గ్వాలియర్: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో స్వైన్ ఫ్లూ సోకి అప్పుడే పుట్టిన శిశువుతో పాటు, మరో వ్యక్తి మృతి చెందారు. స్థానిక కమలరాజా ప్రభుత్వాసుపత్రిలో సోమవారం జన్మించిన శిశువు తెల్లవారు జామున 4 గంటల సమయంలో స్వైన్ ఫ్లూ బారిన పడి మృతి చెందింది. ఈ విషయాన్ని వైద్య ఉన్నతాధికారి డాక్టర్ అనూప్ కామనాథ్ ధృవీకరించారు.
దీంతో పాప తల్లి సుమన్ ను ఆస్పత్రిలోని ప్రత్యేక గదికి మార్చి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిణామాలతో వైద్య బృందాన్ని న్యూసంజయ్ నగర్ ప్రాంతానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.