ట్రైనీ ఐపీఎస్‌లతో మాట్లాడుతున్న రాష్ట్రపతి ముర్ము. చిత్రంలో మంత్రి సత్యవతి
సాక్షి, హైదరాబాద్: భారత భవిష్యత్తు భారం యువ ఐపీఎస్ అధికారుల భుజస్కంధాలపైనే ఉందని, వారంతా భారత ప్రతిష్టను పెంచేలా కృషి చేస్తారన్న విశ్వాసం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రాష్ట్రపతి మంగళవారం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)ని సందర్శించారు. ఎన్‌పీఏ డైరెక్టర్ ఏఎస్ రాజన్ అకాడమీ తరఫున రాష్ట్రపతికి స్వాగతం పలికారు.
అనంతరం అకాడమీ ఆవరణలోని ఐపీఎస్ అధికారుల స్మారక స్థూపం వద్ద రాష్ట్రపతి పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత అకాడమీలో శిక్షణ పొందుతున్న 195 మంది 74వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ అధికారులనుద్దేశించి ఆమె ప్రసంగించారు. తొలుత ప్రతిష్టాత్మకమైన సేవలోకి అడుగు పెడుతున్న యువ ఐపీ ఎస్‌లకు అభినందనలు తెలిపారు.
ప్రభు త్వాల పనితీరును, ప్రతిష్టను పెంచే కీలక బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉందన్నారు. పౌరులకు ప్రభుత్వ సేవలు చేరువ చేయ డంలో పోలీస్ అధికారుల వ్యక్తిత్వం, ప్రవర్తన కీలకమని సూచించారు. నేరాల కట్టడి, నేరాల దర్యాప్తు, ఉగ్రవాదం, మత ఘర్షణలు, వ్యవస్థీకృత నేరాల అదుపు వంటి సవాళ్లు పెరుగుతున్నాయని తెలిపారు.
పోలీసింగ్‌లో నాయకులుగా నిలవాలి
సమాజంలో మహిళలు ముఖ్యపాత్ర పోషి స్తున్నారని, గత మూడేళ్లుగా ఎన్‌పీఏ శిక్షణ లోనూ మహిళా అధికారులు సత్తా చాటు తూ టాపర్లుగా నిలిచారని రాష్ట్రపతి చెప్పారు. మరో 25 ఏళ్లలో భారతదేశం వందో వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోందని, భవిçÙ్యత్ భారత నిర్మాణంలో ఈ యువ అధికారులది కీలక పాత్ర అన్నారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment