ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదును చూసి దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడ్డారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలోని కాకినాడ పబ్లిక్‌స్కూల్‌కు ఎదురుగా ఉన్న పొన్నపల్లి రుక్మిణీరావు ఇంట్లో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. రూ.3.5లక్షల నగదుతో పాటు 20 తులాల బంగారం, రెండున్నర కిలోల వెండి దోచుకెళ్లారు.
మంగళవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వస్తువులన్ని చిందర వందరగా ఉండటంతో రుక్మిణీరావు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడలో భారీ చోరీ
Published Tue, Jan 20 2015 4:03 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement