రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ | narendra modi will come to hyderabad tomorrow | Sakshi
Sakshi News home page

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

Published Thu, Nov 24 2016 2:08 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ - Sakshi

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

శుక్రవారం రాత్రి జాతీయ పోలీసు అకాడమీలో బస
సాక్షి, హైదరాబాద్: దేశ అంతర్గత భద్రత అంశంపై సర్దార్ వల్లాభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న రాష్ట్రాల డీజీపీ, ఐజీపీల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25 (శుక్రవారం)న హైదరాబాద్ రానున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంశాఖ సహాయ మంత్రులు కిరణ్‌రిజిజు, హన్‌‌సరాజ్ అహిర్ గంగారాం, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ధోవల్, రా, ఐబీ సంస్థల చీఫ్‌ల బృందంతో కలసి శుక్రవారం సాయంత్రం 6.35 గంట లకు ప్రత్యేక విమానంలో రాజీవ్‌గాంధీ అంత ర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని చేరు కోనున్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికా రులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు.

ప్రధాని మోదీ బృందం నేరుగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషల్ పోలీసు అకాడమీకి చేరుకుని అక్కడి రాజస్థాన్ భవన్‌లో రాత్రి బస చేయ నుంది. అకాడమీలో శనివారం ఉదయం ప్రారంభం కానున్న రాష్ట్రాల డీజీపీ, ఐజీపీల సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేయనున్నారు. శనివారం సాయంత్రం 5.35 గంటలకు ప్రధాని మోదీ, అజిత్ ధోవల్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కాను న్నారు. శంషా బాద్ విమానాశ్రయం నుంచి జాతీయ పోలీసు అకాడమీకి, అక్కడి నుంచి మళ్లీ శంషాబాద్ విమానాశ్రయానికి మాత్రమే ప్రధాని పర్యటన పరిమితం కానుంది. రాజ్‌నాథ్, రిజుజు, హన్‌‌స రాజ్ మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఉగ్రవాదం నుంచి సైబర్ నేరాల వరకు ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరగ నుందని ఎన్‌పీఏ వర్గాలు తెలిపాయి.

పటిష్ట ఏర్పాట్లు చేయండి..
ప్రధాని మోదీ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సీఎస్ రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ప్రధాని పర్యటన సందర్భంగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని హెచ్‌ఎం డీఏ, జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. రోడ్ల మరమ్మ తులు, పరిశుభ్రత, నిరంతర విద్యుత్ సరఫ రాకు చర్యలు తీసుకోవాలన్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ ను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, ముఖ్యకార్యదర్శులు ఆధర్‌సిన్హా, సునీల్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్య, ఇంటలిజెన్‌‌స ఐజీ నవీన్ చంద్ తదితరులు పాల్గొన్నారు.
 
కమాండోల రక్షణలో..
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో పోలీ సులను భారీగా మొహరించారు. ఇప్పటికే కేంద్ర బలగాలు నేషనల్ పోలీస్ అకాడమీ ని ఆధీనంలోకి తీసుకుని అణువణువు పరి శీలించాయి. కమాండోలు అకాడమీ లోని ప్రతి భవనంతో పాటు చుట్టూ ఎత్తైన భవనాలను పరిశీలించారు. కమాండోల పరిశీలన నేపథ్యంలో ఎవరిని లోనికి అను మతించలేదు. వివిధ ప్రాంతాల నుంచి పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందికి బుధవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయవర్సిటీలో ఆడిటో రియంలో బస కల్పించారు.

వివిధ ప్రాంతాలను నుంచి వచ్చిన పోలీసులను పోలీసు అకాడమీ చూట్టు మొహరి స్తున్నారు. అడుగడుగునా ఒక పోలీసును ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళిక మ్యాప్‌పై బుధవారం  డీజీపీ, సైబరాబాద్ కమిషనర్‌తో పాటు ఇతర ఉన్నతా ధికారులు చర్చించారు. మరోవైపు పోలీసు బృందాలు బుధవారం ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌పీఏ వరకు ఇరువైపుల రహ దారులను పరిశీలించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement