గ్రేటర్‌లో హై అలర్ట్!
{పధాని రాక, డీజీపీల సదస్సు నేపథ్యంలో మూడు కమిషనరేట్లలో ఆంక్షలు
సిటీబ్యూరో: దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు/ఐజీపీల వార్షిక సమావేశానికి నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడెమీ (ఎన్‌పీఏ) వేదికై ంది. మూడు రోజుల పాటు జరిగే సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యారుు. కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు 50 మంది డీజీపీలు/ఐజీపీలతో పాటు వివిధ నిఘా, భద్రతా సంస్థలకు చెందిన అధిపతులు హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో పాటు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం సిటీకి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అపశృతులకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గురువారం నుంచే అదనపు బలగాలను రంగంలోకి దింపి పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. కొన్ని సున్నిత, సమస్యాత్మక, అనుమానిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముగ్గురు కమిషనర్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు సీసీఎస్, సిట్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ, సిటీ ఆర్డ్ ్మ రిజర్వ్, టీఎస్‌ఎస్పీ, ఆక్టోపస్ బలగాలను మోహరించారు.
అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా పెట్టడానికి భారీగా పోలీసులను మఫ్టీలో మోహరించారు. ఎలాంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేలా క్విక్ రియాక్షన్ టీమ్‌తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రైకింగ్ ఫోర్స్‌ను అన్ని వేళలా అందుబాటులో ఉంచుతున్నారు. నగరంలోని 40 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పారుుంట్ల ద్వారా వాహనాల తనిఖీ చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో నాకాబందీలు కొనసాగిస్తున్నారు. లాడ్జీల్లో ఆకస్మిక సోదాలు చేస్తూ నిఘా ఉంచారు. ఎన్‌పీఏ చుట్టపక్కల ప్రాంతాల్లో అడుగడుగునా పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటనతో పాటు డీజీపీల సదస్సు పూర్తయ్యే వరకు అప్రమత్తత కొనసాగనుంది.
సాదాసీదా మోదీ కాన్వాయ్
రాజేంద్రనగర్: శంషాబాద్ ఎరుుర్‌పోర్టు నుంచి ప్రధాని మోదీ కాన్వారుు సాదాసీదాగా నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకుంది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆరాంఘర్ నుంచి కేవలం తొమ్మిది వాహనాల కాన్వారుుతో ప్రధాని తరలివెళ్లారు. వెనుకాల 108 వాహనం మాత్రమే ఉండటం విశేషం.