తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు కొత్త ఐపీఎస్‌లు
Published Wed, Oct 26 2016 4:55 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
హైదరాబాద్: నగరంలోని జాతీయ పోలీస్ అకాడమిలో శిక్షణ పొందుతున్న 124 మంది ఐపీఎస్‌ల శిక్షణా కాలం ముగిసింది. ఈ నెల 28 వ తేదిన జరిగే దీక్షాంత్ పరేడ్(పాసింగ్ అవుట్)కు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రానున్నట్లు అకాడమి డెరైక్టర్ అరుణ బహుగుణ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. శిక్షణ పూర్తైన ఐపీఎస్ లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఏడుగురిని కేటాయించారు. ఏపీకి కేటాయించిన నలుగురిలో ఇద్దరు ఏపీ వారే కాగా, తెలంగాణకు కేటాయించిన ముగ్గురిలో ఒకరు తెలంగాణ చెందినవారు.
ఏపీకి కేటాయించిన వారు
1, అజిత వెజెండ్ల(ఏపీ)
2, గౌతమి సాలి(ఏపీ)
3, ఆరిఫ్ హఫీజ్(కర్ణాటక)
4. బరుణ్ పురకాయస్త(అస్సాం)
తెలంగాణకు కేటాయించిన వారు
1, చేతన మైలమత్తుల(తెలంగాణ)
2, రక్షిత కె. మూర్తి(కర్ణాటక)
3, పాటిల్ సంగ్రామం సింగ్ గణపతి రావు(మహారాష్ట్ర)
Advertisement