
స్వైన్ ఫ్లూతో గర్భిణి మృతి
రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రకాశం: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో మహిళ ఈ మహమ్మారికి బలైంది. వివరాలు...మర్రిపూడి మండలం చిమటలో నివసిస్తున్న సునీత అనే గర్భిణికి స్వైన్ ఫ్లూ సోకింది. ఆమె చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరింది. అయితే మంగళవారం సాయంత్రం ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది.
(మర్రిపూడి)