కడప: ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదును చూసి దొంగలు రెచ్చిపోయారు. అనారొగ్యంతో ఆస్పత్రికి తీసుకెళ్లి వచ్చేవరకు .. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు మాయం చేశారు. ఈ సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిథిలోని శ్రీరామయంపేట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గణచారీ సురేష్ మెడికల్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య అనారోగ్యం పాలవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాడు.
ఎవరు లేరని తెలుసుకున్నదుండగులు మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, కిలోన్నర వెండి దోచుకెళ్లారు. బుధవారం ఇంటికి వచ్చే సరికి వస్తువులన్నీ చిందర వందరగా ఉండటంతో సురేష్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(ప్రొద్దుటూరు)