సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పర్యటించనున్నారు. శిల్పారామం వేదికగా ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే లోక్‌మంథన్-2024 కార్యక్రమం జరగనుంది. లోక్‌మంథన్-2024లో 22న వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే మేధోమథన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రారంభిస్తారు.
ఇందులో భాగంగా రేపు, ఎల్లుండి తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు రానున్నారు. రేపు సాయంత్రం 6.20 గంటల నుంచి 7.10 గంటల వరకు రాజ్‌భవన్‌లో ఉండనున్నారు. రేపు రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment