నేషనల్ పోలీస్ అకాడమీకి తొలి మహిళా బాస్! | National Police Academy set to have first woman boss | Sakshi
Sakshi News home page

నేషనల్ పోలీస్ అకాడమీకి తొలి మహిళా బాస్!

Published Fri, Dec 27 2013 3:33 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

నేషనల్ పోలీస్ అకాడమీకి తొలి మహిళా బాస్!

నేషనల్ పోలీస్ అకాడమీకి తొలి మహిళా బాస్!

న్యూఢిల్లీ:  నేషనల్ పోలీస్ అకాడమీ తొలి మహిళా డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అరుణ బహుగుణ(56) ఎంపికైయ్యారు. హైదరాబాద్ లో పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చే ఈ అకాడమీ లో మహిళా డైరెక్టర్ ను నియమించడం ఇదే తొలిసారి. 65 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన అకాడమీకి బాస్ గా  బహుగుణ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.1979 బ్యాచ్ కు చెందిన ఆమె ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలకు డీజీగా పని చేస్తున్నారు. 3 లక్షల సీఆర్పీఎప్  జవాన్లకు సేవలు అందిస్తున్నఆమె నేషనల్ పోలీస్ అకాడమీ బాస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఆమె త్వరలోనే నియామక పత్రాలు అందుకోనుంది.

 

ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది.. ప్రస్తుతం నేషనల్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న సుభాష్ గోస్వామి ఇండో-టిబెటన్ డీజీగా స్థానం చలనం కలగడంతో ఆ స్థానంలో బహుగుణే నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement