సాక్షి, దొడ్డబళ్లాపురం(బెంగళూరు): స్కూటర్ డిక్కీలో ఉన్న నగదును దుండగులు క్షణాల్లో చోరీ చేశారు. కోడిగుడ్ల వ్యాపారం చేసే దొడ్డపట్టణానికి చెందిన రమేశ్ బుధవారం కర్ణాటక బ్యాంకులో రూ.4 లక్షలు డ్రా చేసి స్కూటర్ డిక్కీలో పెట్టుకున్నాడు. కోర్టు రోడ్డులోని హీరోహోండా షోరూం ముందు స్కూటర్ నిలిపి టీస్టాల్‌లోకి వెళ్లాడు. అప్పటికే వెంటాడిన దుండగులు క్షణాల్లో నగదుతో బైక్‌పై ఉడాయించారు. రమేశ్‌తోపాటు స్థానికులు దుండగులను పట్టుకోవాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది. సీటీవీ కెమెరా పుటేజీ ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment