ఎగ్జిబిషన్ కాదిది...చోరీ సొత్తు!
కాకినాడ : పక్కన ఫోటోలో చూస్తున్న కంప్యూటర్లు మానిటర్లు, సీపీయూలు, మౌస్లు .... ఎగ్జిబిషన్ కోసం పెట్టారనుకుంటే మీరు 'మౌస్' మీద కాలేసినట్లే. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఊరికి దూరంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్ఓ దొంగలు కాజేసిన కంప్యూటర్లు ఇవన్నీ. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన నరెళ్ల శ్రీనివాసరావు, రాజు, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటకు చెందిన గ్రంథి గంగాధర్ వీటిని దొంగలించి, ఇంటర్నెట్, కంప్యూటర్ సెంటర్లలో విక్రయిస్తున్నారు.
పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి నిన్న మీడియా ముందు హాజరు పరిచారు. నిందితులు మొత్తల 32 చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. 48 సీపీయూలు, 87 మానిటర్లు, 58 మౌస్లు, 51 కీబోర్డులు, బైకు, ల్యాప్టాప్, వెండి కిరీటం, కవచం, కత్తి, వెండి పిడికిలి, అమ్మవారి ముక్కుపుడక, బొట్టును వీరు కాజేసిన జాబితాలో ఉన్నాయి.