రాంపూర్(యూపీ): తన కుమారుడికి ఉద్యోగమిప్పిస్తానని నమ్మించి బ్యాంకు ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ.. యూపీలోని రాంపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఉత్తరాఖండ్ లోని రాంనగర్ బ్యాంకులో పనిచేస్తున్న సమయంలో ఓ బ్యాంకు ఉద్యోగి తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించేందుకు రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడని బాధితురాలు తెలిపింది. తాను రూ. 6 లక్షలు ఇచ్చినా ఉద్యోగం ఇప్పించలేదని వెల్లడించింది.
తన డబ్బులు తిరిగిచ్చేయమని ఒత్తిడి చేయగా 2013 ఆగస్టు 18న ఇంటికి పిలిచి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. మత్తుమందు ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు వాపోయింది. ఈ ఘాతుకాన్ని కెమెరాలో చిత్రీకరించి ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రస్తుతం హల్దవానీలో పనిచేస్తున్నాడు. బాధితురాలు రాంనగర్ వాసి.
ఉద్యోగం పేరుతో అత్యాచారం
Published Thu, Dec 18 2014 9:16 PM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM
Advertisement
Advertisement