
సాక్షి, హైదరాబాద్ : 71వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో పోలీసుల సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. పోలీసుల పాత్రపై స్కూళ్లలోనే పాఠాలు చెప్పాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా, ప్రాణాయామం భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు. కాగా, నేషనల్ పోలీస్ అకాడమీలో 131 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. వీరిలో 28 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. 42 వారాల పాటు శిక్షణ పూర్తిచేసుకున్న వీరిని పలు కేడర్లకు నియమించారు. తెలంగాణకు 11మంది, ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు ఐపీఎస్‌లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. (చైనాకు తగిన రీతిలో బదులిస్తాం: రావత్)
Comments
Please login to add a commentAdd a comment