
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్ర నగర్ మండలంలోని హైదరాబాద్ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఐపీఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అకాడమీ నుంచి కంప్యూటర్లు మాయం అయ్యాయి. సిబ్బంది కళ్లు గప్పిన కేటుగాడు.. సుమారు ఏడు కంప్యూటర్లు మాయం చేసినట్టు తెలుస్తోంది. అయితే..
ఇది ఎట్టకేలకు అది ఇంటి దొంగ పనే అని తేల్చారు అధికారులు. కంప్యూటర్లు మాయం అయిన విషయాన్ని గమనించిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. దొంగను ఐటీ సెక్షన్ లో పని చేస్తున్న చంద్రశేఖర్ గా గుర్తించారు.
ఈ మేరకు ఎన్‌పీఏ అధికారులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీస్ అకాడమీలో చోరీ జరగడం, అది బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment