హైదరాబాద్: నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్ పీఏ)లో స్వైన్‌ఫ్లూ సోకి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారులను వైద్యులు డిశ్చార్జి చేసినట్లు నేషనల్ పోలీస్ అకాడమీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు పేర్కొన్నారు. కొత్తగా ఎలాంటి కేసులు లేవని వైద్యులు తెలిపారు.