దేశ అంతర్గత భద్రత అంశంపై సర్దార్ వల్లాభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న రాష్ట్రాల డీజీపీ, ఐజీపీల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25 (శుక్రవారం)న హైదరాబాద్ రానున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంశాఖ సహాయ మంత్రులు కిరణ్‌రిజిజు, హన్‌సరాజ్ అహిర్ గంగారాం, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ధోవల్, రా, ఐబీ సంస్థల చీఫ్‌ల బృందంతో కలసి శుక్రవారం సాయంత్రం 6.35 గంట లకు ప్రత్యేక విమానంలో రాజీవ్‌గాంధీ అంత ర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని చేరు కోనున్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికా రులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు.
Published Thu, Nov 24 2016 7:27 AM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement