స్వైన్ ఫ్లూతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని మృతి
సెంట్రల్ యూనివర్సిటీ(హైదరాబాద్): సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న సుధా నిర్మల అనే విద్యార్థిని స్వైన్ ఫ్లూతో మృతిచెందింది. జ్వరంతో బాధపడుతున్న ఆమెను శేరిలింగంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారం రోజుల క్రితం చేర్చారు. చికిత్స పొందుతున్న ఆమె గురువారం మృతి చెందింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన సుధా నిర్మల సెంట్రల్ యూనివర్సిటీలో పీడీఎఫ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.