banker
-
బ్యాంక్ జాబ్ వదిలి 'యూ ట్యూబ్'.. ఏటా కోట్లు సంపాదిస్తూ..
చేస్తున్న పనిలో సవాళ్లు లేకుంటే.. కొందరు ఉద్యోగాలకు స్వస్తి చెప్పి, నచ్చినపని చేస్తూ.. కొందరికి సాయపడాలనుకుంటారు. ఇలాంటి కోవకు చెందినవారిలో ఒకరు 'నిశ్చా షా' (Nischa Shah). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గతంలో ఎందుకు ఉద్యోగం వదిలేశారు. ఇరులకు ఎలా సాయం చేస్తున్నారనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..'నిశ్చా షా' ఒకప్పుడు లండన్‌లో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ఈ రంగంలో ఈమెకు ఏకంగా తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా, క్రెడిట్ అగ్రికోల్లో అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేస్తూ ఏడాది రెండు కోట్ల రూపాయల కన్నా ఎక్కువ వేతనం తీసుకునేది. చేస్తున్న పనిలో సవాళ్లు కనిపించకపోవడంతో జాబ్ వదిలేయాలనుకుంది. అనుకున్న విధంగా ఉద్యోగం వైదిలేసి యూట్యూబ్ ఛానల్ చెస్ట్ చేసింది.ఇతరులకు సాయం చేస్తూనే ఆర్థికంగా ఎదగాలని భావించిన నిశ్చా షా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా పర్సనల్ ఫైనాన్స్ విషయాలను చెబుతూ కంటెంట్ క్రియేటర్ అవతారమెత్తింది. దీనికోసం 2023లో తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. యూట్యూబ్ ద్వారా ఏకంగా రూ. 8 కోట్ల కంటే ఎక్కువ సంపాదించినట్లు సమాచారం.ప్రారంభంలో అనుకున్న విధంగా చేయడం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు.. వెయ్యిమంది సబ్స్క్రైబర్లను సంపాదించడానికి 11 నెలల సమయం పట్టిందని ఓ ఇంటర్వ్యూలో నిశ్చా షా పేర్కొన్నారు. ఆ సమయంలో పొదుపు చేసుకున్న డబ్బును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. ఒక వీడియో బాగా వైరల్ కావడంతో 50వేలమంది సబ్స్క్రైబర్లను పొందేలా చేసింది. అప్పుడు ఒకేసారి రూ.3 లక్షలు సంపాదించినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: 22ఏళ్ళ క్రితం నిర్మించారు.. ఇప్పటికీ అక్కడ టోల్ ట్యాక్స్ ఎక్కువే! ఇప్పుడు నిశ్చా షా యూట్యూబ్ ఛానల్ 1.16 మిలియన్ సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. దీంతో ఈమె యూట్యూబ్ వీడియోలు చేస్తూ భారీగానే ఆర్జిస్తోంది. అనుకున్నది సాధించడానికి ఉన్న ఉద్యోగం వదిలి సక్సెస్ సాధించింది. అయితే ఇది అందరికి సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి వాటికి పూనుకునే ముందు పదిసార్లు ఆలోచించడం మంచింది. -
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ 'నారాయణన్ వాఘుల్' చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో కన్నుమూశారు. రెండు రోజులకు ముందు ఇంట్లో పడిపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. హుటాహుటిన ఆయన్ను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స పొందుతూ.. శనివారం తుది శ్వాస విడిచారు.నారాయణన్ వాఘుల్ వయసు 88 ఏళ్లు. ఈయన భార్య పద్మా వాఘల్, పిల్లలు మోహన్, సుధ.. మనవళ్లు సంజయ్, కావ్య, అనువ్, సంతోష్ ఉన్నారు. భారతీయ బ్యాంకింగ్‌లో కొత్త శకానికి నాంది పలికిన దిగ్గజం నారాయణన్ వాఘుల్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.నారాయణన్ వాఘుల్ 1936లో దక్షిణ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలో జన్మించారు. అతని కుటుంబం చెన్నైకి (అప్పటి మద్రాసు) వెళ్లింది. అక్కడే లయోలా కాలేజీలో చదువుకున్నాడు. బ్యాంకింగ్ రంగంలో గొప్పగా ఎదిగిన వాఘల్.. ప్రారంభంలో సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ప్రవేశించడానికి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆ పరీక్షను వాఘుల్ కేవలం ప్రాక్టీస్ టెస్ట్ మాదిరిగా ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.తండ్రి ప్రోత్సాహంతో 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎస్బీఐ నుంచి వైదొలిగారు. ఆ తరువాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్లో చేరి దాని డైరెక్టర్ అయ్యారు. 39 సంవత్సరాల వయస్సులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని చేపట్టారు.నారాయణన్ వాఘుల్ 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చెప్పారు. 1981 - 1985 మధ్య కాలంలో ఐసీఐసీఐ లిమిటెడ్‌కి చైర్మన్‌గా నాయకత్వం వహించారు. ఇలా ఆయన దినదినాభివృద్ధి చెందుతూ.. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 2006లో ఎకనామిక్ టైమ్స్ ద్వారా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. వాణిజ్యం, పరిశ్రమలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2009లో పద్మభూషణ్‌తో సత్కరించింది.Today, I grieve for the Bhishma Pitamah of Indian Banking—Mr. N.Vaghul, who passed away this morning.I grieve not just for a Titan of Indian Business, but for one of the most inspiring & generous people I have ever had the good fortune to encounter. He was a member of the… pic.twitter.com/YgIs5BsE4d— anand mahindra (@anandmahindra) May 18, 2024 -
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం అభయ్ ఐమా కన్నుమూశారు. శనివారం సాయంత్రం ఆయన 63 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన చిరకాల మిత్రుడు, జమ్మూకశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబు ఈ విషయం వెల్లడించారు.హసీబ్ ద్రాబు ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఐమా సాయెబా, ఇక లేరు! చిన్ననాటి స్నేహితుడు నన్ను ఒంటరిగా విడిచి వెళ్లిపోయాడు. శ్రీనగర్, ముంబైలో ఐదు దశాబ్దాల అనుబంధం ఒక నిమిషంలో ముగిపోయింది" అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు శాంతాక్రూజ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని ద్రాబు వేరే పోస్ట్‌లో తెలిపారు.బ్యాంకింగ్‌లో అత్యుత్తమ పదవులు నిర్వహించిన ఐమా 2020లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి పదవీ విరమణ చేశారు. 2021లో స్పైస్ మనీ అడ్వైజరీ బోర్డులో చేరారు. 1995లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో చేరడానికి ముందు, ఐమా సిటీ బ్యాంక్‌లో పనిచేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయిన ఐమా, బ్యాంకింగ్ రంగానికి రాక ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ కావడానికి కృషి చేశారు. -
వివాదాలకు కేరాఫ్.. ఫైర్‌బ్రాండ్ మహువా
చిన్న కుక్కపిల్ల కస్టడీకోసం మాజీ సహచరునితో కావచ్చు.. పార్లమెంటులో ఏకంగా ప్రధాని మోదీతో కావచ్చు... మహువా మొయిత్రా అంటేనే పోరాటం. తెలివైన వ్యక్తి. ఆధునికంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఎక్కడ తప్పు జరిగినా ప్రశి్నస్తారు. పార్లమెంటులో బలమైన స్వరం. ఎంపీగా ఎన్నికైన నాటినుంచే మోదీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. ఆ క్రమంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. అంతే వివాదాస్పద రీతిలో నోటుకు ప్రశ్నల కేసులో లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు కూడా. కాంగ్రెస్‌లో మొదలై... దాదాపు 15 ఏళ్ల క్రితం ‘ఆమ్ ఆద్మీ కా సిపాహీ’ ప్రచారానికి నాటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎంపిక చేసిన యువజన కాంగ్రెస్ నాయకురాలిగా తొలిసారిగా మీడియా దృష్టిని ఆకర్షించారు మహువా. 1974 అక్టోబర్ 12 న అస్సాంలోని కచార్ జిల్లా లాబాక్‌లో జన్మించిన ఆమె అమెరికాలోని మసాచుసెట్స్‌లో మౌంట్ హోలియోక్ కాలేజీలో పై చదువులు చదివారు. అమెరికన్ మల్టీ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్‌లో బ్యాంకర్‌గా న్యూయార్క్‌లో, లండన్‌లో పనిచేశారు. 2009లో ఉద్యోగం వదిలి భారత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత కాంగ్రెస్‌లో చేరినా 2010లో తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2016 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. 2019లో కృష్ణానగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అక్కడా అదే వాగ్ధాటి కొనసాగించారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో ప్రధాని మోదీ సంబంధం గురించి పదేపదే సభలో ప్రశ్నలు లేవనెత్తారు. ఈసారీ కృష్ణానగర్ నుంచే పోటీ చేస్తున్నారు... కొత్త రోల్ మోడల్స్ కావాలి.. ఖరీదైన బూట్లు, బ్రాండెడ్ బ్యాగులు కొనడానికి తనకు లంచాలు అవసరం లేదంటూ ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు మొయిత్రా. తనపై ఆరోపణలను భారత రాజకీయాల్లో ఇమిడి ఉన్న స్త్రీ ద్వేషంలో భాగంగా అభివర్ణించారు. ‘‘నేను ప్రగతిశీల కుటుంబంనుంచి వచ్చాను. భారతీయ స్త్రీ ఇలాగే ఉండాలనే మూస పద్ధతిలో పెరగలేదు. తృణమూల్ ఓ మహిళ సారథ్యంలో ఉంది. మమత మహిళలను ప్రోత్సహిస్తారు. అందుకే ఆ పార్టీలో చేరా. పార్లమెంటులో సగం మంది మహిళా ఎంపీలు టీఎంసీ వాళ్లే. ఎందుకంటే బెంగాల్లో స్త్రీలను శక్తిగా భావిస్తాం. మెదడున్న, గా చదువుకున్న, ఆర్థిక అవగాహన, ఆత్మవిశ్వాసమున్న స్త్రీని సగటు భారతీయ పురుషుడు, నాయకుడు ఎదుర్కోలేడు’’ అంటూ కుండబద్దలు కొడతారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళలకు సరికొత్త రోల్ మోడల్స్ అవసరమంటారు. ‘కుక్కపిల్ల కస్టడీ’ తో సీటుకే ఎసరు... పెంపుడు కుక్కపిల్ల కస్టడీ వ్యవహారం పార్లమెంటు నుంచి మొయిత్రా బహిష్కరణకు దారితీసింది. మాజీ సహచరుడు జై అనంత్ దెహద్రాయ్ నుంచి తమ పెంపుడు కుక్కపిల్ల కస్టడీ కోరుతూ కోర్టుకెక్కారు. ప్రతిగా అదానీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మొయిత్రా భారీగా లంచం, బహుమతులు తీసుకుంంటున్నారంటూ సీబీఐకి ఫిర్యాదు చేశారు. వ్యవహారం పార్లమెంటు ఎథిక్స్ కమిటీ విచారణ దాకా వెళ్లింది. పార్లమెంట్ లాగిన్ ఐడీని ఇతరులతో పంచుకున్నందుకు ఆమెను దోషిగా తేల్చి 2023 డిసెంబర్ 8న లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టెక్ ప్రపంచాన్ని శాసించిన బ్యాంకర్! ఇన్నాళ్లకు తెరపైకి..
ఒకప్పుడు చైనా టెక్ ప్రపంచాన్ని శాసించిన ప్రముఖ టెక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ బావో ఫాన్ (Bao Fan) గురించి వినే ఉంటారు. అవినీతి నిరోధక చర్యల నేపథ్యంలో ఏడాది క్రితం అదృశ్యమైన ఆయన తాజాగా తెరపైకి వచ్చారు. తాను స్థాపించిన సంస్థకు అధికారికంగా బావో ఫాన్ రాజీనామా చేసినట్లు కంపెనీ తెలిపింది. ఆరోగ్య కారణాలు, కుటుంబ వ్యవహారాలపై ఎక్కువ సమయం గడపడానికి బావో ఫాన్ ఛైర్మన్, సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు చైనా రినయ్‌సెన్స్ (China Renaissance) హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీకి శుక్రవారం ఒక ఫైలింగ్‌లో వెల్లడించింది. ఆయన రాజీనామాకు సంబంధించి ఇంతకు మించి కంపెనీ షేర్‌హోల్డర్ల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదని పేర్కొంది. కంపెనీలోని ఇతర ఉన్నత స్థానాలతో పాటు ఛైర్మన్, సీఈవో పదవులను సైతం పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు చైనా రినయ్‌సెన్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా బావో ఫాన్ స్థానంలో కంపెనీ సహ-వ్యవస్థాపకుడు జీ యీ జింగ్ను కొత్త ఛైర్మన్‌గా నియమించనున్నట్లు, అలాగే ఆయనకు ప్రస్తుతమున్న యాక్టింగ్ సీఈవో హోదాను సీఈవోగా మార్చనున్నట్లు కంపెనీ ఫైలింగ్ పేర్కొంది. ఇన్నాళ్లూ ఏమైపోయాడో.. బావో ఇప్పుడు ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు.. ఆయనతో ఎవరైనా టచ్‌లో ఉన్నారా అనే విషయాలకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ అందించలేదు. ఆడిటర్లు బావోను చేరుకోలేకపోయినందున, ఏప్రిల్‌లో కంపెనీ వార్షిక ఫలితాల విడుదలను ఆలస్యం చేయవలసి వచ్చిందని వివరించింది. బావో 2023 ఫిబ్రవరిలో అదృశ్యమైనప్పటి నుంచి దేశంలోని అగ్రశ్రేణి యాంటీ గ్రాఫ్ట్ నియంత్రణ సంస్థ నిర్బంధంలో ఉన్నట్లు గత వేసవిలో ఒక ప్రభుత్వ ఆర్థిక ప్రచురణకు చెందిన ఎకనామిక్ అబ్జర్వర్ నివేదించారు. కార్పొరేట్ లంచం అనుమానిత కేసులో ఆయన్ను విచారిస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. తిరుగులేని బ్యాంకర్ చైనా టెక్ పరిశ్రమలో ప్రముఖ బ్యాంకర్ అయిన బావో ఫాన్ 2005లో బీజింగ్‌లో చైనా రినయ్‌సెన్స్‌ను స్థాపించారు. చైనీస్ టెక్ సంస్థల కోసం అగ్ర డీల్మేకర్లలో ఒకడిగా పరిశ్రమను శాసించారు. ఆ దేశంలోని రెండు ప్రముఖ ఫుడ్ డెలివరీ సర్వీసులైన మీటువాన్, డయాన్పింగ్ మధ్య 2015 విలీనానికి ఆయనే మధ్యవర్తిత్వం వహించారు. ఆ రెండు కంపెనీల “సూపర్ యాప్” నేడు చైనా అంతటా విస్తరించింది. -
సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లలో శక్తి కాంతదాస్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ర్యాంక్ పొందారు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ ఫై నాన్స్ మ్యాగజైన్ ఆయనకు ఈ ప్రతిష్టాత్మక ర్యాంకును అందించింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రచురించిన గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్, 2023లో దాస్ ‘ఏ ప్లస్’ రేటింగ్ పొందారు. ‘ఏ ప్లస్’ రేటింగ్ పొందిన ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల జాబితాలో దాస్ అగ్రస్థానంలో ఉన్నారు. దాస్ తర్వాతి వరుసలో స్విట్జర్లాండ్ గవర్నర్ థామస్ జె జోర్డాన్, వియత్నాం సెంట్రల్ బ్యాంక్ చీఫ్ న్గుయెన్ థి హాంగ్ ఉన్నారు. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటన ప్రకారం ద్రవ్యో ల్బ ణం నియంత్రణ, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేటు నిర్వహణలో విజయం తత్సంబంధ అంశాల స్కేల్‌పై ఆధారపడి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ‘ఏ’ నుంచి ‘ఎఫ్’ వరకూ ర్యాంకులను ఇవ్వడం జరుగుతుంది. ‘ఏ ప్లస్’ అద్భుత పనితీరు ను ప్రతిబింబిస్తే, పూర్తి వైఫల్యాన్ని ‘ఎఫ్’ సూచిస్తుంది. రెండవ ప్రతిష్టాత్మక గుర్తింపు లండన్ సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్, 2023 జూన్‌లో దాస్‌కు ’గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రదానం చేసిన నేపథ్యంలోనే ఆయనకు తాజాగా మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించడం గమనార్హం. ద్రవ్యోల్బణంపై పోరు, డిమాండ్ పెరుగుదల, సప్లై చైన్‌కు అంతరాయం కలగకుండా చర్యలు వంటి పలు సవాళ్ల పరిష్కారానికి ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రభుత్వాలూ తమ సెంట్రల్ బ్యాంక్‌ల వైపు చూసినట్లు మ్యాగజైన్ పేర్కొంది. ‘ఏ’ గ్రేడ్ పొందిన సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లలో బ్రెజిల్‌కు చెందిన రాబర్టో కాంపోస్ నెటో, ఇజ్రాయెల్‌కు చెందిన అమీర్ యారోన్, మారిషస్‌కు చెందిన హర్వేష్ కుమార్ సీగోలం, న్యూజిలాండ్‌కు చెందిన అడ్రియన్ ఓర్ ఉన్నారు. కొలంబియాకు చెందిన లియోనార్డో విల్లార్, డొమినికన్ రిపబ్లిక్కు చెందిన హెక్టర్ వాల్డెజ్ అల్బిజు, ఐస్లాండ్కు చెందిన అస్గీర్ జాన్సన్, ఇండోనేíÙయాకు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పెర్రీ వార్జియో ‘ఏ’ మైనస్ గ్రేడ్ పొందిన గవర్నర్లలో ఉన్నారు. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 1994 నుంచి గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్‌ను ప్రచురిస్తోంది. యూరోపియన్ యూనియన్, ఈస్టర్న్ కరీబియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ సహా 101 దేశాలు, భూభాగాలు, జిల్లాల గ్రేడ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు వారి పనితీరు ఆధారంగా ర్యాంకుల ప్రకటన జరుగుతోంది. -
బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు
ముంబై: భారత్‌లో బడా కార్పొరేట్లను ఎప్పటికీ బ్యాంకింగ్ వ్యాపారంలోకి అనుమతించొద్దని వెటరన్ బ్యాంకర్ ఎన్ వాఘుల్ అభిప్రాయపడ్డారు. బ్యాంకుల జాతీయీకరణకు ముందు అనుభవాల నుంచి భారత్ పాఠాలు నేర్చుకుందంటూ.. బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్లను అనుమతించి అవే తప్పులను పునరావృతం కానీయవద్దన్నారు. రెండేళ్ల క్రితం ఆర్బీఐ చర్చా పత్రం కార్పొరేట్లను బ్యాంకుల్లోకి అనుమతించడాన్ని ప్రస్తావించింది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు కార్పొరేట్ సంస్థలు అయితే నిధులు సమీకరించే సత్తా ఉంటుందని, అది దేశ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. దీంతో వాఘుల్ ఈ విధంగా హెచ్చరించినట్టు కనిపిస్తోంది. ఆర్థిక వృద్ధికి కావాల్సిన నిధులు ప్రజల నుంచి రావాలని వాఘుల్ అన్నారు. ప్రొఫెషనల్‌గా నడిచే బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రజలు సానుకూలంగా ఉన్నట్టు మీడియా సమావేశంలో భాగంగా పేర్కొన్నారు. వృత్తి నిపుణుల ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులే కావాలన్నారు. వచ్చే దశాబ్దంలో అంతా డిజిటల్ బ్యాంకింగ్ హవాయేనంటూ, అంతా ఫిన్‌టెక్ ఆధారితంగా ఉండొచ్చన్నారు. ప్రాంతీయ బ్యాంకులు సహా అన్ని బ్యాంకులూ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. బ్యాంకింగ్‌పై ప్రభుత్వ నియంత్రణ తొలగిపోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వ్యాపారంలో ఉండాల్సిన అవసరం లేదన్న ప్రధాని మాటలను గుర్తు చేశారు. కనుక ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణలో ప్రభుత్వం ముందుకే వెళుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణతో నిపుణులైన బోర్డుల ఆధ్వర్యంలో బ్యాంకులు నడిచే అవకాశం ఉంటుందన్నారు. వాఘుల్ గతంలో ఐసీఐసీఐ బ్యాంకింగ్‌కు సారథ్యం వహించడం గమనార్హం. ఇదీ చదవండి: లాభాలతో అదరగొట్టిన పంజాబ్ సింద్ బ్యాంక్ -
చూస్తుండగానే 4 లక్షలు హాంఫట్
సాక్షి, దొడ్డబళ్లాపురం(బెంగళూరు): స్కూటర్ డిక్కీలో ఉన్న నగదును దుండగులు క్షణాల్లో చోరీ చేశారు. కోడిగుడ్ల వ్యాపారం చేసే దొడ్డపట్టణానికి చెందిన రమేశ్ బుధవారం కర్ణాటక బ్యాంకులో రూ.4 లక్షలు డ్రా చేసి స్కూటర్ డిక్కీలో పెట్టుకున్నాడు. కోర్టు రోడ్డులోని హీరోహోండా షోరూం ముందు స్కూటర్ నిలిపి టీస్టాల్‌లోకి వెళ్లాడు. అప్పటికే వెంటాడిన దుండగులు క్షణాల్లో నగదుతో బైక్‌పై ఉడాయించారు. రమేశ్‌తోపాటు స్థానికులు దుండగులను పట్టుకోవాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది. సీటీవీ కెమెరా పుటేజీ ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
పెరుగుతున్న అప్పులపై ఆందోళన వద్దు, కేంద్రంపై ప్రశంసలు
ముంబై: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటుకు సంబంధించి ధైర్యం ప్రదర్శించాల్సిన సమయం ఇదని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ పేర్కొన్నారు. వృద్ధికి అవసరం అనుకుంటే, బడ్జెట్లో నిర్దేశించుకున్న దానికన్నా ఎక్కువగా ద్రవ్యలోటు లక్ష్యాలను మరింత పెంచాలని ఆయన సూచించారు. భారత్కోసం 25 సంవత్సరాల వృద్ధి రన్‌వే అవకాశం ఎదురుచూస్తోందని కూడా కామత్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి 8 శాతంలోపు వడ్డీరేట్లు, అపారమైన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) అవసరం అని సూచించారు. ద్రవ్యలోటుపై ప్రముఖ బ్యాంకర్‌గా కామత్ తాజా ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో కామత్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే.. ద్రవ్యలోటు విషయంలో ఇప్పటికే కేంద్రం ధైర్యాన్ని ప్రదర్శించింది. దేశం నిరంతరాయంగా వృద్ధి బాటలో పయనిస్తుందని భావిస్తే, ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచడానికి సిద్ధమని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగం సూచిస్తోంది. ద్రవ్యలోటు భారీగా పెరిగిపోతోందని ఆందోళన అక్కర్లేదన్నది నా భావన. ఎందుకంటే ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు వివిధ వినూత్న ఫైనాన్షింగ్ అవకాశాలు ఉన్నాయి. నగదు ముద్రణ ఇందులో ఒకటి. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) వ్యవస్థలో తగిన స్థాయిలో ఉండడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. వడ్డీరేట్లు దిగువ స్థాయిలోనే కొనసాగుతాయని విశ్వసిస్తున్నాను మౌలిక రంగం పటిష్టతలో ఉన్న క్లిష్టతలను జాగ్రత్తగా ఎదుర్కొనాలి. వినూత్న, ఆధునిక ఫైనాన్షింగ్ విధానాలను ప్రభుత్వం ఇందుకు అనుసరించాల్సి ఉంటుంది.ఈ సమయంలో పన్ను రహిత మౌలిక సదుపాయాల బాండ్లను ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు. అవసరమైతే ప్రభుత్వం మాత్రమే ఇటువంటివి జారీ చేయాలి. థర్డ్ పార్టీలను అనుమతించాల్సిన అవసరం లేదు. తయారీ విషయంలో భారత్ కంపెనీలకు గతం తరహాలో ఇప్పుడు పెద్దగా ఇబ్బంలు లేవు. తగిన నిధుల అందుబాటు ఇందుకు కారణం.కొత్త తరం కంపెనీలకు ప్రస్తుతం లభించిన ఒక పెద్ద అవకాశం ‘డిజిటల్ సూపర్‌సైకిల్’. తద్వారా ఉపాధి అవకాశాలను కొత్త తరం కంపెనీలు సృష్టించవచ్చు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడవచ్చు. భారత్‌కు సువిశాల తీరప్రాంతం ఉంది. దీనిని దేశం సద్వినియోగ పరచుకోవాలి. తీరప్రాంత ఆర్థిక మండళ్ల ఏర్పాటుపై కేంద్రం దృష్టి సారించాలి. అలాంటి మండళ్లను స్వయంగా ప్రారంభించాలి. 2019–20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. 2020–21లో ద్రవ్యలోటును 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్న కేంద్రం లక్ష్యాలన్ని కరోనా మహమ్మారి దెబ్బతీసింది. ఇది ఏకంగా 9.3 శాతానికి ఎగసింది. విలువలో ఇది రూ.18,21,461 కోట్లు. 2022 మార్చితో ము గిసే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.8 శాతానికి కట్టడి చేయాలని 2021 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేర్కొంది. అయితే కరోనా సెకండ్‌వేవ్ సవాళ్ల వల్ల ఈ లక్ష్యం 8 శాతం దాటిపోతుందని ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి నెల– ఏప్రిల్ ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 5.2 శాతానికి చేరింది. విలువలో రూ.78,699 కోట్లు. 2021–22లో 6.8 శాతం లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. విలువలో రూ.15,06,812 కోట్లు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. -
‘యోనో’ విలువ... రూ.3 లక్షల కోట్ల పైమాటే
ముంబై: ఆరంభించిన మూడేళ్ల కాలంలోనే ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ ‘యోనో’ 40 బిలియన్ డాలర్లకు పైగా వ్యాల్యూషన్‌తో అతిపెద్ద స్టార్టప్‌గా అవతరించినట్టు బ్యాంకు చైర్మన్ రజనీష్‌కుమార్ తెలిపారు. వ్యాపారుల నుంచి వ్యాపారుల మధ్య వాణిజ్య బిల్లులు చెల్లింపులకు గాను ‘భారత్ డ్రాఫ్ట్’ పేరుతో ఒక బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ) ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. 2017 నవంబర్‌లో ఎస్బీఐ యోనో యాప్, వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఎస్బీఐ కస్టమర్లు బ్యాంకింగ్ సేవలను, పెట్టుబడులను, షాపింగ్‌ను ఒకే వేదికగా చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రజనీష్ కుమార్ మాట్లాడుతూ.. యోనో లాభదాయక ప్లాట్‌ఫామ్ అని, ఎస్బీఐలో భాగంగా ఉన్నందున దీని విలువ ఎవరికీ తెలియదన్నారు. ‘‘ఒకవేళ బ్యాంకు వెలుపల ఉండి ఉంటే దీని విలువ ఎంత లేదన్నా 40–50 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. ప్రతిరోజూ 70 వేల మంది కస్టమర్లను ఈ ప్లాట్‌ఫామ్‌పైకి చేర్చుకుంటున్నాము. గత 6 నెలల్లోనే 2.7 కోట్ల మంది యూజర్లు ఇందులో చేరారు. మెకిన్సే, ఐబీఎం సాయంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశాం. రోజూ యోనో వేదికగా రూ.70 కోట్ల రుణాలను మంజూరు చేస్తున్నాము’’ అంటూ రజనీష్ వివరించారు. సైబర్ భద్రత, మోసాల నివారణ విషయంలో కొన్ని స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. -
భారీగా డిపాజిట్ చేసిన బ్యాంకు అధికారిపై...
అగర్తలా : అక్రమంగా రూ.25.44 లక్షలకు పైగా నగదు తన వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసుకుని ఓ బ్యాంకు అధికారి తన పదవి పోగుట్టుకున్నాడు. యూసీఓ బ్యాంకులో మెలాఘర్ బ్రాంచులో హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న దిలీప్ దిలీప్ డెబ్బర్మ, పాత నోట్ల రద్దయిన తర్వాత బ్యాంకు ప్రధాన కార్యాలయం కోల్‌కత్తాలోని తన పర్సనల్ అకౌంట్లో రూ.2,544,500 డిపాజిట్ చేసుకున్నాడని యూసీఓ బ్యాంకు జోనల్ మేనేజర్ సునిల్ కుమార్ దాస్ తెలిపారు. ఈ విషయంపై బ్యాంకు విజిలెన్స్ వింగ్ దర్యాప్తు చేపట్టిందని చెప్పారు. అయితే విచారణలో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఒక్కసారిగా ఎక్కడనుంచి వచ్చిదనే దానికి దిలీప్ పొత్తనలేని సమాధానాలు చెప్పడంతో అతనిపై చర్యలు తీసుకున్నామని జోనల్ మేనేజర్ పేర్కొన్నారు. అతని సస్పెండ్ చేశామని వెల్లడించారు. నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నిర్ణయం ప్రకటించిన అనంతరంలో త్రిపురలో సస్పెండ్ అయిన మొదటి బ్యాంకు అధికారి డెబ్బర్మనే. -
పెట్టుబడి ఎట్లా..
రైతన్నకు రుణాల గుబులు బోణీకొట్టని ఖరీఫ్ రుణ ప్రణాళిక కొత్తవి ఇచ్చేందుకు బ్యాంకర్ల విముఖత పాత రుణాల మాఫీకి లింకు ముంచుకొస్తున్న సాగు కాలం ప్రైవేట్ అప్పులవైపు రైతుల చూపు వరంగల్ : రైతు రుణాలను రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ఇచ్చిన హామీ అమలులో జాప్యం.. కొత్త రుణాల మంజూరుకు గుదిబండగా మారింది. ఖరీఫ్ రుణాలు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ బ్యాంకర్లలో సానుకూల స్పందన లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రుణమాఫీపై బ్యాంకర్లకు స్పష్టత లేకుండా కొత్త రుణాలిచ్చే అవకాశం లేకపోవడంతో సన్న, చిన్నకారు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష రుణమాఫీ చేసి తీరుతామంటూ సీఎం కేసీఆర్ శాసనసభలో శుక్రవారం తేల్చిచెప్పారు. అరుుతే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు, విధి విధానాలు, నిబంధనలు బ్యాంకర్లకు చేరాల్సి ఉంది. వీటికి ఎంత గడువు తీసుకుంటారు? ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై ఆధారపడే రుణమాఫీ జరిగే అవకాశం ఉంది. ఈ సంశయం రైతులను తొలుస్తున్నది. హామీ అమలైతే జిల్లాలో రూ.1200 కోట్ల మేరకు రుణాలు మాఫీ అవుతాయని, 2లక్షల 50వేల మంది రైతులకు రుణభారం తొలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బోణీకొట్టని రుణప్రణాళిక ఈ ఏడాది రైతు రుణ ప్రణాళికను లీడ్‌బ్యాంక్ ప్రకటించినప్పటికీ జిల్లాలో ఎక్కడా ఇంకా రుణాల మంజూరు ప్రారంభం కాలేదు. సీజన్ పూర్తయిన తర్వాత రుణాలు మంజూరు చేయడం వల్ల ప్రయోజనం లేదు. రుణమాఫీకి, రుణ మంజూరుకు బ్యాంకర్లు లింక్పెడుతున్నందున రైతులకు పాలుపోవడంలేదు. 2014 -15 వార్షిక ప్రణాళికలో పంట రుణాలు రూ.2100 కోట్లుగా నిర్ణయించారు. టర్మ్‌లోన్ రూ.233.20కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగానికి రూ.308 కోట్లుగా నిర్ణయించారు. వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కిషన్ బ్యాంకర్లను కోరారు. రుణ ప్రణాళిక ఈ నెల ప్రారంభం నుంచి అమలు కావాల్సి ఉండగా ఏ బ్యాంకులోనూ ఈ జాడ కన్పించడం లేదు. ప్రభుత్వం రుణమాఫీపై గందరగోళానికి తెరదించితేనే కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ హామీ మేరకు రూ.లక్ష రుణం మాఫీపై బ్యాంకుల వారీగా పూర్తి స్థాయి లెక్కలు తీస్తున్నట్లు లీడ్‌బ్యాంక్ మేనేజర్ సాయిప్రసాద్ తెలిపారు. పెట్టుబడి కోసం దిగులు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు పెట్టుబడి దిగులు పట్టుకున్నది. సర్కార్ రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తుంది...తిరిగి కొత్త అప్పులకు అవకాశం కల్పిస్తారా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ చేస్తే అప్పుల భారం పోయి, కొత్త రుణంతో పెట్టుబడికి ఇబ్బందులుండవని భావించిన రైతులకు ఇప్పుడు సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఒకటి, రెండు వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ స్థితిలో రుణమాఫీ, కొత్త రుణాలపై జాప్యం చేస్తే సాగుకు సమస్యలు తలెత్తుతాయంటున్నారు. పెట్టుబడి కోసం ప్రైవేటు అప్పులపై ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలు, కరెంట్ కోతలు, వడగళ్ళతో రైతులు గత ఖరీఫ్, మొన్నటి రబీలో తీవ్రంగా నష్టపోయారు. ఆదాయంతో పాటు పెట్టుబడి సైతం నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయారు.