సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారం కిందట 9 మంది ట్రైనీ ఐపీఎస్‌లకు ఈ వైరస్ సోకగా గత నాలుగైదు రోజుల్లో మరో 12 మంది ట్రైనీ ఐపీఎస్‌లు ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో అకాడమీలో మొత్తం కేసుల సంఖ్య 21కి పెరిగింది. వైరస్ బారినపడిన వారిలో ఐదుగురు ట్రైనీ ఐపీఎస్‌లు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మిగిలిన 16 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయి తిరిగి అకాడమీలో చేరారు. ఈ మేరకు అకాడమీ ఓ ప్రకటన విడుదల చేసింది.