
తిప్పర్తిలో రైతుకు స్వైన్ ఫ్లూ
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం చిన్నాయిగూడెంలో ఒక స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది.
నల్లగొండ: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం చిన్నాయిగూడెంలో ఒక స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. వివరాలు.. చిన్నాయిగూడెంకు చెందిన ఒక రైతు జ్వరంతో జనవరి 30న నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు సోమవారం మధ్యాహ్నం అతనికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. ఆయనను నరపతేరక వాడకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.