'నా కుమారుడిని హత్య చేశారు'
సిమ్లా: తన కొడుకును హత్య చేశారని ట్రైనీ ఐపీఎస్ మనోముత్తు మానవ్ తండ్రి రామ్ నివాస్ మానవ్ ఆరోపించారు. తన కుమారుడి హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంచి ఈతగాడైన తన కొడుకు స్విమ్మింగ్ లో పడి మృతి చెందారనడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పంజాబ్ యూనివర్సిటీలో చదవి రోజుల్లో మనోముత్తు స్విమ్మింగ్ క్లబ్ సభ్యుడని తెలిపారు. అలాంటి వాడు స్విమ్మింగ్ ఫూల్ లో పడి ఎలా చనిపోతాడని ఆయన ప్రశ్నించారు.
మద్యం మత్తులో నీటిలో మునిగిపోయి చనిపోయాడన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అతడికి ఎటువంటి చెడు అలవాట్లు లేవని వెల్లడించారు. హిమచల్ ప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల మనోముత్తు మానవ్- జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతూ ఈనెల 29న అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు.