Bank official
-
బ్యాంకోళ్ల జబర్దస్తీ!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు అధికారులు జబర్దస్తీకి దిగుతున్నారు. తనఖాలో ఉన్న భూములను వేలం వేస్తున్నట్టుగా రైతులకు నోటీసులు ఇవ్వడమే గాకుండా, పొ లాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకోళ్ల జబర్దస్తీతో తమ పరువు పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) అధికారులు కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు.రైతుల భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కుదువ పెట్టిన భూములను వేలం వేయడానికి తాము అ«దీనంలోకి తీసుకున్నట్టు కొందరు రైతుల భూముల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్‌లో లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో రైతుల భూములను వేలం వేస్తున్నట్టు పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయంపై ‘సాక్షి’ప్రచురించిన కథనంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి సహకార బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరువు తీసేలా వ్యవహరించవద్దని ఆదేశించారు.దీంతో రైతుల భూముల వేలం నిలిచిపోయింది. తాజాగా నస్రుల్లాబాద్ మండలంలో సహకార బ్యాంకు అధికారులు తిరిగి అదే పద్ధతిని మొదలుపెట్టారు. ఈనెల 26న పలువురు రైతుల భూములను వేలం వేయనున్నట్టు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల ఆవేదన..: బ్యాంకు అధికారులు తమ భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడంతో పాటు భూముల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు ఆస్తులు అమ్ముకుని అయినా కడతామని, తమ భూములు వేలం వేసి పరువు తీయద్దని వేడుకుంటున్నారు. -
భర్త ఆత్మహత్యతో బయటపడిన భార్య హత్య
హైదరాబాద్: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలతో మనస్తాపం చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి ఏడు నెలల గర్భవతి అయిన భార్యను దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత భార్య మృతదేహాన్ని బెడ్రూమ్లోనే ఉంచి, ఇంటికి తాళం వేసి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన బయ్య లింగమల్లమ్మ, సర్వయ్య దంపతుల కుమార్తె సుమలత(25)కు మిర్యాలగూడకు చెందిన ఎం.మలయాద్రి కుమారుడు మేకల మాధవ్ (30)తో కిందటేడాది అక్టోబర్ 5న వివాహం జరిగింది. ఆ సమయంలో అల్లుడు మాధవ్‌కు రూ.6 లక్షల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. వివాహం అయిన కొంతకాలం వీరి కాపురం సజావుగా నడిచింది. భార్య మెడ చుట్టూ చున్నీ బిగించి.. నల్లకుంట సిండికేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న మేకల మాధవ్ శంకరమఠం ఎదురు వీధిలో గల ఆరో విల్లా అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 303లో అద్దెకు దిగాడు. ఏడు నెలల గర్భవతి అయిన సుమలత గత కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటూ ఈ నెల 16న తల్లితో కలసి భర్త వద్దకు వచ్చింది. తల్లి ఈ నెల 18న సాయంత్రం కుమార్తెను ఇక్కడే వదిలి స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంట్లో జరిగిన విషయాలకు మనస్తాపం చెందిన మాధవ్ శనివారం మధ్యాహ్నం భార్య సుమలత మెడ చుట్టూ చున్నీతో బిగించి హత్య చేశాడు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని బెడ్రూమ్లోనే ఉంచి, ఇంటికి తాళం వేసి సమీపంలో ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లి.. నడుస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుకుని ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. మృతుని ఐడీ కార్డు ఆధారంగా వివరాలు తెలుసుకుని అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. భర్త ఆత్మహత్యతో బయటపడిన భార్య హత్య మాధవ్ తండ్రి మలయాద్రి శనివారం సాయంత్రం 4.30కి వియ్యంకురాలు లింగమల్లమ్మకు ఫోన్ చేసి తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. వెంటనే లింగమల్లమ్మ కుమార్తెకు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన లింగమల్లమ్మ బంధువులతో కలసి రాత్రి 8.30 గంటలకు నల్లకుంటలో కుమార్తె నివాసముంటున్న ఇంటి వద్దకు చేరుకుంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో.. పోలీసుల సమక్షంలో తాళం పగులగొట్టి చూడగా సుమలత బెడ్రూమ్లో విగత జీవిగా పడి ఉంది. ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నల్లకుంట సీఐ వి.యాదగిరిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా డిపాజిట్ చేసిన బ్యాంకు అధికారిపై...
అగర్తలా : అక్రమంగా రూ.25.44 లక్షలకు పైగా నగదు తన వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసుకుని ఓ బ్యాంకు అధికారి తన పదవి పోగుట్టుకున్నాడు. యూసీఓ బ్యాంకులో మెలాఘర్ బ్రాంచులో హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న దిలీప్ దిలీప్ డెబ్బర్మ, పాత నోట్ల రద్దయిన తర్వాత బ్యాంకు ప్రధాన కార్యాలయం కోల్‌కత్తాలోని తన పర్సనల్ అకౌంట్లో రూ.2,544,500 డిపాజిట్ చేసుకున్నాడని యూసీఓ బ్యాంకు జోనల్ మేనేజర్ సునిల్ కుమార్ దాస్ తెలిపారు. ఈ విషయంపై బ్యాంకు విజిలెన్స్ వింగ్ దర్యాప్తు చేపట్టిందని చెప్పారు. అయితే విచారణలో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఒక్కసారిగా ఎక్కడనుంచి వచ్చిదనే దానికి దిలీప్ పొత్తనలేని సమాధానాలు చెప్పడంతో అతనిపై చర్యలు తీసుకున్నామని జోనల్ మేనేజర్ పేర్కొన్నారు. అతని సస్పెండ్ చేశామని వెల్లడించారు. నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నిర్ణయం ప్రకటించిన అనంతరంలో త్రిపురలో సస్పెండ్ అయిన మొదటి బ్యాంకు అధికారి డెబ్బర్మనే. -
ఉద్యోగం పేరుతో అత్యాచారం
రాంపూర్(యూపీ): తన కుమారుడికి ఉద్యోగమిప్పిస్తానని నమ్మించి బ్యాంకు ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ.. యూపీలోని రాంపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఉత్తరాఖండ్ లోని రాంనగర్ బ్యాంకులో పనిచేస్తున్న సమయంలో ఓ బ్యాంకు ఉద్యోగి తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించేందుకు రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడని బాధితురాలు తెలిపింది. తాను రూ. 6 లక్షలు ఇచ్చినా ఉద్యోగం ఇప్పించలేదని వెల్లడించింది. తన డబ్బులు తిరిగిచ్చేయమని ఒత్తిడి చేయగా 2013 ఆగస్టు 18న ఇంటికి పిలిచి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. మత్తుమందు ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు వాపోయింది. ఈ ఘాతుకాన్ని కెమెరాలో చిత్రీకరించి ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రస్తుతం హల్దవానీలో పనిచేస్తున్నాడు. బాధితురాలు రాంనగర్ వాసి.