ఫర్డ్ ఐఏఎస్‌లు

 ఎల్.ప్రేమచంద్రారెడ్డి, కె.మధుసూదన్‌రావు, ఎం.వి.సత్యనారాయణ, వై.వి.అనురాధ, బి.ఉదయలక్ష్మి, దమయంతి, డి.కాడ్మియల్, బి.ఉషారాణి, ఐ.శ్రీనివాస్, కె.రాంగోపాల్, కె.వాణీప్రసాద్, బి.రామాంజనేయులు, కె.సునీత, జి.వాణీమోహన్, డి.వరప్రసాద్, రామశంకర్‌నాయక్, బి.శ్రీధర్, విజయ్‌కుమార్, కె.ఎస్.శ్రీనివాస్‌రాజు,  కె.ఆర్.ఇ.హెచ్.ఎన్.చక్రవర్తి, గిరిజాశంకర్, జి.రవిబాబు, విజయమోహన్, ఎన్.కృష్ణ, కె.వి.రమణ, వెంకట్రామిరెడ్డి, పి.లక్ష్మినర్సింహులు, ఎన్.జగన్నాథం, శామ్యూల్ ఆనంద్‌కుమార్, కరుణ, కె.వి.సత్యనారాయణ, అరుణ్‌కుమార్, ఎం.పద్మ, పి.ఉషాకుమారి, పి.ఎ.శోభ, హర్షవర్థన్.కె, పి.భాస్కర్, ఎం.హరి జవహర్‌లాల్, పి.బాబురావునాయుడు, ఎం.రామారావు, కె.శారదాదేవి, ధనుంజయరెడ్డి, జె.మురళి, సీహెచ్ శ్రీధర్, ఎం.వి.శేషగిరిబాబు, డి.మురళీధర్‌రెడ్డి, లక్ష్మీకాంతం, కె.కన్నబాబు, ఎస్.సత్యనారాయణ, బి.బసంత్‌కుమార్, బి.రామారావు, సూర్యకుమారి, రేఖారాణి, డాక్టర్ సి.శ్రీధర్, ఎ.మహ్మద్ ఇంతియాజ్, పి.కోటేశ్వరరావు, ఎం.ప్రశాంతి
 
 తెలంగాణకు కేటాయించిన ఆ ప్రాంత డెరైక్ట్ ఐఏఎస్‌లు

 జనరల్ కేటగిరీలో..: లక్ష్మీ పి.భాస్కర్, సి.వి.వెంకటరమణ, ఎం.జి.గోపాల్, వినోద్‌కుమార్ అగర్వాల్, వి.నాగిరెడ్డి, జె.రేమండ్ పీటర్, పుష్పా సుబ్రమణ్యం, జె.ఎస్.వి.ప్రసాద్, వై.శ్రీలక్ష్మి,  కె.రామకృష్ణారావు, సవ్యసాచి ఘోష్, శైలజారామయ్యార్, స్మితాసబర్వాల్, కె.శశాంక, శ్రీజనాజి
 
 ఓబీసీల్లో..: బి.వెంకటేశం, ఎన్.శ్రీధర్
 ఎస్సీ కేటగిరీలో..: ఎ.ప్రదీప్‌చంద్ర, వై.రాణి కౌముదిని, రాహుల్‌బొజ్జా, హరిచందన దాసరి, శివశంకర్
 తెలంగాణకు కేటాయించిన ఆ ప్రాంత కన్ఫర్డ్ ఐఏఎస్‌లు.. 45 మంది వి.అరవింద్‌రెడ్డి, బి.వెంకటేశ్వరరావు, శివశంకర్, జగదీశ్వర్, పార్థసారథి, వి.ఎన్.విష్ణు, ఆర్.వి.చంద్రవదన్, జి.డి.అరుణ, బి.అనిల్‌కుమార్, బి.జనార్ధన్‌రెడ్డి, ఎల్.శశిధర్, వెంకట్రామిరెడ్డి, ఎ.అశోక్, ఎం.వీరబ్రహ్మయ్య, అనితా రాజేంద్ర, సయ్యద్ ఒమర్‌జలీల్, ఎం.జగన్‌మోహన్, దినకర్ బాబు, జి.కిషన్, ఎం.రఘునందన్‌రావు, టి.చిరంజీవులు, జి.డి.ప్రియదర్శిని, టి.విజయకుమార్, పి.సత్యనారాయణరెడ్డి, ఇ.శ్రీధర్, మహ్మద్ అబ్దుల్ అజీం, టి.కె.శ్రీదేవి, బి.బాల మాయాదేవి, అనితారామచంద్రన్, కె.నిర్మల, ఎల్.శర్మన్, పార్వతీ సుబ్రమణ్యన్, ఎ.శరత్, ఎం.చంపాలాల్, ఆకునూరి మురళి, బి.భారతీ లక్‌పతీ నాయక్, బి.విజయేంద్ర, కె.వై.నాయక్, పి.వెంకట్రామిరెడ్డి, కె.సురేంద్రమోహన్, డాక్టర్ ఎం.వి.రెడ్డి, డి.వెంకటేశ్వరరావు, ఏపీ దేవసేన, ఎం.సత్యనారాయణ, ఎ.అరవిందర్‌సింగ్.
తెలంగాణ ప్రాంతానికి చెందిన కన్ఫర్డ్ ఐఏఎస్ అయిన బి.కిశోర్‌ను ఏపీకి కేటాయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement