
మహిళకు స్వైన్‌ఫ్లూ
మంచిర్యాల టౌన్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. జిల్లాలోని కాశీపేట మండలం రొట్టపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోగుల సరోజ (35) జ్వరం, దగ్గు తదితర వ్యాధి లక్షణాలతో మూడు రోజుల క్రితం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు స్వైన్‌ఫ్లూగా అనుమానించి ఆమె రక్త నమూనాలను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపారు. స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు (పాజిటివ్) సోమవారం ఆస్పత్రికి సమాచారం అందడంతో, బాధితురాలికి సత్వరమే ప్రత్యేక వైద్య చికిత్సలు ప్రారంభించారు.