computers theft
-
రంగారెడ్డి: నేషనల్ పోలీస్ అకాడమీలో కంప్యూటర్లు చోరీ
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్ర నగర్ మండలంలోని హైదరాబాద్ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఐపీఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అకాడమీ నుంచి కంప్యూటర్లు మాయం అయ్యాయి. సిబ్బంది కళ్లు గప్పిన కేటుగాడు.. సుమారు ఏడు కంప్యూటర్లు మాయం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఇది ఎట్టకేలకు అది ఇంటి దొంగ పనే అని తేల్చారు అధికారులు. కంప్యూటర్లు మాయం అయిన విషయాన్ని గమనించిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. దొంగను ఐటీ సెక్షన్ లో పని చేస్తున్న చంద్రశేఖర్ గా గుర్తించారు. ఈ మేరకు ఎన్పీఏ అధికారులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీస్ అకాడమీలో చోరీ జరగడం, అది బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎగ్జిబిషన్ కాదిది...చోరీ సొత్తు!
కాకినాడ : పక్కన ఫోటోలో చూస్తున్న కంప్యూటర్లు మానిటర్లు, సీపీయూలు, మౌస్‌లు .... ఎగ్జిబిషన్ కోసం పెట్టారనుకుంటే మీరు 'మౌస్' మీద కాలేసినట్లే. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఊరికి దూరంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్ఓ దొంగలు కాజేసిన కంప్యూటర్లు ఇవన్నీ. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన నరెళ్ల శ్రీనివాసరావు, రాజు, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటకు చెందిన గ్రంథి గంగాధర్ వీటిని దొంగలించి, ఇంటర్నెట్, కంప్యూటర్ సెంటర్లలో విక్రయిస్తున్నారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి నిన్న మీడియా ముందు హాజరు పరిచారు. నిందితులు మొత్తల 32 చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. 48 సీపీయూలు, 87 మానిటర్లు, 58 మౌస్‌లు, 51 కీబోర్డులు, బైకు, ల్యాప్‌టాప్, వెండి కిరీటం, కవచం, కత్తి, వెండి పిడికిలి, అమ్మవారి ముక్కుపుడక, బొట్టును వీరు కాజేసిన జాబితాలో ఉన్నాయి.