swineflu
-
‘అమిత్ షాకు అందుకే స్వైన్‌ఫ్లూ సోకింది’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న అమిత్ షా ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచినందుకే అమిత్ షాకు స్వైన్‌ఫ్లూ సోకిందని వ్యాఖ్యానించారు. సంకీర్ణ సర్కార్‌ను కూలదోసే చర్యలు విరమించకపోతే ఆయనకు జ్వరంలో పాటు డయేరియా ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసిన బీజేపీ నేతలు వారిని ముంబై తరలించారని, వారికి బీజుఏపీ, ఆరెస్సెస్ కార్యకర్తలను కాపలగా ఉంచారని హరిప్రసాద్ ఆరోపించారు. జేడీయూ-కాంగ్రెస్ సర్కార్‌ను కూలదోయాలని ప్రయత్నించడంతోనే అమిత్ షాకు ఈ వ్యాధి సోకిందని ధ్వజమెత్తారు. మరోవైపు స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న అమిత్ షా కోలుకున్నారని, ఒకట్రెండు రోజుల్లో ఆయనను ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి చేస్తారని బీజేపీ మీడియా చీఫ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ చెప్పారు. -
తూ.గో జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
తూర్పుగోదావరి: జిల్లాలోని రావులపాలెంలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలకు ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లాలోనే మొట్టమొదటిగా రావులపాలెం ఈ వ్యాధి వెలుగు చూడటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. గ్రామానికి చెందిన సత్తి వెంకటరెడ్డి భార్య నళిని ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. ఈమెకు తీవ్ర జ్వరం రావడంతో రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిమోనియా వ్యాధితో ఈమె మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఆమె ఇద్దరు కుమార్తెలు దీప్తి, శ్రీజలు కూడా నాలుగు రోజుల క్రితం జ్వరం బారిన పడటంతో వారిని కూడా రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రికి చేర్పించారు. వీరిలో దీప్తికి సాధారణ జ్వరం కాగా శ్రీజకు మాత్రం స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. వీరి సమీప బంధువు కర్రి వీరారెడ్డి నాలుగేళ్ల కుమార్తె హర్షిత కూడా జ్వరం బారిన పడటంతో కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఈమెకు కూడా స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించి చికిత్స అందజేస్తున్నారు. జిల్లాలో మొదటి సారిగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో డీఎంఆండ్‌హెచ్‌ఓ కె. చంద్రయ్య హుటాహుటిన రావులపాలెం చేరుకున్నారు. స్థానిక ఊబలంక పీహెచ్సీ వైద్య సిబ్బందితో కలసి బాధితులు ఇళ్ళ వద్ద పరిస్థితిని సమీక్షించారు. గాలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి మరింత మందికి సోకే అవకాశం ఉన్నందున అంతా జాగ్రత్తలు పాటించాలని ఆయా కుటుంబాల వారికి సూచించారు. గ్రామంలో ఏడు వైద్య బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేయించారు. ఎవరికైనా ఈ వ్యాధి సోకినట్లు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. -
జిల్లాలో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు
చాగలమర్రి : జిల్లా లో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ మీనాక్షి మహాదేవన్ తెలిపారు. మంగళవారం స్థానిక మార్కెట్ కాలనీలోని సల్లా నర్సింగ్ హోంను ఆమె పరిశీలించారు. ప్రసాద్ నర్సింగ్ హోం నిర్వాహకులు స్కానింగ్ సెంటర్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇందుకు కావాల్సిన వసతులు, వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో వైద్యులు కొరత ఉందని, అన్ని పీహెచ్‌సీలకు వైద్యులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రసాద్ నర్సింగ్ హోం వైద్యులు ప్రసాద్ ఉన్నారు. -
డోన్‌లో స్వైన్‌ప్లూ కేసు నమోదు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో మరో స్వైన్‌ప్లూ కేసు నమోదయింది. ఇప్పటికే కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్, నందికొట్కూరు మండలంలోని ప్రాతకోటకు చెందిన ఇద్దరికి స్వైన్‌ప్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తాజాగా డోన్‌కు చెందిన ఓ మహిళకు సైతం ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ మహిళ పది రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లొచ్చారు. జనవరి 31న స్వైన్‌ప్లూ లక్షణాలతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ తరలించారు. వైద్య పరీక్షల్లో స్వైన్‌ప్లూ ఉన్నట్లు నిర్థారించినట్లు ఎపడమాలజిస్టు మహేష తెలిపారు. -
స్వైన్ ఫ్లూ సైరన్
నిడదవోలు రూరల్: వాతావరణంలో మార్పులతో పాటు జిల్లాలో చలి తీవ్రంగా ఉండటంతో స్వైన్ ఫ్లూ భయం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో పాటు విశాఖలో ఈ వ్యాధితో ఇటీవల ఒకరు మృతిచెందడం, హైదరాబాద్ నుంచి జిల్లాకు ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించడంతో వ్యాధి వ్యాప్తిపై అధికారుల్లో టెన్షన్ నెలకొంది. స్వైన్ ఫ్లూ ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి వైద్యారోగ్యశాఖ నుంచి ఆదేశాలు అందడంతో జిల్లాస్థాయిలో అధికారులు ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు సమయాత్తమయ్యారు. గురువారం నుంచి ప్రధాన సెంటర్ల వద్ద అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటుతో పాటు మురికివాడలు, గ్రామాల్లో వైద్యసిబ్బందితో కరపత్రాలు పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. చలితీవ్రత ఎక్కువ ఉండటంతో జ్వరం, జలుబుతో పాటు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆçస్పత్రుల్లో వైద్యసేవలు పొందాలని, మాస్క్‌లు వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఏలూరు, తణుకు, భీమవరం ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేశామని అవసరమైతే ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక గది కేటాయిస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వి.కోటేశ్వరి తెలిపారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే రక్తనమూనాలను తిరుపతి కిమ్స్‌కు పంపించి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తామని చెప్పారు. వ్యాధిపై రెండురోజుల్లో వైద్య నివేదిక అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదుకాలేదని, ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. లక్షణాలు జ్వరం, విపరీతమైన దగ్గు, తలనొప్పిగా ఉండటం, ముక్కు నుంచి జలుబు కారడం, గొంతు నొప్పి, కండరాల నొప్పి, అలసట చెంది నీరసంగా ఉండటం స్వైన్ ఫ్లూ లక్షణాలు. జాగ్రత్తలిలా.. స్వైన్ ఫ్లూ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చేతులను శుభ్రంగా కడగాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు, ముక్కు నోటి దగ్గర చేతి రుమాలు, చేతిని అడ్డంగా పెట్టుకోవాలి. ఎవరినైనా కలిసినప్పుడు కరచలానం, కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటివి చేయకూడదు. ఎవరికివారే చేతి రుమాలు వాడాలి. శుభ్రం చేసుకోని చేతులతో కళ్లు, ముక్కు, నోరును తాకకూడదు. స్వైన్ ఫ్లూ సంబంధిత లక్షణాలు కనిపిస్తే స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. -
స్వైన్ ఫ్లూ సైరన్
నిడదవోలు రూరల్: వాతావరణంలో మార్పులతో పాటు జిల్లాలో చలి తీవ్రంగా ఉండటంతో స్వైన్ ఫ్లూ భయం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో పాటు విశాఖలో ఈ వ్యాధితో ఇటీవల ఒకరు మృతిచెందడం, హైదరాబాద్ నుంచి జిల్లాకు ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించడంతో వ్యాధి వ్యాప్తిపై అధికారుల్లో టెన్షన్ నెలకొంది. స్వైన్ ఫ్లూ ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి వైద్యారోగ్యశాఖ నుంచి ఆదేశాలు అందడంతో జిల్లాస్థాయిలో అధికారులు ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు సమయాత్తమయ్యారు. గురువారం నుంచి ప్రధాన సెంటర్ల వద్ద అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటుతో పాటు మురికివాడలు, గ్రామాల్లో వైద్యసిబ్బందితో కరపత్రాలు పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. చలితీవ్రత ఎక్కువ ఉండటంతో జ్వరం, జలుబుతో పాటు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆçస్పత్రుల్లో వైద్యసేవలు పొందాలని, మాస్క్‌లు వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఏలూరు, తణుకు, భీమవరం ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేశామని అవసరమైతే ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక గది కేటాయిస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వి.కోటేశ్వరి తెలిపారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే రక్తనమూనాలను తిరుపతి కిమ్స్‌కు పంపించి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తామని చెప్పారు. వ్యాధిపై రెండురోజుల్లో వైద్య నివేదిక అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదుకాలేదని, ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. లక్షణాలు జ్వరం, విపరీతమైన దగ్గు, తలనొప్పిగా ఉండటం, ముక్కు నుంచి జలుబు కారడం, గొంతు నొప్పి, కండరాల నొప్పి, అలసట చెంది నీరసంగా ఉండటం స్వైన్ ఫ్లూ లక్షణాలు. జాగ్రత్తలిలా.. స్వైన్ ఫ్లూ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చేతులను శుభ్రంగా కడగాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు, ముక్కు నోటి దగ్గర చేతి రుమాలు, చేతిని అడ్డంగా పెట్టుకోవాలి. ఎవరినైనా కలిసినప్పుడు కరచలానం, కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటివి చేయకూడదు. ఎవరికివారే చేతి రుమాలు వాడాలి. శుభ్రం చేసుకోని చేతులతో కళ్లు, ముక్కు, నోరును తాకకూడదు. స్వైన్ ఫ్లూ సంబంధిత లక్షణాలు కనిపిస్తే స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. -
స్వైన్‌ప్లూతో మహిళ మృతి
హైదరాబాద్: స్వైన్ ప్లూ వ్యాధితో గాంధీ ఆసుపత్రిలో ఓ మహిళ(58) మంగళవారం రాత్రి 10గంటల సమయంలో మృతి చెందిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన మహిళ ఈ నెల 12వ తేదీ నుంచి మెడిసిటీ, మాక్స్ క్యూర్ ఆసుపత్రులలో చికిత్స పొందింది. సోమవారం పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. దీంతో మంగళవారం రాత్రి 7గంటల సమయంలో గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ కాసేపటికి బాధితురాలు మృతి చెందింది. దీంతో స్వైన్ ప్లూతో ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. గాంధీలో మరో వృద్ధురాలు కూడా స్వైన్‌ప్లూ వ్యాధికి చికిత్స పొందుతోంది. -
స్వైన్‌ఫ్లూతో చిత్తూరు జిల్లా వాసి మృతి
గుడిపాల(చిత్తూరు జిల్లా): స్వైన్‌ఫ్లూతో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గుడిపాల మండలంలోని రెట్టగుంటకు చెందిన మోహన్‌నాయుడు (43) కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నాడు. వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో వారం క్రితం అతడిని కుటుంబ సభ్యులు వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే మూడు రోజుల క్రితం చేసిన వైద్య పరీక్షల్లో అతడు స్వైన్‌ఫ్లూ బారిన పడినట్లు నిర్ధారణైంది. పరిస్థితి విషమించి కోమాలోకి జారుకున్నాడు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. -
కర్నూలులో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు
కర్నూలు(హాస్పిటల్) : కర్నూలులో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ సోకింది. ఇందులో ఒకరు మహిళ కాగా, మరొకరు 5 సంవత్సరాలు బాలుడు. అలాగే తుగ్గలి మండలానికి చెందిన మరో మహిళ స్వైన్‌ఫ్లూ లక్షణాలతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతోంది. వివరాల మేరకు కర్నూలు నగరానికి చెందిన ఒక మహిళ స్వైన్‌ఫ్లూ లక్షణాలతో రెండు రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అనుమానిత కేసుగా గుర్తించిన వైద్యులు ఆమెకు స్వాప్ పరీక్ష చేసి శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో ఆమె స్వైన్‌ఫ్లూతో బాధ పడుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆసుపత్రిలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వైన్‌ఫ్లూ వార్డుకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అలాగే కర్నూలు పట్టణానికి చెందిన 5 సంవత్సరాల బాలుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో సోమవారం ఆసుపత్రిలోని పీడియాట్రిక్ విభాగంలో చేర్పించారు. కాగా బాలుని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఈ బాలున్ని ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డుకు తరలించారు. అలాగే తుగ్గలి మండలం పెండేకల్ గ్రామానికి చెందిన ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు సమాచారం. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధ పడుతున్న ఆమెను అక్కడినుంచి మంగళవారం రాత్రి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వైద్యపరీక్షలు చేసిన వైద్యులు స్వాప్ పరీక్షలు నిర్వహించి గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈమెను క్యాజువాలిటీ నుంచి స్వైన్‌ఫ్లూ వార్డుకు తరలించారు. -
మోదీ సొంత రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ స్వైరవిహారం
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్రమోదీ సొంతరాష్టమైన గుజరాత్లో స్వైన్ ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 347 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. సోమవారం తాజాగా మరో 92 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య జనవరి నుంచి ఇప్పటివరకు 5715 కు చేరిందని గుజరాత్ ఆరోగ్యశాఖ తెలిపింది. వారిలో ఇప్పటికి 4408 మందికి నయమైందని తెలిపింది. ఒక్క అహ్మదాబాద్ లోనే 1945 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వారిలో జనవరి నుంచి ఇప్పటివరకు 103 మంది మరణించారని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో గుజరాత్ లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి న్యూఢిల్లీకి చెందిన సఫ్దార్ గంజ్ హాస్తిటల్ కు చెందిన డాక్టర్ శివదాస్ చక్రవర్తి, ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ పవన్ తివారీలను కేంద్ర ప్రభుత్వం నియమించింది. -
ట్రైనీ ఐపీఎస్ అధికారులు డిశ్చార్జి
హైదరాబాద్: నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్ పీఏ)లో స్వైన్‌ఫ్లూ సోకి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారులను వైద్యులు డిశ్చార్జి చేసినట్లు నేషనల్ పోలీస్ అకాడమీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు పేర్కొన్నారు. కొత్తగా ఎలాంటి కేసులు లేవని వైద్యులు తెలిపారు. -
స్వైన్ ఫ్లూ పరీక్షలకు విశాఖలో ల్యాబ్
రాజమండ్రి: రాష్ట్రంలోని 13 జిల్లాలకూ సేవలందించేవిధంగా స్వైన్ ఫ్లూ పరీక్షల కోసం విశాఖలో త్వరలో మెడికల్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ఉభయ గోదావరి జిల్లాల అధికారులతో రాజమండ్రిలో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ...రాష్ర్టంలో ఇప్పటివరకూ తొమ్మిది స్వైన్‌ఫ్లూ మరణాలను గుర్తించామన్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు 13 జిల్లాల్లోనూ 13 మంది నోడల్ అధికారులను నియమించామన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుమతులు ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. విశాఖలో రెండు, తిరుపతి, శ్రీకాకుళంలో ఒక్కొక్కటి చొప్పున ఇప్పటికే అనుమతులు ఇచ్చామన్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో మెరుగైన వైద్య సేవలు ప్రారంభించామన్నారు. ఎవరైనా ఆసక్తి చూపితే రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కూడా దీనిని అమలు చేస్తామన్నారు. ఆరు వేల నర్సుల పోస్టుల భర్తీ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో 6 వేల స్టాఫ్‌నర్సుల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఏటా రెండు వేల చొప్పున పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రాజమండ్రి, మచిలీపట్నం, పొద్దుటూరు, నంద్యాల తదితర పది ఆస్పత్రుల్లో డిప్లమో ఇన్ నేషనల్ బోర్డు(డీఎన్బీ) కోర్సు ప్రారంభిస్తామని, తద్వారా నిపుణుల కొరతను తీర్చేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
స్వైన్ ఫ్లూతో గర్భిణి మృతి
ప్రకాశం: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో మహిళ ఈ మహమ్మారికి బలైంది. వివరాలు...మర్రిపూడి మండలం చిమటలో నివసిస్తున్న సునీత అనే గర్భిణికి స్వైన్ ఫ్లూ సోకింది. ఆమె చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరింది. అయితే మంగళవారం సాయంత్రం ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది. (మర్రిపూడి) -
స్వైన్ ఫ్లూతో మహిళ మృతి
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల పరిధిలోని గొలగమూడి గ్రామానికి చెందిన కుర్రకూటి మాధవీలతకు స్వైన్‌ప్లూ సోకినట్లుగా చెన్నై వైద్యులు నిర్ధారించిన విషయం తెలిసిందే. అయితే చెన్నైలో చికిత్స పొందుతున్న మాధవీలత (37) సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందింది. (వెంకటాచలం) -
స్వైన్‌ఫ్లూ కలకలం..
నెల్లూరు (అర్బన్): స్వైన్‌ఫ్లూ జిల్లాలో లేకపోయినా అడపాదడపా కలకలం రేపుతూనే ఉంది. వెంకటాచలం మండలంలోని ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెన్నైకి తీసుకెళ్లారు. నెల్లూరు నగరంలోని 20 రోజుల క్రితం ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. వెంకటాచలం మండలంలోని మహిళకు స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు జేసీ, నెల్లూరు ఆర్డీఓలు చెప్పారు. దీంతో ఆదివారం అధికార యంత్రాంగాన్ని కదిలించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ, మెడికల్ ఆఫీసర్, ఇతర అధికారులను వెంకటాచలానికి పంపినట్లు డీఎంహెచ్ఓ భారతీరెడ్డి తెలిపారు. అప్రమత్తత ఏదీ? ఇదిలా ఉండగా క్షేత్ర స్థాయిలో సిబ్బంది స్వైన్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉన్నట్లు కనిపించడంలేదు. కొద్ది రోజులుగా డీఎంహెచ్ఓ డాక్టర్ భారతీరెడ్డి నెల్లూరులోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో స్వైన్‌ఫ్లూపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. అలాగే ఆర్డీ, వైద్య విధాన పరిషత్ కార్యదర్శి ఒకరు డీఎస్సార్ ప్రభుత్వ ప్రధాన ఆసుప్రతిలో వార్డును సందర్శించి వెళ్లారు. వీటన్నింటిలో క్షేత్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే జిల్లాలో కరపత్రాల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా అధికారులు స్వైన్‌ఫ్లూపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. -
స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి
చిలకలగూడ(హైదరాబాద్): స్వైన్‌ఫ్లూ వైరస్ కారణంగా ఆరు నెలల గర్భిణి మృతి చెందింది. నల్లగొండకు చెందిన పర్వీన్ (32) ఆరు నెలల గర్భిణి. ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో జిల్లా ఆస్పత్రి వైద్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేర్చాలని సూచించారు.. దీంతో ఈ నెల 5న పర్వీన్‌ను ఆమె కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. దీంతో ఈ ఏడాది గాంధీలో స్వైన్‌ఫ్లూతో మరణించిన వారి సంఖ్య 32కు చేరింది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో 27 మంది స్వైన్ ఫ్లూ బాధితులకు, పీఐసీయూలో ఏడుగురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా 44 మంది స్వైన్‌ఫ్లూ అనుమానితులు కూడా చికిత్స పొందుతున్నారు. -
స్వైన్ ఫ్లూతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని మృతి
సెంట్రల్ యూనివర్సిటీ(హైదరాబాద్): సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న సుధా నిర్మల అనే విద్యార్థిని స్వైన్ ఫ్లూతో మృతిచెందింది. జ్వరంతో బాధపడుతున్న ఆమెను శేరిలింగంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారం రోజుల క్రితం చేర్చారు. చికిత్స పొందుతున్న ఆమె గురువారం మృతి చెందింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన సుధా నిర్మల సెంట్రల్ యూనివర్సిటీలో పీడీఎఫ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. -
స్వైన్‌ఫ్లూతో విద్యార్థి మృతి
మహబూబ్‌నగర్: స్వైన్‌ఫ్లూతో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరుకు చెందిన ఓ విద్యార్థి గురువారం మృతి చెందాడు. వివరాలు... కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన ఓ కుటుంబం మండల కేంద్రానికి వచ్చి స్థిరపడ్డారు. వారి కొడుకు ప్రణయ్‌పాల్(13) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో స్థానిక ఆస్పత్రుల్లో వైద్యం చేయించగా స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.అప్పటికే అతని ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందాడు. (కొత్తూరు) -
స్వైన్ ఫ్లూతో అప్పుడే పుట్టిన శిశువు మృతి
గ్వాలియర్: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో స్వైన్ ఫ్లూ సోకి అప్పుడే పుట్టిన శిశువుతో పాటు, మరో వ్యక్తి మృతి చెందారు. స్థానిక కమలరాజా ప్రభుత్వాసుపత్రిలో సోమవారం జన్మించిన శిశువు తెల్లవారు జామున 4 గంటల సమయంలో స్వైన్ ఫ్లూ బారిన పడి మృతి చెందింది. ఈ విషయాన్ని వైద్య ఉన్నతాధికారి డాక్టర్ అనూప్ కామనాథ్ ధృవీకరించారు. దీంతో పాప తల్లి సుమన్ ను ఆస్పత్రిలోని ప్రత్యేక గదికి మార్చి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిణామాలతో వైద్య బృందాన్ని న్యూసంజయ్ నగర్ ప్రాంతానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
మహిళకు స్వైన్‌ఫ్లూ
మంచిర్యాల టౌన్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. జిల్లాలోని కాశీపేట మండలం రొట్టపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోగుల సరోజ (35) జ్వరం, దగ్గు తదితర వ్యాధి లక్షణాలతో మూడు రోజుల క్రితం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు స్వైన్‌ఫ్లూగా అనుమానించి ఆమె రక్త నమూనాలను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపారు. స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు (పాజిటివ్) సోమవారం ఆస్పత్రికి సమాచారం అందడంతో, బాధితురాలికి సత్వరమే ప్రత్యేక వైద్య చికిత్సలు ప్రారంభించారు. -
తిప్పర్తిలో రైతుకు స్వైన్ ఫ్లూ
నల్లగొండ: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం చిన్నాయిగూడెంలో ఒక స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. వివరాలు.. చిన్నాయిగూడెంకు చెందిన ఒక రైతు జ్వరంతో జనవరి 30న నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు సోమవారం మధ్యాహ్నం అతనికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. ఆయనను నరపతేరక వాడకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. -
వృద్ధుడికి స్వైన్‌ఫ్లూ..
అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన ఓ వృద్ధుడికి స్వైన్‌ఫ్లూ సోకింది. ఇతను హైదరాబాద్‌లో చికిత్స పొందినా పూర్తిగా నయం కాకపోవడంతో ప్రస్తుతం అనంతపురం సర్వజనాస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పట్టణంలోని కొండప్ప బావి వద్ద నివాసముంటుంటున్న ఆయన జనవరి 25న హైదరాబాదులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో 27న కేర్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షించి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. చికిత్స అనంతరం అతను శనివారం రాత్రి ఉరవకొండకు చేరుకున్నాడు. ఈ విషయం తెలిసి జిల్లా డిప్యూటీ వైద్యాధికారి(డీఎంఅండ్‌హెచ్‌ఓ) డాక్టర్ చౌదరి, తహసీల్దార్ చౌడప్ప, సర్పంచ్ నర్రా సుజాత ఆదివారం బాధితుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో వివరాలు సేకరించారు. రోగి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ గుర్తించారు. విషయాన్ని జిల్లా కలెక్టరుకు, జిల్లా వైద్యాధికారి(డీఎంఅండ్‌హెచ్‌ఓ)కు ఫోన్లో తెలిపారు. వారి సూచన మేరకు ఖురేషీని 108 వాహనంలో అనంతపురం జనరల్ ఆస్పత్రికి తరలించారు. (ఉరవకొండ) -
స్వైన్‌ఫ్లూతో మరో ముగ్గరు మృతి
హైదరాబాద్(గాంధీ ఆస్పత్రి): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు స్వైన్‌ఫ్లూ బాధితులు శనివారం మృతిచెందారు. దీంతో జనవరి నెలలో గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య 21కు పెరిగింది. నల్లకుంటకు చెందిన బాబురావు (77), చంచల్‌గూకు చెందిన మహతాకాతూన్ (65), కర్నూలుజిల్లాకు చెందిన గర్భిణీ సరస్వతి (32)లు వివిధ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి రిఫరల్‌పై గాంధీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఒకరు, శనివారం ఉదయం మరో ఇద్దరు మృతిచెందినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. గాంధీ ఐసోలేషన్ వార్డులో 35మంది స్వైన్‌ఫ్లూ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని, వీరిలో 12మంది చిన్నారులున్నారని వైద్యులు తెలిపారు. లోటస్ ఆస్పత్రి నుంచి రిఫరల్‌పై వచ్చిన 20 రోజులు వయసుగల ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో 27మంది అనుమానితులకు డిజాస్టర్, ఏఎంసీ వార్డులో వైద్యచికిత్సలు అందిస్తున్నామన్నారు. శనివారం స్వైన్‌ఫ్లూ ఓపీ విభాగంలో 74మందికి వైద్యసేవలు అందించామని, వీరిలో 34మంది చిన్నారులున్నారని, మందులు అందించి హోం ఐసోలేషన్‌లో ఉంచామని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
'స్వైన్‌ఫ్లూ మరణాలకు సీఎం కేసీఆర్‌దే బాధ్యత'
తెలంగాణలో స్వైన్‌ఫ్లూ మరణాలకు సీఎం కేసీఆర్‌దే బాధ్యతని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క శుక్రవారం అన్నారు. మున్సిపల్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తోన్న కేసీఆర్ పరిసరాల పరిశుభ్రతను విస్మరించారని భట్టి పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్లే స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రబలిందని, ఈ వైఫల్యాన్ని ఆరోగ్యశాఖపై నెడుతూ సీఎం కేసీఆర్ తప్పించుకోవడం సరికాదని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. -
స్వైన్‌ఫ్లూ ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ (104)
-
స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్‌తో ప్రయోజనం లేదు: నరేంద్రనాథ్
స్వైన్‌ఫ్లూ నివారణకు వ్యాక్సిన్‌తో ప్రయోజనం ఉండదని, పరిసరాల పరిశుభ్రతే ఉత్తమ మార్గమని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ అన్నారు. స్వైన్‌ఫ్లూ సంబంధిత ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ (104) ఏర్పాటు చేశామని నిమ్స్ డైరెక్టర్ చెప్పారు. స్వైన్‌ఫ్లూ వ్యాధిపై వైద్యులకు, సిబ్బందికి కౌన్సెలింగ్ ఇచ్చామని, అన్ని జిల్లా ఏరియా ఆస్పత్రులకు స్వైన్‌ఫ్లూ మందులు చేరాయని నరేంద్రనాథ్ తెలిపారు. స్వైన్‌ఫ్లూతో ఇప్పటివరకూ 20 మృతిచెందారని ఆయన తెలిపారు. 754 మందికి పరీక్షలు చేయించగా, 249 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలిందని నరేంద్రనాథ్ చెప్పారు.