National Police Academy
-
హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ ఔట పెరేడ్
-
75వ IPS బ్యాచ్ కు చెందిన పాసింగ్ అవుట్ పెరేడ్
-
ఈ నెల 11న హైదరాబాద్‌కు అమిత్ షా.. పోలీస్ అకాడమీలోని పరేడ్‌కు హజరు!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేయనున్న పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొననున్నారు. కాగా ఈనెల 11న నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 74ఆర్ఆర్ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ బ్యాచ్‌లో 195 మంది ప్రొబేషనర్లు శిక్షణ పొందారు. ఈ పరేడ్‌కు కేరళ కేడర్‌కు చెందిన శెహన్‌షా నేతృత్వం వహించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎనిమిది సంవత్సరాల శిక్షణ పందిన శెహన్‌షా.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు మెడల్స్ గెలుచుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన సీఐఎస్ఎఫ్, ఐఆర్పీఎఫ్లలో సైతం బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా తర్వాత ఇదే కాగా కోవిడ్ తర్వాత పూర్తిస్థాయిలో జరగనున్న పాసింగ్ అవుట్ పరేడ్ ఇదేనని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు. ఈ ఏడాదితో ఎన్పీఏ 75 వసంతాలు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. 74వ బ్యాచ్‌లో 195 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పొందారన్నారు. వీరిలో 166 మంది భారతీయులు, 29 మంది విదేశీ శిక్షణార్థులున్నారు. 37 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నట్లు తెలిపారు. వీరంతా 46 వారాలపాటు కఠోర శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. ఈసారి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇండోర్, ఔట్ డోర్ సబ్జెక్ట్‌లు కలిపి 17 అంశాలపై ట్రైనింగ్ పొందారు. ఈనెల 11న జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌తో 46 వారాల శిక్షణ పూర్తవుతుంది. ఆ తర్వాత ఢిల్లీకి పంపిస్తారు. అక్కడ మరికొన్ని వారాల శిక్షణ పొందిన తర్వాత వాళ్లకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్తారు. అక్కడినుండి వాళ్ళను నియమించిన జిల్లాలలోకి వెళ్తారు. విధి నిర్వహణలో ఐపీఎస్‌లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకు మెంటర్స్ ఉంటారు.’ అని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు నూతన ఐపీఎస్‌లు తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు నూతన ఐపీఎస్‌లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణకు కేటాయించిన అయిదుగురిలో అవినాష్ కుమార్, శేషాద్రిని రెడ్డి, మహేష్ బాబా సాహేబ్, అంకిత్ శంకేశ్వర్, శివం ఉపాధ్యాయ ఉన్నారు. ఏపీకి కేటాయించిన ఇద్దరిలో పంకజ్ కుమార్ మీనా, అంకిత్ మహవీర్లు ఉన్నారు. -
రంగారెడ్డి: నేషనల్ పోలీస్ అకాడమీలో కంప్యూటర్లు చోరీ
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్ర నగర్ మండలంలోని హైదరాబాద్ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఐపీఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అకాడమీ నుంచి కంప్యూటర్లు మాయం అయ్యాయి. సిబ్బంది కళ్లు గప్పిన కేటుగాడు.. సుమారు ఏడు కంప్యూటర్లు మాయం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఇది ఎట్టకేలకు అది ఇంటి దొంగ పనే అని తేల్చారు అధికారులు. కంప్యూటర్లు మాయం అయిన విషయాన్ని గమనించిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. దొంగను ఐటీ సెక్షన్ లో పని చేస్తున్న చంద్రశేఖర్ గా గుర్తించారు. ఈ మేరకు ఎన్పీఏ అధికారులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీస్ అకాడమీలో చోరీ జరగడం, అది బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. -
భారత భవిష్యత్తు మీ భుజాలపైనే..!
సాక్షి, హైదరాబాద్: భారత భవిష్యత్తు భారం యువ ఐపీఎస్ అధికారుల భుజస్కంధాలపైనే ఉందని, వారంతా భారత ప్రతిష్టను పెంచేలా కృషి చేస్తారన్న విశ్వాసం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రాష్ట్రపతి మంగళవారం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)ని సందర్శించారు. ఎన్పీఏ డైరెక్టర్ ఏఎస్ రాజన్ అకాడమీ తరఫున రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం అకాడమీ ఆవరణలోని ఐపీఎస్ అధికారుల స్మారక స్థూపం వద్ద రాష్ట్రపతి పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత అకాడమీలో శిక్షణ పొందుతున్న 195 మంది 74వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ అధికారులనుద్దేశించి ఆమె ప్రసంగించారు. తొలుత ప్రతిష్టాత్మకమైన సేవలోకి అడుగు పెడుతున్న యువ ఐపీ ఎస్‌లకు అభినందనలు తెలిపారు. ప్రభు త్వాల పనితీరును, ప్రతిష్టను పెంచే కీలక బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉందన్నారు. పౌరులకు ప్రభుత్వ సేవలు చేరువ చేయ డంలో పోలీస్ అధికారుల వ్యక్తిత్వం, ప్రవర్తన కీలకమని సూచించారు. నేరాల కట్టడి, నేరాల దర్యాప్తు, ఉగ్రవాదం, మత ఘర్షణలు, వ్యవస్థీకృత నేరాల అదుపు వంటి సవాళ్లు పెరుగుతున్నాయని తెలిపారు. పోలీసింగ్‌లో నాయకులుగా నిలవాలి సమాజంలో మహిళలు ముఖ్యపాత్ర పోషి స్తున్నారని, గత మూడేళ్లుగా ఎన్పీఏ శిక్షణ లోనూ మహిళా అధికారులు సత్తా చాటు తూ టాపర్లుగా నిలిచారని రాష్ట్రపతి చెప్పారు. మరో 25 ఏళ్లలో భారతదేశం వందో వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోందని, భవిçÙ్యత్ భారత నిర్మాణంలో ఈ యువ అధికారులది కీలక పాత్ర అన్నారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రైనీ ఐపీఎస్ అధికారుల సాహసంపై ప్రశంసల జల్లు
సాక్షి,హైదరాబాద్: నగరంలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్‌లు సముద్రంలో మునిగిపోతున్న ఓ కుటుంబాన్ని కాపాడి వారి పాలిట ఆపద్భాందవులు అయ్యారు. ఎన్‌పీఏలోని ట్రైనీ ఐపీఎస్‌లు అభినవ్ ధీమాన్, అభినయ్ విశ్వకర్మ, భరత్ సోనీ, గౌహర్ హసన్, సువేందు పాత్ర, తెషూ లెందీప్ (భూటాన్ ) అహ్మద్ అబ్దుల్ అజీజ్ (మాల్దీవులు), మహమ్మద్ నజీవ్ (మాల్దీవులు) భారత్‌యాత్ర కార్యక్రమం కోసం ఇటీవల లక్షద్వీప్ దీవులకు వెళ్లారు. 8 trainees including 5 IPS, 2 from Maldives and one from Bhutan, during their visit to Lakshadweep islands, showed valiant act & rescued a family drowning in the sea. The Academy appreciated the self-less act of bravery true to the sense of uniform to help the people in need pic.twitter.com/1EH7JsQeQ5 — SVPNPA (@svpnpahyd) June 5, 2021 అక్కడ వీరంతా బీచ్‌లో గడుపుతున్న సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ఓ అధికారి కుటుంబం ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోతుండటం చూశారు. వెంటనే ఈ ఎనిమిది మంది సముద్రంలోకి దూకి వారందర్నీ రక్షించారు. విషయం తెలిసిన అకాడమీ వీరి ధైర్య సాహసాలను ఆదివారం ప్రత్యేకంగా అభినందించి మీడియాకు వెల్లడించింది. ట్రైనీ ఐపీఎస్ అధికారుల సాహసంపై నెటిజన్లు ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు. Kudos to our two gallant officers, Chief Inspector of Police Ahmed Abdul Azeez & Chief Inspector of Police Mohamed Nazim currently undergoing IPS training at the @svpnpahyd, for their bravery in saving a family of 4 including 2 children from a drowning incident in Lakshadeep 1/2 pic.twitter.com/H6JELebO4i — Maldives Police (@PoliceMv) June 5, 2021 చదవండి: నారాయణఖేడ్‌లో బొలేరో వాహనం బీభత్సం -
పోలీసులు సేవలు ఎప్పటికీ మరువలేం : మోదీ
సాక్షి, హైదరాబాద్ : 71వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో పోలీసుల సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. పోలీసుల పాత్రపై స్కూళ్లలోనే పాఠాలు చెప్పాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా, ప్రాణాయామం భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు. కాగా, నేషనల్ పోలీస్ అకాడమీలో 131 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. వీరిలో 28 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. 42 వారాల పాటు శిక్షణ పూర్తిచేసుకున్న వీరిని పలు కేడర్లకు నియమించారు. తెలంగాణకు 11మంది, ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు ఐపీఎస్‌లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. (చైనాకు తగిన రీతిలో బదులిస్తాం: రావత్) -
ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న మోదీ
-
చిరుత కోసం మళ్లీ వేట..
-
కరోనా ఎఫెక్ట్: ట్రైనీ ఐపీఎస్‌ల ఔట్‌డోర్ శిక్షణ రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో నేషనల్ పోలీసు శిక్షణ అకాడమీ నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ట్రైనీ ఐపీఎస్ అధికారులకు ఔట్‌డోర్ శిక్షణను రద్దు చేసింది. ప్రస్తుతం ఎన్పీఏలో 229 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పొందుతున్నారు. ఐపీఎస్‌ల శిక్షణ అకాడమీలోనే కొనసాగనుందని అధికారులు తెలిపారు. కానీ, ఐపీఎస్‌లకు సంబంధించిన వారు శిక్షణ అకాడమీలోకి ప్రవేశించడానికి అనుమతి లేదన్నారు. లోపలి వాళ్లు బయటకి, బయటి వాళ్లు లోపలికి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వైరస్ నివారణ కోసం సానిటైజర్లు, మాస్క్‌లు ఇతర జాగ్రత్తలను నేషనల్ పోలీసు శిక్షణ అకాడమీ అధికారులు తీసుకుంటున్నారు. -
ఎన్పీఏ డైరెక్టర్‌గా అతుల్ కర్వాల్
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) నూతన డైరెక్టర్‌గా అతుల్ కర్వాల్ నియమితులయ్యా రు. ఈ మేరకు బుధవారం కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. 1988 ఐపీఎస్ బ్యాచ్, గుజరాత్ కేడర్‌కు చెందిన అతుల్ ప్రస్తుతం సీఆర్పీఎఫ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. -
ఉగ్రవాదంపై ‘వర్చువల్’ పోరు!
సాక్షి, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారులకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తానని నేషనల్ పోలీస్ అకాడమీ నూతన డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ అభయ్ అన్నారు. బుధవారం ఉదయం అకాడమీ అధికారుల ఘనస్వాగతం అనంతరం నూతన డైరెక్టర్‌గా అభయ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1986 ఐపీఎస్ బ్యాచ్ ఒడిశా కేడర్‌కి చెందినవారు. అనంతరం అభయ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భావి ఐపీఎస్ ఆఫీసర్లను తీర్చిదిద్దే అకాడమీ బాధ్యతలను స్వీకరించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తాను గతంలో సీబీఐ (బ్యాండ్ఫ్రాడ్), సీఆర్పీఎఫ్, నార్కోటిక్స్ బ్యూరోలో విధులు నిర్వహించానన్నారు. దేశంలో అధిక సంఖ్యలో ఐపీఎస్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక అకాడమీలో ప్రస్తుతం 350 మంది ఆఫీసర్లు శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు. వీరిలో 147 మంది ఆఫీసర్లు ఫేజ్–1, మరో 121 మంది ఫేజ్–2 ట్రైనింగ్‌లో ఉన్నారని తెలిపారు. మిగిలిన వారిలో ఫారిన్ ఆఫీసర్లు కూడా ఉన్నారని వివరించారు. గడిచిన పదేళ్లలో అకాడమీలో కాలానుగుణంగా శిక్షణ విధానంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. సీబీఐ, ఎన్ఐఏలో కేసు దర్యాప్తు తర్వాత న్యాయ విచారణను పర్యవేక్షించే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఉగ్రవాద పోరులో భాగంగా ఆధునిక పద్ధతిలో వర్చువల్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దర్యాప్తు విధానంలో (ఉగ్రవాదం, ఆర్థిక నేరాలు) అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. వర్చువల్ తరగతులు అంటే..? వర్చువల్ తరగతులు అనగా కంప్యూటర్ సాయంతో భారీ తెరలను ఏర్పాటు చేసి టార్గెట్‌ను ఛేదించే ఒక ఆధునిక విధానం. చాలామంది పిల్లలు ప్లే స్టేషన్ పేరిట వివిధ గేమ్స్‌ని నిజంగా ఆడిన అనుభూతిని పొందినట్లే.. ఉగ్రవాద దాడి జరిగినపుడు శత్రువుపై ఎలా దాడి చేయాలి? ఎటునుంచి ముప్పు పొంచి ఉంది? క్షణాల్లో ఎలా దాడి చేయాలి? సురక్షితంగా ఎలా రావాలి? అన్న విషయాలపై శిక్షణ ఇస్తారు. -
119 మంది ఐపీఎస్‌లు ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: త్వరలో వివిధ రాష్ట్రాల్లో పోలీస్ అధికారులుగా బాధ్యతలు చేపట్టనున్న దాదాపు 119 మంది ఐపీఎస్ అధికారులు శిక్షణా పరీక్షలో ఫెయిల్ అయ్యారు. విచిత్రమేమిటంటే పరీక్ష రాసినవారి సంఖ్య 122 అయితే, 90 శాతం మంది అభ్యర్థులు పరీక్ష తప్పారన్నమాట. ఇది నేషనల్ పోలీస్ అకాడమీ చరిత్రలో ఓ రికార్డు. వాస్తవానికి 136 మంది అధికారులు పరీక్ష రాయగా... వీరిలో 14 మంది ఇండియన్ ఫారిన్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్)కు చెందినవారు. అంటే పరీక్ష రాసిన ఐపీఎస్‌ల సంఖ్య 122 కాగా, వీరిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయినవారు 119 మంది. అంటే అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణులైనవారు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. జరిగిందేమిటంటే...: ప్రతి ఏడాది సివిల్స్ పరీక్షల్లో పాసైనవారిలో అర్హులైన ఐఏఎస్ అధికారులకు ముస్సోరిలో ఉన్న లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ఇండియన్ పోలీసు సర్వీస్(ఐపీఎస్) అధికారులకు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ఇలా 2016 బ్యాచ్‌కు చెందిన అభ్యర్థుల పరీక్షల ఫలితాలు ఇటీవలే వెల్లడయ్యాయి. వీరిలో 119 మంది ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కాలేదు. ఇలా శిక్షణా పరీక్షలో ఫెయిల్ అయినా, వీరికి గ్రాడ్యుయేషన్ ఇవ్వడమేగాక ప్రొబేషన్ కింద అధికారులుగా నియమిస్తారు. అయితే, వీరు అన్ని సబ్జెక్టులను పూర్తి చేసేందుకు మరో రెండు అవకాశాలు ఇస్తారు. అంటే పరీక్ష పాసయ్యేందుకు మొత్తం మూడు అవకాశాలుంటాయన్నమాట. ఈ మూడుసార్లు ఫెయిలయితే వారిని సర్వీసులో కొనసాగించరు. టాపర్స్ కూడా... మొత్తం 136 మంది ఆఫీసర్లలో 133 మంది ఆఫీసర్లు ఒకటి లేదా రెండు సబ్జెక్ట్‌లలో ఫెయిలయ్యారు. ప్రధానంగా ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లలో కూడా వీరు ఫెయిల్ అయినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది. పాసింగ్ ఔట్ పరేడ్‌లో మెడల్స్, ట్రోఫీలు పొందిన టాపర్స్ కూడా ఫెయిల్ అయినవారిలో ఉన్నారు. అకాడమీ చరిత్రలో ఇంతమంది ఫెయిల్ కావడం అరుదని ఓ అధికారి అన్నట్లు టైమ్స్ రాసింది. పరీక్షల్లో ఫెయిల్ కావడం సాధారణమేనని, కాని ఇలా గంపగుత్తగా 90 శాతం మంది ఫెయిల్ కావ డం ఇదే మొదటిసారని ఓ అధికారి అన్నారు. లా అండ్ ఆర్డర్ వంటి ప్రాథమిక సబ్జెక్ట్‌లలో కూడా చాలా మంది ఫెయిల్ అయినట్లు పత్రిక రాసింది. ఇక్కడ పొందే మార్కులు సీనియారిటీ విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఇక్కడి పరీక్షలను చాలా మంది సీరియస్‌గా తీసుకుంటారు. హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ శిక్షణ 45 వారాల పాటు సాగుతుంది. -
పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా డోలే బర్మన్
⇒ మళ్లీ మహిళా అధికారినే నియమించిన కేంద్రం ⇒ నేడు బాధ్యతల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ కొత్త డైరెక్టర్‌గా మళ్లీ మహిళా అధికారినే నియమిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అరుణాబహుగుణ మంగళవారం పదవీ విరమణ పొందటంతో.. ఆ స్థానంలో 1986 జమ్మూకశ్మీర్ క్యాడర్ ఐపీఎస్ అధికారి డీఆర్ డోలేబర్మన్ను నియమించింది. ప్రస్తుతం మేఘాలయ రిబోయి జిల్లాలోని ఉమియాం నార్త్ ఈస్టర్న్ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బర్మన్.. బుధవారం ఎన్పీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నో అవార్డులు... రివార్డులు... షిల్లాంగ్‌లో పుట్టిన డోలే బర్మన్ ఢిల్లీ యూనివర్సిటీలో లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ఆనర్స్ చేశారు. అదే కాలేజీ నుంచి పీజీ పూర్తిచేసిన బర్మన్ 1986 జమ్మూకశ్మీర్ క్యాడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. జమ్మూకశ్మీర్‌లో ఎస్డీపీవోగా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత కశ్మీర్లో ట్రాఫిక్ ఎస్పీగా, అస్సాంలో ట్రైనింగ్ అండ్ ఆర్మ్డ్ పోలీసు ఏఐజీగా, ఎస్పీ (సెక్యూరిటీ)గా, జమ్మూకశ్మీర్‌లో ట్రాఫిక్ డీఐజీగా, ఢిల్లీ సీబీఐలో అవినీతి నిరోధక విభాగానికి డీఐజీగా, గౌహతి ఎస్ఎస్బీ ఐజీగా, జమ్మూకశ్మీర్ సీఐడీ (ఇంటెలిజెన్స్) ఐజీపీగా పనిచేశారు. ఆమె సేవలకు జమ్మూకశ్మీర్ డీజీపీ అవార్డులు, 2008లో గౌహతిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సమాచారం ముందుగానే గుర్తించినందుకు ఎస్ఎస్బీ డీజీపీ అవార్డు, షేర్–ఈ–కశ్మీర్ పతకం, ఇండియన్ పోలీసు మెడల్, ప్రెసిడెంట్ మెడల్‌ను అందుకున్నారు. -
పోలీసుల పాత్ర భేష్
బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పోలీసుల పాత్ర ఎనలేనిదని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత దలైలామా అన్నారు. నగరంలోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీని శనివారం సందర్శించిన దలైలామా పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. బీసీటీసీ కాంప్లెక్స్ ఆవరణలో మొక్కను నాటారు. కాంప్లెక్స్ ఆడిటోరియంలో 139 ఐపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్లు, 15 విదేశీ ట్రైనీలను ఉద్దేశించి దలైలామా ప్రసంగించారు. ఆధిపత్య ధోరణి విడనాడి కులమతాలకు అతీతంగా ఏకత్వం దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, మత సామరస్యానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత కోసం కృషిచేసిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంటే అభిమానమ న్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పోలీసుల పాత్రను ప్రశంసిస్తూ.. గత 50 ఏళ్లకు పైగా తనకు భద్రత కల్పిస్తున్నది పోలీసులేనని గుర్తుచేశారు. మానవ సంబంధాలను మెరుగుపర్చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చుకోవాలని బౌద్ధగురువు సూచించారు. మనిషి ముందుగా తనను తాను తెలుసుకోవాలని, ఈ విషయంలో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. కరుణ, ప్రేమ, అహింస మార్గాల్లో నడవాలన్నారు. అనంతరం ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆధ్యాత్మిక గురువు ఓపికగా సమాధానమిచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపారు. సరైన సమయంలో ఆధ్యాత్మిక గురువు తమ అకాడమీని సందర్శించారని డైరెక్టర్ శ్రీమతి అరుణ బహుగుణ పేర్కొన్నారు. ఆయన సందేశం కచ్చితంగా యువ పోలీస్ అధికారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నేడు దలైలామా ఎథిక్స్ సెంటర్ శంకుస్థాపన హైదరాబాద్ మాదాపూ ర్లోని హెటెక్స్ రోడ్డులో ‘దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్’ భవనానికి బౌద్ధ మతగురువు దలైలామా ఆదివారం ఉదయం 9 గంటలకు శంకుస్థాపన చేయను న్నారు. అనంతరం హైటెక్స్ ఓపెన్ ఎరినాలో 10 నుంచి 11.30 గంటల వరకు నైతికత, విలువలు అంశంపై ఆయన మాట్లాడతారు. -
ప్రధాని బందోబస్తు కోసం వచ్చి...
యువ ఎస్సై ఆత్మహత్య - సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం - రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన - మృతుని స్వస్థలం వరంగల్ హైదరాబాద్: అన్ని రాష్ట్రాల డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ పోలీసు అకాడమీ(ఎన్పీఏ)కి వచ్చిన ప్రధాని మోదీ బందోబస్తు విధుల కోసం రాజధానికి వచ్చిన ఓ యువ ఎస్సై అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి ఠాణా ఎస్సై బోరిగం శ్రీధర్ (34) శుక్రవారం రాత్రి దాదాపు 11 గంటల సమయంలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 173 వద్ద నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో తన సర్వీస్ రివాల్వర్‌తో గుండెల్లో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అరుుతే శనివారం ఉదయం వరకూ ఈ ఘటనను ఎవరూ గుర్తించలేదు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసుల కథనం ప్రకారం...వరంగల్ నగరంలోని పైడిపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ గురువారం రాత్రే రాజధానికి వచ్చాడు. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 173 (ఉప్పర్‌పల్లి) వద్ద నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ 19వ అంతస్తు నుంచి హోంగార్డు దీపక్‌తో కలసి శుక్రవారం రాత్రి 10.30 గంటల వరకు బందోబస్తు విధులు నిర్వహించాడు. ఆ తర్వాత కిందకు వెళదామని దీపక్ కోరగా తాను రానని చెప్పి దీపక్‌ను పంపించాడు. అనంతరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఓ యువతితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. అరుుతే దాదాపు రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా సర్వీసు రివాల్వర్‌ను గుండెకు గురిపెట్టుకొని కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్ రిలీవర్ అరుున మరో ఎస్సై రాజేశ్ విధుల కోసం శనివారం ఉదయం 10 గంటలకు 19వ అంతస్తుకు వెళ్లగా రక్తపు మడుగులో శ్రీధర్ పడిఉండటాన్ని చూసి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. హుటాహుటిన పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని పంచానామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అరుుతే కుటుంబ పరిస్థితులు, ప్రేమ వ్యవహారం కారణంగానే శ్రీధర్ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలోని గొడవలతో మనోవేదనకు గురైన శ్రీధర్ ఆఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పైడిపల్లిలో విషాదం పైడిపల్లికి చెందిన కొమురయ్య మూడో కుమారుడైన శ్రీధర్ ఆత్మహత్య వార్త తెలియడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. కొడుకు మరణవార్త తెలియగానే తల్లి జమున కుప్పకూలింది. బంధువులు, మిత్రులు, గ్రామస్తులు అతనికి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తొలి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ చింతలమానెపల్లి: చిన్నప్పటి నుంచీ చదువులో చురుకుగా ఉండే శ్రీధర్...డిగ్రీ అనంతరం 2007లో తొలి ప్రయత్నంలోనే స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)బెటాలియన్‌కు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అనంతరం 2012 బ్యాచ్‌లో ఎస్సై ఎంపికయ్యాడు. తొలిసారిగా 2014లో గుడిహత్నూర్‌లో ఎస్సైగా విధులు నిర్వహించాడు. 2015లో ముథోల్‌లో పనిచేసి కాగజ్‌నగర్‌కు బదిలీపై వచ్చిన శ్రీధర్...2016 అక్టోబర్ వరకు కాగజ్‌నగర్ రూరల్ ఎస్సైగా విధులు నిర్వహించాడు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యాడు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన చింతలమానెపల్లి మండల ఎస్సైగా అక్టోబర్ 12న బాధ్యతలు చేపట్టాడు. ప్రేమ వ్యవహారమే కారణం? హసన్‌పర్తి: ఎస్సై శ్రీధర్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. కులాలు వేరు కావడంతో ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిన కుటుంబ సభ్యులు అతనికి పెళ్లి సంబంధాలు చూస్తుండటం, అదే సమయంలో యువతికి మరో వ్యక్తితో వివాహం కుదరడం వల్ల శ్రీధర్ కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. -
రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది?
- నోట్ల రద్దు పరిణామాలపై ఆరా తీసిన ప్రధాని - ఇబ్బందులు తొలగించే చర్యలు చేపట్టాలని కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: జాతీయ పోలీసు అకాడమీలో సదస్సు అనంతరం నేరుగా విమానాశ్రయానికి వచ్చిన ప్రధాని.. నోట్ల రద్దు తర్వాత తలెత్తిన పరిణామాలపై సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందని ప్రధాని అడిగినట్లు సమాచారం. దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని కేసీఆర్‌ను కోరినట్లు తెలిసింది. అరుుతే దేశంలో నల్లధనం నిర్మూలన కోసం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలివ్వాలని... అదే క్రమంలో సామాన్యులు, రైతులు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారు ఇబ్బంది పడవద్దన్నది తమ ఉద్దేశమని ప్రధానికి సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో చిల్లర నోట్ల సమస్య తీవ్రంగా ఉందని, కొత్త రూ.500 నోట్లు కూడా పెద్ద మొత్తంలో సరఫరా చేయాలని చెప్పారు. రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వర్తకులు ఇబ్బంది పడకుండా ఉండేలా విధానాన్ని రూపొందించి అమలు చేయాలని అభ్యర్థించారు. మొత్తంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలో ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థారుులో ప్రక్షాళన చేసేందుకు దోహదపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మోదీకి వెండి వీణను, తెలంగాణ ప్రాశస్త్యాన్ని తెలిపే పుస్తకాన్ని బహూకరించారు. అనంతరం మోదీ 7.10 గంటల సమయంలో వాయుసేన విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. -
గ్రేటర్లో హై అలర్ట్!
{పధాని రాక, డీజీపీల సదస్సు నేపథ్యంలో మూడు కమిషనరేట్లలో ఆంక్షలు సిటీబ్యూరో: దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు/ఐజీపీల వార్షిక సమావేశానికి నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడెమీ (ఎన్పీఏ) వేదికై ంది. మూడు రోజుల పాటు జరిగే సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యారుు. కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు 50 మంది డీజీపీలు/ఐజీపీలతో పాటు వివిధ నిఘా, భద్రతా సంస్థలకు చెందిన అధిపతులు హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో పాటు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం సిటీకి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అపశృతులకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గురువారం నుంచే అదనపు బలగాలను రంగంలోకి దింపి పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. కొన్ని సున్నిత, సమస్యాత్మక, అనుమానిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముగ్గురు కమిషనర్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు సీసీఎస్, సిట్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ, సిటీ ఆర్డ్ ్మ రిజర్వ్, టీఎస్ఎస్పీ, ఆక్టోపస్ బలగాలను మోహరించారు. అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా పెట్టడానికి భారీగా పోలీసులను మఫ్టీలో మోహరించారు. ఎలాంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేలా క్విక్ రియాక్షన్ టీమ్‌తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రైకింగ్ ఫోర్స్‌ను అన్ని వేళలా అందుబాటులో ఉంచుతున్నారు. నగరంలోని 40 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పారుుంట్ల ద్వారా వాహనాల తనిఖీ చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో నాకాబందీలు కొనసాగిస్తున్నారు. లాడ్జీల్లో ఆకస్మిక సోదాలు చేస్తూ నిఘా ఉంచారు. ఎన్పీఏ చుట్టపక్కల ప్రాంతాల్లో అడుగడుగునా పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటనతో పాటు డీజీపీల సదస్సు పూర్తయ్యే వరకు అప్రమత్తత కొనసాగనుంది. సాదాసీదా మోదీ కాన్వాయ్ రాజేంద్రనగర్: శంషాబాద్ ఎరుుర్‌పోర్టు నుంచి ప్రధాని మోదీ కాన్వారుు సాదాసీదాగా నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకుంది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆరాంఘర్ నుంచి కేవలం తొమ్మిది వాహనాల కాన్వారుుతో ప్రధాని తరలివెళ్లారు. వెనుకాల 108 వాహనం మాత్రమే ఉండటం విశేషం. -
మోదీ హైదరాబాద్ రాక నేడే
-
మోదీ రాక నేడే
నేడు, రేపు హైదరాబాద్‌లోనే ఉండనున్న ప్రధాని డీజీపీ/ఐజీపీల వార్షిక సదస్సుకు హాజరు రాజకీయ పార్టీలు, ప్రముఖులతో భేటీపై అస్పష్టత సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. చండీగఢ్ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.35 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి వస్తారు. గంటసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఐపీఎస్‌లతో విందు సమావేశంలో పాల్గొంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ/ఐజీపీల సమావేశంలో పాల్గొంటారు. తర్వాత రోడ్డు మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. ఢిల్లీకి బయలుదేరుతారు. నోట్ల రద్దు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రధాని రాక ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పర్యటనలో రాష్ట్రానికి చెందిన ప్రముఖులను, రాజకీయ పార్టీల నేతలను కలుస్తారా, లేదా? అనే దానిపై స్పష్టత లేదు. అలాంటి వివరాలేవీ ప్రధాని పర్యటన షెడ్యూల్లో పొందుపర్చలేదు. అయితే తన దినచర్యలో భాగంగా ప్రధాని శనివారం తెల్లవారుజామున గంట సేపు యోగా కార్యక్రమంలో పాల్గొననుండటం గమనార్హం. పోలీసు పతకాలు ప్రదానం చేయనున్న మోదీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఏటా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్/ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్రీయ పోలీసు సంస్థల అధిపతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నుంచి రెండు రోజులపాటు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 51వ వార్షిక సదస్సు జరుగుతోంది. ఇందులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ పాల్గొంటున్నారు. ఇంటెలిజెన్స బ్యూరో అధికారులకు రాష్ట్రపతి పోలీసు పథకాలను, పోలీసు పథకాలను ప్రదానం చేయనున్నారు. సాధారణంగా ఈ వార్షిక సదస్సులను 2013 వరకు ఏటా ఢిల్లీలోనే నిర్వహించేవారు. 2014లో తొలిసారిగా ఢిల్లీకి వెలుపల అస్సాంలోని గువాహటిలో నిర్వహించారు. గతేడాది గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో జరగగా.. ఈ ఏడాది హైదరాబాద్ ఇందుకు వేదిక అయింది. ప్రధాని షెడ్యూల్ ఇదే.. నవంబర్ 25 (శుక్రవారం) సాయంత్రం 4.10: వైమానిక దళ ప్రత్యేక విమానంలో చండీగఢ్ నుంచి బయలుదేరుతారు. 6.35: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 7.00: రోడ్డు మార్గంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. 7 నుంచి 8 గంటల వరకు: విశ్రాంతి 8 నుంచి 9 గంటల వరకు: ఐపీఎస్‌లతో కలిసి విందు భోజనం చేస్తారు. అనంతరం విశ్రాంతి తీసుకుంటారు. నవంబర్ 26 (శనివారం) ఉదయం 6 నుంచి 7 గంటల వరకు: అకాడమీ స్టేడియంలో జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డీజీపీ/ఐజీపీల సమావేశంలో పాల్గొంటారు. 5.05: అకాడమీ నుంచి రోడ్డు మార్గాన శంషాబాద్‌కు బయలుదేరుతారు. 5.30: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. 7.40: ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. -
రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ
-
రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ
శుక్రవారం రాత్రి జాతీయ పోలీసు అకాడమీలో బస సాక్షి, హైదరాబాద్: దేశ అంతర్గత భద్రత అంశంపై సర్దార్ వల్లాభ్భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న రాష్ట్రాల డీజీపీ, ఐజీపీల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25 (శుక్రవారం)న హైదరాబాద్ రానున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంశాఖ సహాయ మంత్రులు కిరణ్‌రిజిజు, హన్సరాజ్ అహిర్ గంగారాం, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ధోవల్, రా, ఐబీ సంస్థల చీఫ్‌ల బృందంతో కలసి శుక్రవారం సాయంత్రం 6.35 గంట లకు ప్రత్యేక విమానంలో రాజీవ్‌గాంధీ అంత ర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని చేరు కోనున్నారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికా రులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు. ప్రధాని మోదీ బృందం నేరుగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషల్ పోలీసు అకాడమీకి చేరుకుని అక్కడి రాజస్థాన్ భవన్లో రాత్రి బస చేయ నుంది. అకాడమీలో శనివారం ఉదయం ప్రారంభం కానున్న రాష్ట్రాల డీజీపీ, ఐజీపీల సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేయనున్నారు. శనివారం సాయంత్రం 5.35 గంటలకు ప్రధాని మోదీ, అజిత్ ధోవల్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కాను న్నారు. శంషా బాద్ విమానాశ్రయం నుంచి జాతీయ పోలీసు అకాడమీకి, అక్కడి నుంచి మళ్లీ శంషాబాద్ విమానాశ్రయానికి మాత్రమే ప్రధాని పర్యటన పరిమితం కానుంది. రాజ్‌నాథ్, రిజుజు, హన్స రాజ్ మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఉగ్రవాదం నుంచి సైబర్ నేరాల వరకు ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరగ నుందని ఎన్పీఏ వర్గాలు తెలిపాయి. పటిష్ట ఏర్పాట్లు చేయండి.. ప్రధాని మోదీ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సీఎస్ రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ప్రధాని పర్యటన సందర్భంగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని హెచ్ఎం డీఏ, జీహెచ్ఎంసీని ఆదేశించారు. రోడ్ల మరమ్మ తులు, పరిశుభ్రత, నిరంతర విద్యుత్ సరఫ రాకు చర్యలు తీసుకోవాలన్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ ను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, ముఖ్యకార్యదర్శులు ఆధర్‌సిన్హా, సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్య, ఇంటలిజెన్స ఐజీ నవీన్ చంద్ తదితరులు పాల్గొన్నారు. కమాండోల రక్షణలో.. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో పోలీ సులను భారీగా మొహరించారు. ఇప్పటికే కేంద్ర బలగాలు నేషనల్ పోలీస్ అకాడమీ ని ఆధీనంలోకి తీసుకుని అణువణువు పరి శీలించాయి. కమాండోలు అకాడమీ లోని ప్రతి భవనంతో పాటు చుట్టూ ఎత్తైన భవనాలను పరిశీలించారు. కమాండోల పరిశీలన నేపథ్యంలో ఎవరిని లోనికి అను మతించలేదు. వివిధ ప్రాంతాల నుంచి పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందికి బుధవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయవర్సిటీలో ఆడిటో రియంలో బస కల్పించారు. వివిధ ప్రాంతాలను నుంచి వచ్చిన పోలీసులను పోలీసు అకాడమీ చూట్టు మొహరి స్తున్నారు. అడుగడుగునా ఒక పోలీసును ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళిక మ్యాప్‌పై బుధవారం డీజీపీ, సైబరాబాద్ కమిషనర్‌తో పాటు ఇతర ఉన్నతా ధికారులు చర్చించారు. మరోవైపు పోలీసు బృందాలు బుధవారం ఎయిర్‌పోర్టు నుంచి ఎన్పీఏ వరకు ఇరువైపుల రహ దారులను పరిశీలించాయి. -
68వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్
-
68వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 68వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. ఐపీఎస్ అధికారులు దిక్షాంత్ పరేడ్ నిర్వహించారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 109 మంది ట్రైనీ ఐపీఎస్‌లు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ బ్యాచ్‌లో మరో 15 మంది విదేశీ అధికారులు సైతం శిక్షణ పొందారు. అందులో భూటాన్ నుంచి ఆరుగురు, నేపాల్ నుంచి ఐదుగురు, మాల్దీవుల నుంచి నలుగురు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 109 మంది ఐపీఎస్ శిక్షణార్థుల్లో 75 మంది ఇంజనీరింగ్, వైద్య విద్యను చదివిన వారే ఉన్నారు. పది మంది ఆర్ట్స్, తొమ్మిది మంది సైన్స్, ఇద్దరు కామర్స్ నేపథ్యం నుంచి రాగా, 66 మంది ఇంజనీర్లు, తొమ్మిది మంది ఎంబీబీఎస్, తొమ్మిది మంది ఎంబీఏ, ముగ్గురు లా, ఒకరు ఎంఫిల్ చేశారు. కాగా నేషనల్ పోలీస్ అకాడమీలో 2015 బ్యాచ్ అధికారులుగా శిక్షణ ముగించుకున్న 109 మంది ట్రైనీ ఐపీఎస్‌ల్లో ఏడుగురిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. వారిలో తెలంగాణకు రక్షిత కె.మూర్తి(కర్ణాటక), పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపత్రావు(మహారాష్ట్ర), చేతన మైలబత్తుల(తెలంగాణ).. ఏపీకి కె.ఆరీఫ్ హఫీజ్(కర్ణాటక), అజిత వేజెండ్ల (ఏపీ), గౌతమి సలి(ఏపీ), బరుణ్ పురకయత్స(అసోం) ట్రైనీ ఐపీఎస్‌లుగా రానున్నారు. -
తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు కొత్త ఐపీఎస్‌లు
హైదరాబాద్: నగరంలోని జాతీయ పోలీస్ అకాడమిలో శిక్షణ పొందుతున్న 124 మంది ఐపీఎస్‌ల శిక్షణా కాలం ముగిసింది. ఈ నెల 28 వ తేదిన జరిగే దీక్షాంత్ పరేడ్(పాసింగ్ అవుట్)కు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రానున్నట్లు అకాడమి డెరైక్టర్ అరుణ బహుగుణ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. శిక్షణ పూర్తైన ఐపీఎస్ లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఏడుగురిని కేటాయించారు. ఏపీకి కేటాయించిన నలుగురిలో ఇద్దరు ఏపీ వారే కాగా, తెలంగాణకు కేటాయించిన ముగ్గురిలో ఒకరు తెలంగాణ చెందినవారు. ఏపీకి కేటాయించిన వారు 1, అజిత వెజెండ్ల(ఏపీ) 2, గౌతమి సాలి(ఏపీ) 3, ఆరిఫ్ హఫీజ్(కర్ణాటక) 4. బరుణ్ పురకాయస్త(అస్సాం) తెలంగాణకు కేటాయించిన వారు 1, చేతన మైలమత్తుల(తెలంగాణ) 2, రక్షిత కె. మూర్తి(కర్ణాటక) 3, పాటిల్ సంగ్రామం సింగ్ గణపతి రావు(మహారాష్ట్ర) -
అభివృద్ధితోనే పేదరిక నిర్మూలన
నీతి ఆయోగ్ చైర్మన్ పనగారియా సాక్షి, హైదరాబాద్: అభివృద్ధితోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. సరళీకరణ విధానాలతో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. జాతీయ పోలీస్ అకాడమీలో సోమవారం వల్లభాయ్‌పటేల్ సంస్మరణ ఉపన్యాసం చేశారు. కొన్నేళ్లుగా దేశం ఆర్థికాభివృద్ధి సాధించడంతో పేదరికం కొంతమేర తగ్గుముఖం పట్టిందన్నారు. పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 109 మంది ఐపీఎస్, 15 మంది విదేశీయులను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో దేశం ఆర్థికంగా పురోగమిస్తోందన్నారు. గ్లోబల్ మార్కెట్‌పై పట్టు సాధిస్తేనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణతో కలసి సర్దార్ పటేల్ చిత్ర పటానికి పనగారియా నివాళులర్పించారు. -
పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 67వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 141 మంది ట్రైనీ ఐపీఎస్‌లు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. వారిలో 26 మంది మహిళ ఐపీఎస్‌లు ఉన్నారు. అలాగే నేపాల్, భూటాన్, మాల్దీవుల దేశాలకు చెందిన 15 మంది పోలీసు అధికారులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. -
సొంత రాష్ట్రానికే రావడం నా అదృష్టం
‘సాక్షి’తో ట్రైనీ ఐపీఎస్ అపూర్వరావు తెలంగాణలో సొంత రాష్ట్ర కేడర్‌కు ఎంపికైన మహిళ సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారిణిగా సొంత రాష్ట్రానికే సేవలందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా అని ట్రైనీ ఐపీఎస్ కె.అపూర్వరావు చెప్పారు. ఈనెల 31న పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం రాష్ట్రానికి సేవలందించేందుకు సిద్ధమవుతున్న యువ మహిళా ఐపీఎస్ గురువారం జాతీయ పోలీసు అకాడమీలో ‘సాక్షి’తో మాట్లాడారు. సివిల్ సర్వీస్ 2013 బ్యాచ్‌కు చెందిన 141 మందితో కలిపి ఆమె శిక్షణ పొందారు. ఆమెతో పాటు రాహుల్ హెగ్డే, బి.కె.సునీల్ దత్‌ను తెలంగాణకుకేటాయించారు. హైదరారాబాద్ బేగంబజార్‌కు చెందిన అపూర్వరావు సివిల్ సర్వీసులో 500పై చిలుకు ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సొంత రాష్ట్ర కేడర్‌కు ఎంపికైన తొలి మహిళ అపూర్వరావు. అన్ని రంగాల్లో మహిళలు ‘పోలీసు శాఖలో మహిళలు ఎక్కువగా చేరడానికి అంతగా ఆసక్తి చూపరనేది గతం. ప్రస్తుతం రోజులు మారాయి. మహిళలు కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మా బ్యాచ్‌లో 26 మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య గతంతో పోల్చితే ఎక్కువే. ఇక నా విషయానికొస్తే ఐపీఎస్ అవుతానంటే కుటుంబసభ్యులెవరూ అభ్యంతరం చెప్పలేదు. పైగా అమ్మానాన్నలు మరింత ప్రోత్సాహం ఇచ్చారు. వారి సహకారం వల్లే తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించగలిగా’ అని అపూర్వరావు ఆనందంగా చెప్పారు. ‘ఐపీఎస్‌కు ఎంపికైన తర్వాత ట్రైనింగ్‌కు సంబంధించి మొదట్లో కాస్త కంగారుపడ్డాను. కానీ నేను ఎంతో అభిమానించిన వృత్తి కావడంతో శిక్షణలో ప్రతి రోజూ నూతనోత్సాహంతో నేర్చుకున్నా. ఇది సవాళ్లను ఎదుర్కోగల ధైర్యాన్నివ్వడంతో పాటు పోలీసింగ్‌పై ఎన్నో మెళకువలను నేర్పింది. ఇప్పటి దాకా కేవలం వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకున్న నేరాలను మాత్రమే చూశాం. కానీ ప్రస్తుతం సైబర్ నేరాలు సమాజంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. వెబ్సైట్లు ఎలా హాక్ అవుతున్నాయో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ అకృత్యాలను నివారించేందుకు ఓ కామన్ సాఫ్ట్వేర్ ఉండాలన్నది నా అభిప్రాయం. ఆర్బీఐ గవర్నర్ రఘురాంరాజన్ వంటి నిపుణులు ఇచ్చిన ప్రత్యేక ప్రసంగాలు మాలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపాయి. వారిచ్చిన స్ఫూర్తితో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తా’ అని ఆమె వివరించారు. -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌కు పోలీసుశాఖ బహుమతి
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీసుల సామాజిక సేవలపై రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫోటోలు, షార్ట్ఫిల్మ్లలో ఉత్తమమైన వాటికి పోలీసుశాఖ బహుమతులను ప్రకటించింది. ఇందులో ‘సాక్షి’ నల్లగొండ జిల్లా ఫొటోగ్రాఫర్ బజరంగ్ ప్రసాద్‌కు మూడో బహుమతి (రూ.25వేలు), కన్సోలేషన్ బహుమతులను ప్రకటించారు. ఈ పోటీకి రాష్ట్రవ్యాప్తంగా 563 ఫోటోలు, 103 షార్ట్‌ఫిల్మ్‌లు వచ్చాయి. జాతీయ పోలీస్ అకాడమీ జాయింట్ డెరైక్టర్ ఉమేష్ ష్రాఫ్ అధ్యక్షతన 8 మంది సభ్యుల కమిటీ ఉత్తమ ఫొటోల్ని ఎంపిక చేసింది. ఇందులో మొదటి బహుమతి (రూ.లక్ష నగదు)ని వరంగల్ జిల్లాకు చెందిన వెంకన్న (నమస్తే తెలంగాణ)కు, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి చెందిన ఎస్.రవికుమార్‌కు రెండో బహుమతి (రూ.50 వేలు), మరో నలుగురికి కన్సోలేషన్ బహుమతులు ప్రకటించారు. వీరికి ఈ నెల 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా బహుమతులను అందజేస్తారు. షార్ట్‌ఫిల్మ్ ఎంట్రీలను హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల కమిటీ పరిశీలిస్తోంది. వీటి ఎంపిక పూర్తికానందున పేర్లు వెల్లడి కాలేదు. -
చట్టంతో నేరాలకు చెక్‌పెట్టండి
♦ మహిళా పోలీసులకు ఎస్వీపీఎన్పీఏ డెరైక్టర్ అరుణ బహుగుణ పిలుపు ♦ ‘చట్టం అమలులో మహిళల పాత్ర’ సదస్సులో ఉపన్యాసం సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాదంతో పాటు వివిధ నేరాలను చట్టం అనే ఆయుధంతో అణచివేసేందుకు మహిళా పోలీసులు ముందడుగు వేయాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీ(ఎస్వీపీఎన్పీఏ) డెరైక్టర్ అరుణ బహుగుణ పిలుపునిచ్చారు. స్థానిక నేషనల్ పోలీసు అకాడమీలో దేశంలో తొలిసారిగా ఎస్వీపీఎన్పీఏ, ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘చట్టం అమలులో మహిళల పాత్ర’ అనే అంతర్జాతీయ సదస్సును మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ సదస్సులో బహుగుణ మాట్లాడుతూ తొలితరం మహిళామణుల జీవితాలు స్ఫూర్తిగా తీసుకొని విధి నిర్వహణలో అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ‘సాంకేతిక అభివృద్ధితో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. నేరం, ఉగ్రవాదం ఖండ ఖండాతరాల్లో వేగంగా వ్యాపిస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న నేరం-ఉగ్రవాద రూపంలో ఉన్నా, సాంకేతిక రూపంలో ఉన్నా చట్టం అనే ఆయుధంతో అణచివేసేందుకు మహిళ పోలీసులు ముందడుగు వేయాల’ని ఆమె అన్నారు. సీఎస్‌యూ ప్రొఫెసర్ ట్రెసీ గ్రీన్ మాట్లాడుతూ వ్యవస్థీకృత నేరాలు, సరిహద్దు భద్రత, ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు మళ్లించడం లాంటి అంశాలను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ, ప్రాంతీయ నుంచి దేశీయస్థాయి దాకా పోలీసింగ్ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేసుకోవడానికి ఈ సదస్సు ఓ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని అన్నారు. ఇదో మైలురాయి... ‘భారత్, ఆస్ట్రేలియా మధ్య విధానపరమైన అంశాల్లో ఇప్పటికే సఖ్యత ఉంది. పన్ను ఎగవేత, తీవ్రవాదం ఎదుర్కొనడం లాంటి అంశాలపై కలసి పనిచేస్తున్నాం. అయితే ఉమెన్ పోలీసింగ్, లింగ సమానత్వం వంటి సమస్యలపై కలిసి పనిచేసేందుకు ఈ సదస్సు మైలురాయిగా నిలవడం ఆనందంగా ఉంద’ని ఆస్ట్రేలియా హైకమిషన్ డిప్యూటీ ైెహ కమిషనర్ క్రిస్ ఎల్స్టొఫ్ట్ అన్నారు. అనంతరం క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన సస్కియా హుఫ్నగేల్.. ఓల్డ్ బాయ్స్ నెట్‌వర్క్‌పై ప్రజంటేషన్ ఇచ్చింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈస్టోనియా, బెల్జియమ్ వంటి దేశాల్లో మినహా మిగతా అన్ని దేశాల్లో పోలీసు ఫోర్స్‌లో మహిళల పట్ల వివక్ష ఉంది. పోలీసు ఫోర్స్‌ల్లో మహిళల సంఖ్య పెంచితే సరిపోదు. ఉన్నత స్థానాలకు చేరే విధంగా వారిలో నమ్మకం కల్పించాలి. ఇంటర్‌పోల్‌లో 44 శాతం, ఇంటర్నేషనల్ పోలీసు ఆఫీసులో 44 శాతం మంది మహిళలు ఉన్నారు. అయితే వీరంతా తక్కువ స్థాయిల్లోనే పనిచేస్తున్నా’రని గణాంకాలతో సహా వివరించారు. ఆస్ట్రేలియాలోని వోలంలాంగ్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కతినా మిషెల్ ‘నేషనల్ సెక్యూరిటీ టెక్నాలజీ’ వల్ల కలిగే నష్టాలను ప్రజంటేషన్ రూపంలో ఇచ్చారు. ఈ సదస్సులో 120 మంది మహిళా పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
నేపాల్‌కు జాతీయ పోలీసు అకాడమీ విరాళం
హైదరాబాద్: భూకంప పీడిత నేపాల్‌కు హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీ(ఎన్పీఏ) రూ.3,57,960 విరాళాన్ని ప్రకటించింది.అకాడమీలోని 42 మంది అధ్యాపకులు, గెజిటెడ్ అధికారులు, 151 మంది ట్రైనీ ఐపీఎస్‌లు, 472 మంది ఎన్జీవోలు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రధాన మంత్రి జాతీయ విపత్తు నివారణ నిధి కార్యదర్శికి ఎన్పీఏ అధికారులు అందజేశారు. -
ట్రైనీ ఐపీఎస్ అధికారులు డిశ్చార్జి
హైదరాబాద్: నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్ పీఏ)లో స్వైన్‌ఫ్లూ సోకి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారులను వైద్యులు డిశ్చార్జి చేసినట్లు నేషనల్ పోలీస్ అకాడమీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు పేర్కొన్నారు. కొత్తగా ఎలాంటి కేసులు లేవని వైద్యులు తెలిపారు. -
రాష్ట్రంలో 21 దేశాల పోలీసు అధికారులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర పోలీసు విభాగాలపై అధ్యయనంలో భాగంగా 21 దేశాల పోలీసు అధికారుల బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. 12 వారాల శిక్షణలో పాల్గొనేందుకు ఈ అధికారుల బృందం ఇటీవల ఢిల్లీలోని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరోకు చేరింది. శిక్షణలో భాగంగా ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు విభాగాలు, సంస్థలను సందర్శించి పనితీరును పరిశీలించింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీతోపాటు డీజీపీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారులతో సమావేశమైంది. స్టేట్ క్రైం రికార్డ్స్ బ్యూరో, ఫింగర్ ప్రింట్ బ్యూరో, గ్రేహౌండ్స్ తదితరాల పనితీరును డీజీపీ ఈ బృందానికి తెలియజేశారు. ఐటీ ఆధారిత పోలీసు పౌర సేవలైన ఈ-కాప్స్, పోలీసు ఫేస్ బుక్, జీపీఎస్, క్రైం మ్యాపింగ్, మహిళల భద్రత కోసం హాక్-ఐ తదితర కార్యక్రమాలపై ఈ బృందానికి అవగాహన కల్పించారు. ఈ బృందంలో బోత్స్వాన, ఇథోపియా, ఫిజి, ఘనా, ఇండోనేషియా, గినియా బిస్సావు, కెన్యా, మారిషస్, మయన్మార్, నేపాల్, ఫిలిప్పీన్స్, ట్రినిడాడ్, టుబాగో, ఉగాండా, వియత్నాం, జాంబియా, ఈఐ-సాల్వెడర్, బోస్నియా-హెర్జోగోవినా తదితర దేశాలకు చెందిన 47 మంది యువ పోలీసు అధికారులున్నారు. -
పోలీసు అకాడమీలో పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారం కిందట 9 మంది ట్రైనీ ఐపీఎస్‌లకు ఈ వైరస్ సోకగా గత నాలుగైదు రోజుల్లో మరో 12 మంది ట్రైనీ ఐపీఎస్‌లు ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో అకాడమీలో మొత్తం కేసుల సంఖ్య 21కి పెరిగింది. వైరస్ బారినపడిన వారిలో ఐదుగురు ట్రైనీ ఐపీఎస్‌లు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మిగిలిన 16 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయి తిరిగి అకాడమీలో చేరారు. ఈ మేరకు అకాడమీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
ట్రైనీ ఐపీఎస్‌లకు స్వైన్‌ఫ్లూ: కేంద్రం సీరియస్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ(ఎన్పీఏ)లో స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, ఆరోగ్యకర వాతావరణంలో నిర్వహిస్తున్న పోలీసు అకాడమీలోని ఐపీఎస్ ట్రైనీలకు స్వైన్‌ఫ్లూ సోకడంపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది. సకల సదుపాయాలతో అకాడమీ నిర్వహిస్తున్నప్పటికీ ట్రైనీ ఐపీఎస్‌లు అకాడమీ నుంచి బయటి ప్రాంతాలకు రాకపోకలు సాగించడంపై హోం శాఖ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిి సంది. అకాడమీలో స్వైన్‌ఫ్లూ ప్రబలిన విషయం తెలుసుకున్న ఐపీఎస్ శిక్షణార్థుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో 9 మంది శిక్షణార్థులు స్వైన్‌ఫ్లూ బారినపడడానికి దారి తీసిన కారణాలపై విచారణ జరపాలని నిర్ణయించింది. అకాడమీలోని పరిస్థితులను పరిశీలించడానికి ఢిల్లీ నుంచి ఓ బృందం త్వరలో అకాడమీకి రానున్నట్లు తెలిసింది. బయటి నుంచే వైరస్ అటాక్: సువిశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న పోలీసు అకాడమీలో ఆరోగ్యకర వాతావరణం ఉందని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు తేల్చారు. బయటి ప్రాంతం నుంచే హెచ్1ఎన్1 వైరస్ అకాడమీలోకి వ్యాపించిందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. తిరుపతి ఉప ఎన్నికల పరిశీలన కోసం అక్కడికి వెళ్లి తిరిగి వచ్చాకే ట్రైనీ ఐపీఎస్‌లు అస్వస్థతకు గురయ్యారని అకాడమీ అధికారులు తెలిపారు. వైరస్ సోకిన 9 మంది అకాడమీ వసతి భవనంలోని ఒకే బ్లాక్‌లో బస చేసేవారు. ప్రస్తుతం ఆ బ్లాక్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కాగా, వీరిలో ఆరు మంది కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యాధికారులు తెలిపారు. -
'నా కుమారుడిని హత్య చేశారు'
సిమ్లా: తన కొడుకును హత్య చేశారని ట్రైనీ ఐపీఎస్ మనోముత్తు మానవ్ తండ్రి రామ్ నివాస్ మానవ్ ఆరోపించారు. తన కుమారుడి హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంచి ఈతగాడైన తన కొడుకు స్విమ్మింగ్ లో పడి మృతి చెందారనడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పంజాబ్ యూనివర్సిటీలో చదవి రోజుల్లో మనోముత్తు స్విమ్మింగ్ క్లబ్ సభ్యుడని తెలిపారు. అలాంటి వాడు స్విమ్మింగ్ ఫూల్ లో పడి ఎలా చనిపోతాడని ఆయన ప్రశ్నించారు. మద్యం మత్తులో నీటిలో మునిగిపోయి చనిపోయాడన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అతడికి ఎటువంటి చెడు అలవాట్లు లేవని వెల్లడించారు. హిమచల్ ప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల మనోముత్తు మానవ్- జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతూ ఈనెల 29న అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. -
ట్రైనీ ఐపీఎస్ మృతిపై అనుమానాలు
శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారి పోలీసు అకాడమీలో మరణించడం సంచలనం కలిగిస్తోంది. అకాడమీలోని స్విమ్మింగ్ పూల్‌లో అర్ధరాత్రి పడి చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది ప్రమాదమేనా.. మరేమైనా జరిగిందా.. అసలు పోలీసు అకాడమీలో ఏం జరిగిందనే విషయాలన్నీ సస్పెన్స్‌గానే ఉన్నాయి. హిమచల్ ప్రదేశ్‌కు చెందిన మనోముత్తు మానవ్ 2013లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అదే సంవత్సరం శిక్షణ కోసం హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో చేరారు. అకాడమీలోని స్విమింగ్‌పుల్‌లో పడి గాయపడడంతో సహచరులు బంజారాహిల్స్‌లోని కేర్ అసుప్రతికి తీసుకొస్తుండగా మర్గమధ్యలోనే మృతి చెందారు. మృతదేహన్ని కేర్ లోని మార్చురీలో భద్రపరిచి హిమాచల్ ప్రదేశ్‌లోని అతని కుటుంబానికి సమాచారం అందించారు. వాళ్లు ఆస్పత్రికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. అయితే, ఐపీఏస్ అధికారి మృతిపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు అకాడమీలో ఏం జరిగింది ? నిజంగానే స్విమ్మింగ్ పూల్‌లో ప్రమదవశాత్తు పడి మృతి చెందాడా ? లేక ఆత్మహత్య చేసుకున్నాడా ఇంకేమైనా జరిగిందా? మరో రెండు నెలల్లో దేశానికి సేవలు అందించాల్సిన ఐపీఎస్ మృతి చెందడంపై పలువురు ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లలో కొంతమంది ఈసారి ఐఏఎస్‌కు ఎంపిక కావడంతో వారంతా అకాడమీలోవిందు ఇచ్చారు. ఈ విందులో మద్యం సేవించడం అనేది వివాదస్పదమవుతోంది. -
ఐపీఎస్ మృతి పై పలు అనుమానాలు
-
నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం
హైదరాబాద్: శివరాంపల్లిలోని నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ శిక్షణ పొందుతున్న మనోముక్తి మావన్ అనే ఐపీఎస్ అధికారి మృతి చెందారు. ఈత కొలనులో గాయపడడంతో అతడిని జూబ్లీహిల్స్ లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. మనోముక్తి మావన్ హిమచల్ ప్రదేశ్ క్యాడర్ చెందిన అధికారి. ఆయన మృతి పట్ల ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా అరుణా బహుగుణ!
సాక్షి, హైదరాబాద్: జాతీయ పోలీసు అకాడమీకి మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఐపీఎస్ అధికారి బాస్ కానున్నారు. మన రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణాబహుగుణ(56)కు ఆ అరుదైన గౌరవం దక్కనుంది. ఐపీఎస్ 1979 బ్యాచ్‌కు చెందిన అరుణా బహుగుణను సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ(ఎన్పీఏ) డెరైక్టర్‌గా కేంద్రప్రభుత్వం నియమించనున్నట్లు సమాచా రం. 65 ఏళ్ల ఎన్పీఏ చరిత్రలో ఒక మహిళా అధికారి డెరైక్టర్‌గా నియమితులవడం ఇదే మొదటిసారి కానుంది. అకాడమీ డెరైక్టర్‌గా పనిచేసిన శుభాస్ గోస్వామి గత నెలలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి బదిలీ అయిన తరువాత ఇంతవరకూ ఎవర్నీ ఆ స్థానంలో నియమించలేదు. అరుణా బహుగుణను 28వ డెరైక్టర్‌గా నియమిస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం. హైదరాబాద్ కేంద్ర స్థానంగా నిర్వహిస్తున్న ఎన్పీఏలో దేశంలోని ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇస్తారు. కాగా ఐపీఎస్ 1979 బ్యాచ్‌కు చెందిన అరుణా బహుగుణ గతేడాది డెరైక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందారు. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న సమయంలో సీఆర్పీఎఫ్ స్పెషల్ డెరైక్టర్‌గా కీలక బాధ్యతలకోసం కేంద్ర సర్వీసులకు వెళ్లారు. అంతకుముందు ఆమె రాష్ట్ర పోలీసుశాఖలో వివిధ హోదాల్లో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. అగ్నిమాపక, అత్యవసర సర్వీసుశాఖ డెరైక్టర్ జనరల్‌గా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) డెరైక్టర్ జనరల్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. హైదరాబాద్ నగర పోలీసు అదనపు కమిషనర్‌గా, విజయవాడ ఎస్పీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. -
నేషనల్ పోలీస్ అకాడమీకి తొలి మహిళా బాస్!
న్యూఢిల్లీ: నేషనల్ పోలీస్ అకాడమీ తొలి మహిళా డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అరుణ బహుగుణ(56) ఎంపికైయ్యారు. హైదరాబాద్ లో పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చే ఈ అకాడమీ లో మహిళా డైరెక్టర్ ను నియమించడం ఇదే తొలిసారి. 65 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన అకాడమీకి బాస్ గా బహుగుణ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.1979 బ్యాచ్ కు చెందిన ఆమె ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలకు డీజీగా పని చేస్తున్నారు. 3 లక్షల సీఆర్పీఎప్ జవాన్లకు సేవలు అందిస్తున్నఆమె నేషనల్ పోలీస్ అకాడమీ బాస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఆమె త్వరలోనే నియామక పత్రాలు అందుకోనుంది. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది.. ప్రస్తుతం నేషనల్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న సుభాష్ గోస్వామి ఇండో-టిబెటన్ డీజీగా స్థానం చలనం కలగడంతో ఆ స్థానంలో బహుగుణే నియమించారు. -
5న హైదరాబాద్‌కు రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జాతీయు పోలీస్ అకాడమీలో ఈనెల 5న జరగనున్న ఐపీఎస్‌ల పరేడ్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రానున్నారు. రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో ఉంచుకుని రాజేంద్రనగర్ పోలీసులు, వివిధ శాఖల అధికారులు గురువారం జాతీయు పోలీస్ అకాడమీ అధికారులతో సవూవేశమయ్యారు. ఆ తర్వాత అకాడమీ మైదానాన్ని పరిశీలించారు.