భారీగా డిపాజిట్ చేసిన బ్యాంకు అధికారిపై...
భారీగా డిపాజిట్ చేసిన బ్యాంకు అధికారిపై...
Published Wed, Dec 21 2016 8:50 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
అగర్తలా : అక్రమంగా రూ.25.44 లక్షలకు పైగా నగదు తన వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసుకుని ఓ బ్యాంకు అధికారి తన పదవి పోగుట్టుకున్నాడు. యూసీఓ బ్యాంకులో మెలాఘర్ బ్రాంచులో హెడ్ క్యాషియర్గా పనిచేస్తున్న దిలీప్ దిలీప్ డెబ్బర్మ, పాత నోట్ల రద్దయిన తర్వాత బ్యాంకు ప్రధాన కార్యాలయం కోల్కత్తాలోని తన పర్సనల్ అకౌంట్లో రూ.2,544,500 డిపాజిట్ చేసుకున్నాడని యూసీఓ బ్యాంకు జోనల్ మేనేజర్ సునిల్ కుమార్ దాస్ తెలిపారు. ఈ విషయంపై బ్యాంకు విజిలెన్స్ వింగ్ దర్యాప్తు చేపట్టిందని చెప్పారు.
అయితే విచారణలో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఒక్కసారిగా ఎక్కడనుంచి వచ్చిదనే దానికి దిలీప్ పొత్తనలేని సమాధానాలు చెప్పడంతో అతనిపై చర్యలు తీసుకున్నామని జోనల్ మేనేజర్ పేర్కొన్నారు. అతని సస్పెండ్ చేశామని వెల్లడించారు. నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నిర్ణయం ప్రకటించిన అనంతరంలో త్రిపురలో సస్పెండ్ అయిన మొదటి బ్యాంకు అధికారి డెబ్బర్మనే.
Advertisement
Advertisement