ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం అభయ్ ఐమా కన్నుమూశారు. శనివారం సాయంత్రం ఆయన 63 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన చిరకాల మిత్రుడు, జమ్మూకశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబు ఈ విషయం వెల్లడించారు.
హసీబ్ ద్రాబు ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఐమా సాయెబా, ఇక లేరు! చిన్ననాటి స్నేహితుడు నన్ను ఒంటరిగా విడిచి వెళ్లిపోయాడు. శ్రీనగర్, ముంబైలో ఐదు దశాబ్దాల అనుబంధం ఒక నిమిషంలో ముగిపోయింది" అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు శాంతాక్రూజ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని ద్రాబు వేరే పోస్ట్‌లో తెలిపారు.
బ్యాంకింగ్‌లో అత్యుత్తమ పదవులు నిర్వహించిన ఐమా 2020లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి పదవీ విరమణ చేశారు. 2021లో స్పైస్ మనీ అడ్వైజరీ బోర్డులో చేరారు. 1995లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో చేరడానికి ముందు, ఐమా సిటీ బ్యాంక్‌లో పనిచేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయిన ఐమా, బ్యాంకింగ్ రంగానికి రాక ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ కావడానికి కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment