లక్నో: అక్టోబర్ 2.. గాంధీ జయంతి. దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడంలో మహాత్ముని కృషి మరువలేనిది. గాంధీజీ 1869, జనవరి 30న గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించారు. గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గాంధీ జీవితంలో అనేక ప్రత్యేక ఘట్టాలు కనిపిస్తాయి. గాంధీ ధరించిన టోపీ వెనుక ప్రత్యేక చరిత్ర ఉంది.
యూపీలోని రాంపూర్ నవాబుల సంప్రదాయాలు భారత స్వాతంత్య్ర పోరాటానికి ప్రత్యేక అధ్యాయాన్ని అందించాయి. మహాత్మా గాంధీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నవాబుల రాజ సంప్రదాయమైన టోపీని ధరించారు. అనంతరం అది గాంధీ టోపీ పేరుతో ప్రసిద్ధి చెందింది. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి చిహ్నంగానూ మారింది.
1918 డిసెంబర్ 30న ఖిలాఫత్ ఉద్యమ నాయకులు మౌలానా షౌకత్ అలీ, మహమ్మద్ అలీలను కలుసుకునేందుకు గాంధీ మొదటిసారిగా రాంపూర్ వచ్చారు. 1919లో ఆయన రెండవసారి ఆయన రాంపూర్ వచ్చినప్పుడు ఈ టోపీ ధరించారు. ఈ పర్యటనలో ఆయన నాటి నవాబు సయ్యద్ హమీద్ అలీఖాన్ బహదూర్‌ను కలుసుకునే సందర్భం వచ్చింది. ఆనాటి సంప్రదాయం ప్రకారం నవాబును కలుసుకునే సమయంలో తలను టోపీతోనే లేదా ఏదైనా వస్త్రంతోనే కప్పుకోవాల్సి ఉంది. అయితే ఆ సమయంలో గాంధీ దగ్గర అటువంటిదేమీ లేదు.
దీంతో ఆయన రాంపూర్ మార్కెట్‌లో టోపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే టోపీ ఎక్కడా దొరకలేదు. ఈ పరిస్థితిని చూసిన మౌలానా షౌకత్ అలీ, ఆయన తల్లి అబ్దీ బేగం స్వయంగా గాంధీకి టోపీ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలోనే గాంధీ టోపీ రూపొందింది. తదనంతర కాలంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ టోపీ.. ఉద్యమ చిహ్నంగానూ మారింది. ఇది నాటి భారతీయుల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. నేటికీ పలు చోట్ల మనకు గాంధీ టోపీ కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: పూజారిని చంపిన చిరుత.. 10 రోజుల్లో ఆరో ఘటన
Comments
Please login to add a commentAdd a comment